Showing posts with label సెక్రేటరి -1976. Show all posts
Showing posts with label సెక్రేటరి -1976. Show all posts

Thursday, March 26, 2015

సెక్రేటరి -1976



సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::V.రామకృష్ణ 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,చంద్రమోహన్,రంగనాథ్,రాజబాబు,కాంచన,రమాప్రభ,సూర్యకాంతం

పల్లవి::

మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం
మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం

మనిషికెక్కడ వున్నది స్వర్గం
మరణమేనా దానికి మార్గం
మనసులేని బ్రతుకొక నరకం 

చరణం::1

మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది
దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండా పోతుంది
ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది
పంచుకునే ఒక మనసుంటేనే బంధమై అది నిలిచేది
మనసులేని బ్రతుకొక నరకం 

చరణం::2

మరువలేనిది మాసిపోదు..మాసిపోనిది మరలి రాదు
మరువలేనిది మాసిపోదు..మాసిపోనిది మరలి రాదు
రానిదానికై కన్నీళ్లు..రానిదానికై కన్నీళ్లు
రాతి బొమ్మకు నైవేద్యాలు 
మనసులేని బ్రతుకొక నరకం

చరణం::3

తరుముకొచ్చే జ్ఞాపకాలు..ఎదను గుచ్చే గులాబి ముళ్ళు
గురుతు తెచ్చే అందాలు..కూలిపోయిన శిల్పాలు

కన్ను నీదని..వేలు నీదని..పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం
మనసులేని బ్రతుకొక నరకం..మరువలేని మనసొక నరకం
మనిషికెక్కడ వున్నది స్వర్గం..మరణమేనా దానికి మార్గం
మనసులేని బ్రతుకొక నరకం..మ్మ్ మ్మ్ 

Tuesday, September 01, 2009

సెక్రేటరి ~~ 1973



సంగీతం::KVమహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


చాటు మాటు సరసంలో..ఘాటువున్నదీ
ఘాటైన ప్రేమకూ..ఆటుపోటులున్నవీ
ఆట్లుపోట్లకవి జడవనన్నదీ..
అందుకే..మనమిలా..కలుసుకొన్నదీ..
కలుసుకొన్నదీ...
చాటుమాటు సరసంలో..ఘాటువున్నదీ..

పరువూ గిరువు..పగ్గాలన్నీ తెగ తెంచేసీ..
పైలా పచ్చీ పదహారేళ్ళను..కలబోసేసీ..2
పగలూ..రేయీ..గీసే..పరుగులు..నిలవేసేసీ..2
పరవానంత జుర్రుకొంద్దాం..పగబట్టేసీ..
అ..హా..అ..హా..అ..హా..అ..హా

చాటు మాటు సరసంలో..ఘాటువున్నదీ
ఘాటైన ప్రేమకూ..ఆటుపోటులున్నవీ
ఆట్లుపోట్లకవి జడవనన్నదీ..
అందుకే..మనమిలా..కలుసుకొన్నదీ..
కలుసుకొన్నదీ...ఆ..హాహా..
చాటుమాటు సరసంలో..ఘాటువున్నదీ..

చాకులాంటి యవ్వనాన్ని వాడిపోనీకూ..
సాకులెన్ని చెప్పుకొన్నా..వాడిరాబోదూ..2
ఆకుచాటు పూవల్లే..అణిగి ఉండకూ..2
నీకు నేనూ..నాకు నివ్వని..నిలబడి చూడూ..
ఆ అ హా..ఆ అ హా.. ఆ అ హా..ఆ అ హా..

చాటు మాటు సరసంలో..ఘాటువున్నదీ
ఘాటైన ప్రేమకూ..ఆటుపోటులున్నవీ
ఆట్లుపోట్లకవి జడవనన్నదీ..
అందుకే..మనమిలా..కలుసుకొన్నదీ..
కలుసుకొన్నదీ......
లాల్ల..లాల..లలలలా..లాలలాలలా...

సెక్రేటరి ~~ 1973



సంగీతం::KVమహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


ఆకాశమంత పందిరివేసి..భూదేవంత పీటవేసి
చిట్టిపొట్టి బొమ్మలపెళ్ళి..చేత్తం రారండీ
తీయనిలడ్డు..పాయసాలు..తింద్దాం రారండీ..2

చిట్టిపొట్టి బొమ్మలేనని బ్రమలో పడకండీ
చేసేద్దాము వాళ్ళకు పెళ్ళని తొందరపడకండీ
ఏం..బొమ్మలేగా.....?
మట్టిబొమ్మలని అనుకొన్నామా..
మనసులున్నవీ..ఇద్దరికీ..
గాజుబొమ్మలని అనుకోలేమూ..
కనపడవూ..ఆ..మనసులు పైకీ

ఒకరికి..పొగరూ..ఒకరికి..బిగువూ..
ఒద్దిక కుదిరే..దెన్నటికీ..

ఆకాశమంత పందిరివేసి..భూదేవంత పీటవేసి
చిట్టిపొట్టి బొమ్మలపెళ్ళి..చేత్తం రారండీ
తీయనిలడ్డు..పాయసాలు..తింద్దాం రారండీ

చిట్టి..చిట్టి..మా అబ్బాయి కృష్ణుడోయమ్మా..
పొట్టి..పొట్టి..మీ అమ్మాయి రుక్మిణేనమ్మా..
చిట్టి..చిట్టి..మా అబ్బాయి కృష్ణుడోయమ్మా..
పొట్టి..పొట్టి..మీ అమ్మాయి రుక్మిణేనమ్మా..

కాదమ్మా..కానేకాదు..
రుక్మిణి ఎంతో..గడుసరిది..
తన వలపులు అతనికి తెలిపినదీ
ఆ..వలచిన వానిని..పొందినదీ..

చిన్నతనాన బొమ్మలపెళ్ళీ..చేస్తారూ..
పెరిగి తామే..పెళ్ళి బొమ్మలై..పోతారూ..
ఆటకాదు..పెళ్ళంటే..బొమ్మాకాదు..మనిషంటే..

ఆకాశమంత పందిరివేసి..భూదేవంత పీటవేసి
చిట్టిపొట్టి బొమ్మలేనని బ్రమలో పడకండీ
చేసేద్దాము వాళ్ళకు పెళ్ళని తొందరపడకండీ

చిట్టిపొట్టి కథలే నువ్వు..చెప్పెస్తున్నావూ
చెప్పవమ్మ..ఎక్కడనువ్వు..చదివా ఈ కథనూ
మనిషి మనిషికీ..కథ వుంటుందమ్మా..
బ్రతును మించిన కథ ఏమున్నది
చదువులు ఎందుకు దానికీ..
మనసును చదివే..మనసుంటే..
కథ మలుపు తిరగదా..ఎన్నటికీ..

తీరిన కథనూ..తిరిగి వ్రాసితే..
తీయగ ఉండదూ..ఎవ్వరికీ...

ఆకాశమంత పందిరివేసి..భూదేవంత పీటవేసి
చిట్టిపొట్టి బొమ్మలపెళ్ళి..చేత్తం రారండీ
తీయనిలడ్డు..పాయసాలు..తింద్దాం రారండీ

Monday, August 31, 2009

సెక్రేటరి ~~ 1973



సంగీతం::KV. మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల, P. సుశీల


పెదవి విప్పలేను..మనసు చెప్పలేను..ఏం..
పెదవికి ఊహలు లేనే లేవు..మనసుకు మాటలు రావు

పెదవి విప్పలేను..మ్మ్ హు..మనసు చెప్పలేను..ఏం..
పెదవికి ఊహలు లేనే లేవు..మనసుకు మాటలు రావు

మ్మ్ హు..హూ..మ్మ్ హు హూ..
కౌగిలింతలో..నలిగిపోతున్నా...
కళ్ళుమూతపడీ..తేలిపోతున్నా..
కౌగిలింతలో..హహహ..నలిగిపోతున్నా...హాయ్
కళ్ళుమూతపడీ..తేలిపోతున్నా..ఆ..ఎక్కడికీ
ఎన్నడుచూడని స్వర్గానికీ..
ఎన్నడుచూడని స్వర్గానికీ..
అక్కాదొరికే అమౄతానికీ..ఆపైనా..

పెదవి విప్పలేను..మ్మ్ హు..మ్మ్ హు..
మనసు చెప్పలేను....
పెదవికి ఊహలు లేనే లేవు..
మనసుకు మాటలు రావు..ఉహూ..

అబ్భా..ఏం..ముద్దుముద్దుకూ..
కరిగిపోతున్నా..
మోహవాహినిలో..కలిసిపోతున్నా
ముద్దుముద్దుకూ..హా..కరిగిపోతున్నా
మోహవాహినిలో..కలిసిపోతున్నా..ఆ..ఎక్కడికీ
నాలో ఇమిడిన నీలోనికీ..
నాలో ఇమిడిన నీలోనికీ..
నీలో పెరిగే నాలోనికీ..ఆపైనా..

పెదవి విప్పలేను..మ్మ్ హు..ఆహా..హా..
మనసు చెప్పలేను....
పెదవికి ఊహలు లేనే లేవు..
మనసుకు మాటలు రావు..ఉహూ..

సెక్రేటరి ~~ 1973



సంగీతం::KV. మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P. సుశీల


మొరుటోడు నా మొగుడు..మోజుపడి తెచ్చాడు
మువ్వన్నెజరీచీర ఇన్నాళ్ళకూ...

జగమొండి నా పెళ్ళాం..మువ్వన్నెచీరకట్టి
ముద్దొస్తు ఉన్నదీ నాకళ్ళకూ...
డడడ..డడడ...డడడడా... 2

తెచ్చానే మల్లెదండా..తురిమానే జడనిండా
చూసుకోవే నావలపు వాడకుండా..

నా మనసు నిండుకుండా..అదివుంటుంది తొణకుండా
నీ వలపే దానికీ అండదండ...
డడడ..డడడ...డడడడా...డడడ..డడడ...డడడడా...

మొరుటోడు నా మొగుడు..మోజుపడి తెచ్చాడు
మువ్వన్నెజరీచీర ఇన్నాళ్ళకూ...

జగమొండి నా పెళ్ళాం..మువ్వన్నెచీరకట్టి
ముద్దొస్తు ఉన్నదీ నాకళ్ళకూ

నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు
నిలబడి చూసుకొంటా అందాలూ...
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు
నిలబడి చూసుకొంటా అందాలూ

విల్లంటి కనుబొమ్మలూ..విసిరేను బాణాలూ..
విరిగిపోవునేమొనీ అద్దాలూ...
డడడ..డడడ..డడడడా..డడడ..డడడ..డడడడా...

మొరుటోడు నా మొగుడు..మోజుపడి తెచ్చాడు
మువ్వన్నెజరీచీర ఇన్నాళ్ళకూ...

జగమొండి నా పెళ్ళాం..మువ్వన్నెచీరకట్టి
ముద్దొస్తు ఉన్నదీ నాకళ్ళకూ

తమలపాకు పాదాలూ..తాళ్ళలేవే కడియాలూ
దిద్దుతానె ముద్దులతో పారాణులూ...

నీ ముద్దులే మువ్వలూ..ఆ మోతలు నా నవ్వులూ
ఆ పారాణికి వస్తాయి ప్రాణాలు
డడడ..డడడ..డడడడా..డడడ..డడడ..డడడడా...

మొరుటోడు నా మొగుడు..మోజుపడి తెచ్చాడు
మువ్వన్నెజరీచీర ఇన్నాళ్ళకూ...

జగమొండి నా పెళ్ళాం..మువ్వన్నెచీరకట్టి
ముద్దొస్తు ఉన్నదీ నాకళ్ళకూ
డడడ..డడడ..డడడడా..డడడ..డడడ..డడడడా...

Monday, June 01, 2009

సెక్రటరీ--1976



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::V.రామకృష్ణ 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,చంద్రమోహన్,రంగనాథ్,రాజబాబు,కాంచన,రమాప్రభ,సూర్యకాంతం

పల్లవి::

ఏ..హే..ఏఏఏఏఏఏఏఏ..హే.. 
నా పక్కన చోటున్నది ఒక్కరికే
ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
నా పక్కన చోటున్నది ఒక్కరికే
ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే
నువ్వే..అది నువ్వే నువ్వే నువ్వే   
నా పక్కన చోటున్నది ఒక్కరికే  
ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే 
నువ్వే..అది నువ్వే నువ్వే నువ్వే   

చరణం::1

కాళిదాసు కంటబడిన కన్నెపిల్లవు 
కాలమంత ఒంటరిగా ఉండలేవు 
కాళిదాసు కంటబడిన కన్నెపిల్లవు 
కాలమంత ఒంటరిగా ఉండలేవు
వాసనే చూడనట్టి వన్నె పువ్వువు 
వాసనే చూడనట్టి వన్నె పువ్వువు 
ఆశలన్ని గుండెలో అణుచుకోకు 
నా పక్కన చోటున్నది ఒక్కరికే  
ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే 
నువ్వే..అది నువ్వే నువ్వే నువ్వే   

చరణం::2

పెదవిమీద పేరు వ్రాసి పెట్టలేదు 
అమృతానికి ఎన్నడూ అంటులేదు 
పెదవిమీద పేరు వ్రాసి పెట్టలేదు 
అమృతానికి ఎన్నడూ అంటులేదు 
కోరికలకు కుర్ర తనం జారిపోదు 
కౌగిలిలో వెచ్చదనం ఒదులుకోకు 
నా పక్కన చోటున్నది ఒక్కరికే  
ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే 
నువ్వే..అది నువ్వే నువ్వే నువ్వే 

చరణం::3

కడిగిన ముత్యమా రాపడని వజ్రమా 
మొగలి పువ్వులా నీవు ముడుచుకోకుమా
కడిగిన ముత్యమా రాపడని వజ్రమా 
మొగలి పువ్వులా నీవు ముడుచుకోకుమా
పొగరు నీ సొగసును పొగుడుతున్నది 
పొగరు నీ సొగసును పొగుడుతున్నది 
వగరైన తిక్క నీకు నగవంటిది

Secretary--1976
Music::K.V.Mahadevan
Lyrics::Atreya
Singer::V.Ramakrishna
Cast::Akkineni,Vanisri,Chandramohan,Ranganath,Rajababu,Kanchana,Ramaprabha,Sooryakantam,Jayasudha,Y Vijaya,Kalpanara

:::

naa pakkana chotunnadi okkarike
aa okkaru evarannadi neekeruke
naa pakkana chotunnadi okkarike
aa okkaru evarannadi neekeruke 
nuvve adi nuvve nuvve nuvve   
naa pakkana chotunnadi okkarike
aa okkaru evarannadi neekeruke 
nuvve adi nuvve nuvve nuvve   

:::1

kaalidaasu kantabadina kannepillavu
kaalamanta ontarigaa undalevu 
kaalidaasu kantabadina kannepillavu
kaalamana ontarigaa undalevu
vaasane choodanatti vanne puvvuvu
vaasane choodanatti vanne puvvuvu 
aasalanni gundelo anuchukoku 
naa pakkana chotunnadi okkarike
aa okkaru evarannadi neekeruke 
nuvve adi nuvve nuvve nuvve   

:::2

pedavi meeda peruvraasi pettaledu
amrthaaniki ennadoo antuledu 
pedavi meeda peruvraasi pettaledu
amrthaaniki ennadoo antuledu 
korikalaku kurratanam jaaripodu
kaugililo vechchadanam odulukoku 
naa pakkana chotunnadi okkarike
aa okkaru evarannadi neekeruke 
nuvve adi nuvve nuvve nuvve   

:::3

kadigina muthyamaa raapadani vajramaa
mogali puvvulaa neevu muduchukokumaa
kadigina muthyamaa raapadani vajramaa
mogali puvvulaa neevu muduchukokumaa
pogaru nee sogasunu pogudutunnadi
pogaru nee sogasunu pogudutunnadi 
vagaraina tikka neeku nagavantidi