సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,జయలలిత
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,S.V.రంగారావు,జమున,జయలలిత
పల్లవి::
అనరాదే బాలా..కాదనరాదే బేలా
ఆ.ఆ..అనరాదే బాలా..కాదనరాదే బేలా
కొమ్ములు తిరిగిన మగరాయుడు
నిన్ను కోరి కోరి పెళ్ళాడెదనంటే
అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆ
ఏమ్..అంటే..ఏమ్
చరణం::1
అంటే ఏమనబోకు..తగు జంట కుదిరినది మనకు
అంటే ఏమనబోకు..తగు జంట కుదిరినది మనకు
ఇక నీవాడింది ఆట..పాడింది పాట సరిసరిగ తీరు ఉబలాట
అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ
చరణం::2
మరీ..వాడో
వాడి భయము నీకేలా..నేనున్నాగా నీ మ్రోల
వాడి భయము నీకేలా..నేనున్నాగా నీ మ్రోల
నా మాట విని..అవుననుము
ఆ పైని వేడుక..కనుగొనుమూ
అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ
చరణం::3
అహ..హ హ హ హ ఓ ఓ ఓ హో..
ఆగుము..ఇది అంగ రంగ వైభోగము
అనుమానమింక విడనాడుము..ఇటు చూడుము
మురిపాలు మీర సరదాలు తీర
జిగిగా బిగిగా నగుమా..పక పక పక
హ హ హ హ హ హ హ హ హ
అనరాదే బాలా..కాదనరాదే బేలా
కొమ్ములు తిరిగిన మగరాయుడుని
నిను కోరి కోరి..పెళ్ళాడెదనంటే
అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆఆఆ
No comments:
Post a Comment