సంగీతం::ఘంటసాల
రచన::పింగళి
గానం::P.సుశీల
తారాగణం::N.T. రామారావు, జమున, గుమ్మడి,పండరీబాయి,రాజనాల,
మిక్కిలినేని,హేమలత, రమణారెడ్డి,
పల్లవి::
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి
విరహమె నీకు శీతలమైతే..ఆఆఆఆ
విరహమె నీకు శీతలమైతే..వెచ్చని కౌగిట ఊచెదనోయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి
చరణం::1
కనుచూపులతో పలుకరింపగ..కందిపోతివా పాపాయి
కనుచూపులతో పలుకరింపగ..కందిపోతివా పాపాయి
ఉగ్గుపోసి నీ సిగ్గు..వదలగా
ఉగ్గుపోసి నీ నీ సిగ్గు వదలగ..తమలపాకుతో విసిరెదనోయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి
చరణం::2
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి..ఓ ఓ
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి
మూగమనసె నీ మోజైతే
మూగమనసె నీ మోజైతే..మాటాడక జరిగేరెదనోయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి
విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి..ఐసవుతావా అబ్బాయి
No comments:
Post a Comment