Monday, March 23, 2015

రాక్షసుడు--1991

సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్
నీ ప్రేమలేఖ నేనందుకున్నా..ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి

నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ
నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ

చరణం::1

ప్రేమల్లో అ ఆ లు..సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు..సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
హే..ప్రేమల్లో అ ఆ లు..సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు..సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను

వరించి వస్తున్నా..వయ్యారమింక
తపించిపోతున్నా చెలాకి పిల్లా
కలగా మెరిసి కథలే తెలిసి సొదలే విరిసే

నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ
నీ ప్రేమలేఖ నేనందుకున్నా..ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి
హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్
హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్

చరణం::2

కళ్ళల్లో నాట్యాలు గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పత్యాలు బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు
కళ్ళల్లో నాట్యాలు గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పత్యాలు బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు

వయస్సు నీతోనే వసంతమాడే
సుగంధరాగాల ఉగాది నేడే
ఎదలో మెదిలే సొదలే కథలే ముదిరి మనసే కుదిరే

హెయ్ నాటీ లవ్ బాయ్..ఐ లవ్ యూ బేబీ
నీ ప్రేమలేఖ నేనందుకున్నా..ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి
హెయ్ నాటీ లవ్ బాయ్..ఈ బ్యూటీ నీదోయ్
నీ రూపే రూబీ..ఐ లవ్ యూ బేబీ

No comments: