Saturday, January 31, 2015

కిలాడి--1985



సంగీతం::ఇళయరాజ
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::కమల్‌హాసన్,అంబిక 

పల్లవి::

అమనిలా పాడు మల్లియలా చూడు 
అమనిలా పాడు మల్లియలా చూడు
కళ్ళల్లో కొలువున్నావు గుండెల్లో జత కోరేవు 
శత కోటి పూల...పొంగువో
అమనిలా పాడు మల్లియలా చూడు

చరణం::1

నన్నే మురిపించే వరమో వలపే విరిసే 
నీ కన్నుల చిలికే స్వరమో కలలై కురిసే 
నన్నే మురిపించే వరమో వలపే విరిసే 
నీ కన్నుల చిలికే స్వరమో కలలై కురిసే 
సాగరం ఉప్పొంగు రీతి సాగే బంధమే 
ఈ క్షణం వరాల ప్రేమ నాకు ప్రాణమే 
సోయగం నా బంధనం నందనం హరిచందనం 
నే నే నీవు..హోయ్ హోయ్
అమనిలా పాడు మల్లియలా చూడు 
అమనిలా పాడు మల్లియలా చూడు
కళ్ళల్లో కొలువున్నావు గుండెల్లో జత కోరేవు 
శత కోటి పూల...పొంగువో
అమనిలా పాడు మల్లియలా చూడు 

చరణం::2

ఊరించే అల్లరి తలపే ఉరేగేనే
మరిపించే ఊహలు తెలిపే నా ఎదలోనే 
ఊరించే అల్లరి తలపే ఉరేగేనే
మరిపించే ఊహలు తెలిపే నా ఎదలోనే 
తీయని రాగాలతోటి పల్లవిన్చునే 
తీరని స్వప్నాలు నేడు ఆలకించెనె 
ఈ క్షణం...నీవే జగం 
జీవితం నీకంకితం నేనే నీవు..హో హో
అమనిలా పాడు మల్లియలా చూడు 
అమనిలా పాడు మల్లియలా చూడు
కళ్ళల్లో కొలువున్నావు గుండెల్లో జత కోరేవు 
శత కోటి పూల...పొంగువో

Kiladi--1985
Music::IlayaRaja
Lyrics::Rajasri
Singer::S.Janaki,S.P.Baalu
Cast::Kamalahasan,Ambika.

::::

amanilaa paaDu malliyalaa chooDu 
amanilaa paaDu malliyalaa chooDu
kaLLallO koluvunnaavu gunDellO jata kOrEvu 
Sata kOTi poola...ponguvO
amanilaa paaDu malliyalaa chooDu

::::1

nannE muripinchE varamO valapE virisE 
nee kannula chilikE swaramO kalalai kurisE 
nannE muripinchE varamO valapE virisE 
nee kannula chilikE swaramO kalalai kurisE  
saagaram uppongu reeti saagE bandhamE 
ee kshaNam varaala prEma naaku praaNamE
sOyagam naa bandhanam nandanam harichandanam 
nE nE neevu..hOy..hOy

amanilaa paaDu malliyalaa chooDu 
amanilaa paaDu malliyalaa chooDu
kaLLallO koluvunnaavu guNDellO jata kOrEvu 
Sata kOTi poola...ponguvO
amanilaa paaDu malliyalaa chooDu 

::::2

UrinchE allari talapE UrEgenE
maripinchE Uhalu telipE naa edalOnE 
UrinchE allari talapE UrEgenE
maripinchE Uhalu telipE naa edalOnE
teeyani raagaalatOTi pallavinchunE 
teerani swapnaalu nEDu aalakinchenE 
ee kshaNam...neevE jagam 
jeevitam neekankitam nEnE neevu..hO hO
amanilaa paaDu malliyalaa chooDu 
amanilaa paaDu malliyalaa chooDu
kaLLallO koluvunnaavu gunDellO jata kOrEvu 
Sata kOTi poola...ponguvO

Friday, January 30, 2015

స్వాతి--1984






















సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందర్‌రామమూర్తి  
గానం::S.P.బాలు,S.P.శైలజ
Film Directed By::Kraanti Kumaar 
తారాగణం::భానుచందర్,సుహాసిని,జగ్గయ్య,శారద,శుభలేక సుధాకర్,శరత్‌బాబు,ముచ్చర్ల అరుణ,రాజేంద్రప్రసాద్,రమాప్రభ,సమ్యుక్త.

పల్లవి::

పండు పండు నా బుజ్జిపండు..రేపటికిస్తాను రేగుపండు
సైటు కొట్టడం పైట లాగడం నేర్చుకొంటే 
మంచిదంట కవ్విస్తున్న కళ్ళవాడా..ఆ ఆ ఆ ఆ ఆ 

పండు పండు నా బుజ్జిపండు ముద్దు ముద్దుకి నా నోరు పండు
సిగ్న లివ్వటం సిగ్గు పెంచటం కోరి నాకు నేర్చుకోవె కోలకళ్ళ చిన్నదానా

చరణం::1

రారా నా సామిరంగ..ఆసామి నువ్వే అందాలకి
నీదేరా ఈ పూలతోట..ఆడుకో అందాల వేట

రాణి రవ్వంతకానీ..రాగాలబోణీ ఈ పూటకీ
గుట్టుదాటిపోతేను ఎట్టా..గూడుదాటినా ఈడుపిట్ట
వళ్ళంత ఏడెక్కి..వయసంతా గుండెక్కె
అంతో ఇంతో ఆదుకోర..చెంత చేరి చిన్నవాడా
పండు పండు నా బుజ్జిపండు..రేపటికిస్తాను రేగుపండు

చరణం::2

నవ్వు నీగుమ్మ నవ్వు..దానిమ్మపువ్వు దక్కించవా
పువ్వులే పండించుకొంటా..పూలపంతనే నంజుకొంట
సిగ్గు ఆనాటి సిగ్గు..వచ్చింది తగ్గు కవ్వించక
సిగ్గువుంటే సింగారమంటా..ఉన్నసిగ్గు ఊదేయకంట
ఈ పూట నలుపెక్కె..నీ బుగ్గ ఎరుపెక్కె
రెగిందంటె రేపుమాపు..ఎట్టగంట నీతో తంట

పండు పండు నా బుజ్జిపండు..రేపటికిస్తాను రేగుపండు 
సిగ్న లివ్వటం సిగ్గు పెంచటం కోరి నాకు నేర్చుకోవె కోలకళ్ళ చిన్నదానా
పండు పండు నా బుజ్జిపండు ముద్దు ముద్దుకి నా నోరు పండు

Swati--1984
Music::Chakravarti
Lyrics::Veturi Sundararamamoorti
Singer'sS.P.Balu,S.P.Sailaja
Film Directed By::Kraanti Kumaar 
Cast::Suhasini,Bhanuchandar,Jaggayya,Sarada,Subhaleka Sudhakar,Sarathbabu,MucharlaAruna,Rajendraprasan,Ramaprabha,Samyukta.

::::::::::

panDu panDu naa bujjipanDu..rEpaTikistaanu rEgupanDu
saiTu koTTaDam paiTa laagaDam nErchukonTE 
manchidanTa kavvistunna kaLLavaaDaa..aa aa aa aa aa 

panDu panDu naa bujjipanDu muddu mudduki naa nOru panDu
signa livvaTam siggu penchaTam kOri naaku nErchukOve kOlakaLLa chinnadaanaa

::::1

raaraa naa saamiranga..aasaami nuvvE andaalaki
needEraa ii poolatOTa..ADukO andaala vETa

raaNi ravvantakaanii..raagaalabONii ii pooTakii
guTTudaaTipOtEnu eTTaa..gooDudaaTinaa iiDupiTTa
vaLLanta EDekki..vayasantaa gunDekke
antO intO AdukOra..chenta chEri chinnavaaDaa
panDu panDu naa bujjipanDu..rEpaTikistaanu rEgupanDu

::::2

navvu neegumma navvu..daanimmapuvvu dakkinchavaa
puvvulE panDinchukonTaa..poolapantanE nanjukonTa
siggu AnaaTi siggu..vachchindi taggu kavvinchaka
sigguvunTE singaaramanTaa..unnasiggu UdEyakanTa
ii pooTa nalupekke..nee bugga erupekke
regindanTe rEpumaapu..eTTaganTa neetO tanTa

panDu panDu naa bujjipanDu..rEpaTikistaanu rEgupanDu 
signa livvaTam siggu penchaTam kOri naaku nErchukOve kOlakaLLa chinnadaanaa
panDu panDu naa bujjipanDu muddu mudduki naa nOru panDu

నెలవంక--1983



సంగీతం::రమేశ్ నాయుడు
రచన::ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 
గానం::S.P.బాలు, S.జానకి
Film Directed By::Jandyaala
Film Produced By::A.S.Anjaneyulu
తారాగణం::రాజేష్,తులసి,J.V.సోమయాజులు,గుమ్మడి వెంకటేశ్వరరావు,సుత్తివేలు,సుత్తి వీరభధ్రరావు,రాజ్యలక్ష్మీ,సాక్షిరంగారావు. 

సాకీ::
ఈ కోవెల వాకిలిలో..ఏదో అడుగు సవ్వడి 
ఏ దేవుడు దయతో నా ఎదలో అడుగిడు..వడి వడి

పల్లవి::

అహా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

కనుబొమ్మల పల్లకిలోనా..కన్నెసిగ్గు వధువయ్యిందీ..ఆ..ఆ
విరి మొగ్గల..మధువయ్యిందీ..ఆ..ఆ
హరివిల్లై పెదవి వదలినా..చిరునవ్వే వరమయ్యిందీ  
సిరిమువ్వల వరదయ్యిందీ 

నీ కన్నుల వెన్నెల చూసీ..మనసే చిరుతరగయ్యిందీ 
కృష్ణవేణి పరుగయ్యిందీ..ఆ..ఆ
దయ నిండిన గుండెను చూసీ..తనువే ఒక పులకయ్యిందీ 
నును సిగ్గుల మొలకయ్యిందీ 

చరణం::1

కనురెప్పల గొడుగును వేసీ..తోడునీడనౌతాను
అడుగులకే మడుగులుగా..నా అరచేతులు పడతాను

నీ జడలో మొగలిరేకునై..బతుకు పంచుకుంటాను
నీ జడలో మొగలిరేకునై..బతుకు పంచుకుంటానూ

కనుబొమ్మల పల్లకిలోనా..కన్నెసిగ్గు వధువయ్యిందీ 
విరి మొగ్గల మధువయ్యిందీ..ఆ..ఆ..ఆ

హరివిల్లై పెదవి వదలినా..చిరునవ్వే వరమయ్యిందీ  
సిరిమువ్వల వరదయ్యిందీ 

చరణం::2

ఆ..ఆ..ఆ..ఆ..మ్మ్..మ్మ్..మ్మ్ 
అంతరంగమిదుగో స్వామీ..నేడు మీకు నెలవంటానూ
మూగబడిన నా గుండెలలో..రాగలహరివనుకుంటానూ

అవధిలేని అంబరమే..నా ఆనందపు పరిధంటానూ
అవధిలేని అంబరమే..నా ఆనందపు పరిధంటానూ

నీ కన్నుల వెన్నెల చూసీ..మనసే చిరుతరగయ్యిందీ  
కృష్ణవేణి పరుగయ్యిందీ..ఆ..ఆ..ఆ..ఆ
దయ నిండిన గుండెను చూసీ..తనువే ఒక పులకయ్యిందీ 
నును సిగ్గుల మొలకయ్యిందీ..మ్మ్..మ్మ్..మ్మ్

Nelavanka--1983
Music::ramesh Naayudu
Lyrics::Indraganti Sreekaanth Sarma 
Singer's::S.P.Baalu, S.Jaanaki
Film Directed By::Jandyaala
Film Produced By::A.S.Anjaneyulu
Cast::Raajesh,Tulasi,J.V.Somayaajulu,Gummadi Venkateswararao,Suttivelu,Sutti veerabhadhrarao,Raajyalakshmee,Saakshirangaarao. 

saakee::

ee kOvela vaakililO..EdO aDugu savvaDi 
E dEvuDu dayatO naa edalO aDugiDu..vaDi vaDi

:::::::::::::

ahaa..aa..aa..aa..aa..aa

kanubommala pallakilOnaa..kannesiggu vadhuvayyindee..aa..aa
viri moggala..madhuvayyindee..aa..aa
harivillai pedavi vadalinaa..chirunavvE varamayyindee  
sirimuvvala varadayyindee 

nee kannula vennela choosee..manasE chirutaragayyindee 
kRshNavENi parugayyindee..aa..aa
daya ninDina gunDenu choosee..tanuvE oka pulakayyindee 
nunu siggula molakayyindee 

::::1

kanureppala goDugunu vEsee..tODuneeDanautaanu
aDugulakE maDugulugaa..naa arachEtulu paDataanu

nee jaDalO mogalirEkunai..batuku panchukunTaanu
nee jaDalO mogalirEkunai..batuku panchukunTaanoo

kanubommala pallakilOnaa..kannesiggu vadhuvayyindee 
viri moggala madhuvayyindee..aa..aa..aa

harivillai pedavi vadalinaa..chirunavvE varamayyindee  
sirimuvvala varadayyindee 

::::2

aa..aa..aa..aa..mm..mm..mm 
antarangamidugO swamee..nEDu meeku nelavanTaanoo
moogabaDina naa gunDelalO..raagalaharivanukunTaanoo

avadhilEni ambaramE..naa aanandapu paridhanTaanoo
avadhilEni ambaramE..naa aanandapu paridhanTaanoo

nee kannula vennela choosee..manasE chirutaragayyindee  
kRshNavENi parugayyindee..aa..aa..aa..aa
daya ninDina gunDenu choosee..tanuvE oka pulakayyindee 
nunu siggula molakayyindee..mm..mm..mm

పండంటి కాపురం--1972













సంగీతం::S.P.కోదండపాణి 
రచన::దాశరథి
గానం::ఘంటసాల 
తారాగణం::S.V.రంగారావు,కృష్ణ,విజయనిర్మల,గుమ్మాడి,జమున,ప్రభాకర్రెడ్డి B.సరోజాదేవి,జయసుధ, 

పల్లవి::

బాబూ..వినరా..అన్నాతమ్ములా కథ ఒకటీ 
కలతలులేనీ నలుగురు కలిసీ సాగించారూ పండంటి కాపురం
బాబూ..వినరా..అన్నాతమ్ములా కథ ఒకటీ
   
చరణం::1
    
కన్నకలలు అన్నీకూడ కల్లలాయెనే 
అన్నతమ్ము లొకటనుట అడియాసే ఆయెనే 
గూటిలోని ఆ గువ్వలు ఎగిరిపోయెనే 
స్వర్గమంటి ఇల్లంతా నరకంగా మారెనే       
ఆ కలిమీ ఆ బలిమీ కథగామారె కలతే మిగిలే 
ఈనాడు ఏనాటికి ఏమౌనో ఎవరికి తెలుసూ
విధిరాసిన రాతకు తిరుగే లేదూ 

చరణం::2

బాబూ..ఊ 
బాబూ..వినరా..అన్నాతమ్ములా కథ ఒకటీ 
కలతలులేనీ నలుగురు కలిసీ సాగించారూ పండంటి కాపురం
బాబూ..వినరా..అన్నాతమ్ములా కథ ఒకటీ
బాబూ..బాబూ..

Wednesday, January 28, 2015

గాజు బొమ్మలు--1983




సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::ఆత్రేయ-వేటూరి  
గానం::K.J.ఏసుదాస్ 
Film Directed By Koneru Ravindranath
తారాగణం::శరత్‌బాబు,గుమ్మడి,ప్రభాకర్‌రెడ్డి,సుత్తివీరభద్రారావు,సుత్తివేలు,నూతన్‌ప్రసాద్,సాయ్‌చంద్,పూర్ణిమ,సంగీత,రమాప్రభ,అన్నపూర్ణ,గిరిజారాణి,ప్రమీలరాణి,ఆశాలత,బేబిప్రసన్నలక్ష్మీ,నూతన నటి కుమారి చిత్ర. 

పల్లవి:::

ఎగిసి పడే..ఏ..మిడిసి పడే 
సాగర కెరటం..జీవితం 
ఈ జీవితం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
జీవితం ఈ జీవితం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

కలల అలల..ఊయలలో 
కనులు మూసి..ఊగడమే 
జీవితం ఒక..నాటకం

ఎగిసి పడే..ఏ..మిడిసి పడే 
సాగర కెరటం..జీవితం 
ఈ జీవితం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
జీవితం ఈ జీవితం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

చరణం::1

తొలి రుతువన్నది..పువ్వుల కావ్యం
మూడు నెలల..దృశ్యం..మ్మ్ మ్మ్ మ్మ్ 
మూగబోవు కోకిల గాత్రం..మ్మ్ మ్మ్ మ్మ్
మలి రుతువన్నది..మండే గ్రీష్మం
మోడుల సంగీతం..మ్మ్ మ్మ్ మ్మ్ 
గుండె రగులు..కొండల గీతం
రుతువేదైన..రాగమోకటిగా
సాగు బాటసారి..సాగు బాటసారి

ఎగిసి పడే..ఏ..మిడిసి పడే 
సాగర కెరటం..జీవితం 
ఈ జీవితం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
జీవితం ఈ జీవితం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

చరణం::2

జీవితమన్నది..బృందావనము 
ప్రేమ మురళి..గానం..మ్మ్ మ్మ్ మ్మ్
ముగిసి పోనీ..మోహన రాగం
కడలిని కలిసే..వరకే ఉన్నది 
నది అన్నది..నీకోసం..మ్మ్ మ్మ్ మ్మ్ 
అదే కాల సాగర గీతం..మ్మ్ మ్మ్ మ్మ్ 
మృతిలోనైనా..చెరగని నవ్వై
బ్రతుకు బాటసారి..బ్రతుకు బాటసారి

ఎగిసి పడే..ఏ..మిడిసి పడే 
సాగర కెరటం..జీవితం 
ఈ జీవితం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
జీవితం ఈ జీవితం..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

Gaaju Bommalu--1983
Music::Ramesh NaayuDu 
Lyrics::Atreya--Vetoori
Singer::K.J.EYsudaas 
Film Directed By Koneru Ravindranath
Cast::Sarat^baabu,Saaychand,poorNima,Sangeeta,Ramaaprabha,Annapoorna,Girijarani,Pramilaaraani,Bebyprasannalakshmii,Nootana Nati Kumaari Chitra.gummaDi,Prabhakar Reddi,Nootanprasaad,Suttiveerabhadra Rao,Suttivelu, 

::::::::::::::::::::::::::::::

egisi paDE..E..miDisi paDE 
saagara keraTam..jeevitam 
ii jeevitam..mm mm mm mm 
jeevitam ii jeevitam..mm mm mm mm

kalala alala..ooyalalO 
kanulu moosi..oogaDamE 
jeevitam oka..naaTakam

egisi paDE..E..miDisi paDE 
saagara keraTam..jeevitam 
ii jeevitam..mm mm mm mm 
jeevitam ii jeevitam..mm mm mm mm 

::::1

toli rutuvannadi..puvvula kaavyam
mooDu nelala..dRSyam..mm mm mm 
moogabOvu kOkila gaatram..mm mm mm
mali rutuvannadi..manDE greeshmam
mODula sangeetam..mm mm mm 
gunDe ragulu..konDala geetam
rutuvEdaina..raagamOkaTigaa
saagu baaTasaari..saagu baaTasaari

egisi paDE..E..miDisi paDE 
saagara keraTam..jeevitam 
ii jeevitam..mm mm mm mm 
jeevitam ii jeevitam..mm mm mm mm

::::2

jeevitamannadi..bRndaavanamu 
prEma muraLi..gaanam..mm mm mm
mugisi pOnee..mOhana raagam
kaDalini kalisE..varakE unnadi 
nadi annadi..neekOsam..mm mm mm 
adE kaala saagara geetam..mm mm mm 
mRtilOnainaa..cheragani navvai
bratuku baaTasaari..bratuku baaTasaari

egisi paDE..E..miDisi paDE 
saagara keraTam..jeevitam 
ii jeevitam..mm mm mm mm 
jeevitam ii jeevitam..mm mm mm mm

Monday, January 26, 2015

భైరవద్వీపం--1994



సంగీతం::మాధవపెద్ది సురేష్
రచన::వేటూరి సుందర రామమూర్తి
గానం::S.P.బాలు, బృందం

పల్లవి::

శ్రీ తుంబుర నారద నాదామృతం
శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం
సంగీతామృతపానం..మ్మ్
ఇది స్వర సుర జగతి సోపానం
శివుని రూపాలు..భువికి 
దీపాలు..స్వరం పదం
ఇహం పరం..కలిసిన 

చరణం::1

సప్త వర్ణముల మాతృకగా
శుక్త వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాతృకగా 
శుక్త వర్ణముల డోలికగా 
ఏడురంగులే తురగములై
శ్వేతవర్ణ రవి కిరణములై
సాపాసా గరిసనిదపమగా 
నీగా మగరిసనిస సగామా 
గమాపా మపానీస గరిసపనిద
రిసనిదప సనిదపమ

చరణం::2

సా సా సా సా స సనిపగసరి గపనిగరిసా
నిసరి పనిస గపని రిగప గరిసా
సంగీతారంభ సరస హేరంభ
స్వర పూజలలో షడ్జమమే
రీ రీ రిమపనిదమ మపనిస 
గరి మగరిస నిసరి మాగరిస నిసరి 
నీదమప మగరీ నిదపా మగరీ
శంభోకైలాస శైలూషితా నాట్య
నందిత స్వర నంది రిషభమే
గా గా గా రిసరీసద సాదప గగపదసా

మురళి వనాంతాల విరియు వసంతాల 
మురళి వనాంతాల విరియు వసంతాల
చిగురించు మోహన గాంధారమే
మా సమగ సనిదమా సమాగాప
దనీమాద గనిసా
మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాన
కలశము హిందోళ మధ్యమమే
పా పమపా దదపా పమపా దనిదా
పదస పాదసరి పమరిస
నిదపమపా రిసరిమపా
సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు
పలికిన కోయిల పంచమమే
దా దని సమగరి పద నిరి సని దప 
రిస నిద పమ గరి మప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన..ఆ..ఆ
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
హర్షాతిరేకాలు దైవతమే

నీ సనిదప మగరిస నీ నిరినిరీరి నీరిగామ
పమగరి మగదమదాద మాదనీరి గరిసా
కల్యాణి సీతమ్మ కల్యాణ రామయ్య
కథ పదముగ పాడె నిషాదమే
తద్ధిన్న తిద్ధిన్న తిద్ధిన్న కిట ధిన్న 
తద్ధిన్న తిద్ధిన్న తిద్ధిన్న కిట ధిన్న 
నిని పమ గమ పని మప నినిసా
నిని సస సస సస నిని రిరి రిరి నిని గగ గమ
రిగ సరి నిస పనిస మపని గమప సగమ
సమ గప మని పస నిరి సగ
మగ మగరి గరి గరిస రిస రిసని
సని సనిద నిద నిదప..దప దపమ
సగమప గమపని మపనిస
గసగా పమపా..గసగా మగమా
సగ మపమగ రిసనిదపమ గమపనిదపమగ
రిసనిరి నినిని సాససస నినిని గాగగగ
నినిని మామ గమ పమ గమ గరిసా
గగగ పాపపప గగగనీనినిని
గగగ సాస నిసగరి సమగరిసా
నిస నిస నిస నిస పని పని పని మప 
నిస నిస నిస నిస పని పని పని మప
గమ గమ గమ గమ సగ సగ సగ నిస 
గమ గమ గమ గమ సగ సగ సగ నిస 
నిసగమ సగమప గమపని మపనిస
సగమప గమపని మపనిస పనిసగ
సస సస సస సస రిరి రిరి రిరి రిరి
సస సస సస సస గగ గగ గగ గగ
రిరి రిరి రిరి రిరి గగ గగ గగ గగ
రిరి రిరి రిరి రిరి మమ మమ మమ మమ 
గమ గమ గమ గమ గమ గమ గస గమపా

శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం

Bhairava Dweepam--1994
Music::Madhavapeddi Suresh
Lyricis::Veturi Sundara Ramamurthy
Singer::S.P.Baalu & corus

::::

sri tumbura narada nadamrutham
sri tumbura narada nadamrutham
swara raaga rasa bhaava thaalaanvitham
sangeethaamrutha paanam 
idi swarasula jagathi sopaanam
Sivuni roopaalu bhuviki deepaalu
swaram padam iham param kalisina
Shree thumbura naarada naadaamrutham
swara raaga rasa bhaava taalaanvitham

Saptha varnamula maatrukaga
Shuktha varnamula dolikaga
Sapta varnamulaa maatrukaga
Shuktha varnamula dolikaga
Yedu rangule turagamulai
Swetha varna ravi kiranamulai
Sa pa sa ga ri ga ni da pa ma ga
Ga ni ga ma ga ri sa ni sa
Sagama gamapa mapani sa
Garisanida risanidapa sanidapama
Shree thumbura naarada naadaamrutham
Swara raaga rasa bhaava taalaanvitham

Sa sa sa sa sa
Sanipa garisa ga pa ni sa garisa
Nisari panisa gapani rigapa garisa
Sangeetharambha sarasa heramba 
swara poojalalo shadjamame
Ri..ri..rimapanidama mapanisagari 
magarisanisa rimaagarisa nisarinidamapa
Magari nidapa magari
Shambo kailaasa sailuushikaanaatya 
nandita swara nandi Vrishabame
Ga..gaa gaarisa risaga saadapa gagapadasa
Murali vanaanthaala diriyu vasanthaala…
Murali vanaanthaala diriyu vasanthaala…
Chigurinchu mohana gaandhaarame
Ma..samagasanidama…samagamadani maganigasa
Moksha lakshmi devi gopura sikharaana 
kalasamu indhola..madhyamame
Pa..pamapa gagapa pamapa danida
padasa padasari pamari sanida pamapa 
risarima pa
saraswathi raagaala kuhukuhu geethaalu 
palikina koyila panchamame
da..danisamagari padanirisanidapa 
risanidapa magarigamapa
vaana jallula vela aa 
chakravaakaana..Aa aaa
vaana jallula vela aa 
chakravaakaana harshaadirekhaalu daivathame

ni..sanidapamagarisa nininini ni
ripamagari mada madaada…madaniri garisa
kalyaani seethamma kalyaana raamayya 
kadha padamuga paade nishaadame
Taddinna tiddinna tiddinna..kitaddinna
taddinna tiddinna tiddinna..kitaddinna
Ninipamagama panimapaninisa
Nini sasa sasa..nini riri riri
Nini gaga gama riga sari nisa
Panisa mapani gamapa sagama
Samagapamani pasanirisaga
Magamagari garigarisa risarisani 
sanisanida Nidanidapa dapadapama

Sagamapa gamapani mapanisa gasaga gamapa
Gasaga magama..sagamapa magarisa 
ridapamagamapani dapamagarisaniri
Nininisasa sasa ninini gaga gaga
Ninini mamagama pamagamagarisa
Gagaga papapapa gagaga nininini
Gagaga sasa nisa gari sama garisa
Nisa nisa nisa nisa pani pani pani mapa
Nisa nisa nisa nisa pani pani pani mapa
Gama gama gama gama saga saga saga nisa
Gama gama gama gama saga saga saga nisa
Nisa gama saga mapa gama pani mapa nisa
Saga mapa gama pani mapa nisa pani saga
Sasa sasa sasa riri riri riri
Sasa sasa sasa gaga gaga gaga
Riri riri riri gaga gaga gaga
Riri riri riri mama mama mama
Gama gama gama gama gama gasa gamapa

Shri thumbura naarada naadaamrutham
Swara raaga rasa bhaava taalaanvitham

Thursday, January 22, 2015

సీతమ్మ పెళ్ళి--1984




సంగీతం::బాలసుబ్రమణ్యం 
రచన::వేటూరి
గానం::S.P.బాలు
Film Directed By::Baapu
తారాగణం::మురళిమోహన్,మోహన్‌బాబు,నూతన్‌ప్రసాద్,రాళ్ళపల్లి,ముచ్చర్ల అరుణ,
రేవతి,సిల్క్‌స్మిత. 

పల్లవి::

చెల్లివైనా తల్లివైనా
చామంతిపువ్వంటి నువ్వే..నాకు నువ్వే
అన్ననైనా నాన్ననైనా 
నీ కంటిరెప్పంటి నేనే..నీకు నేనే

అమ్మ కడుపే..చల్లగా 
నువ్వు వర్ధిల్లవే..పచ్చగా
కన్న కలలే..పండగా
ఈ అన్న..చెల్లాయిగా

చెల్లివైనా తల్లివైనా
చామంతిపువ్వంటి నువ్వే..నాకు నువ్వే

చరణం::1

ఆకలివేళ అన్నను ఐనా
అన్నమై..నే పుట్టనా..ఆఆఆఆఆ
నీ బొజ్జ నే..నింపనా
నిద్దురవేళ..అమ్మను కానా
జొలలే..నే పాడనా..ఆఆఆఆఆ
ఊయలై..నే ఊగనా
జో జో లాలి..లాలి లాలి జో లాలి

అమ్మ కడుపే చల్లగా 
నువ్వు వర్ధిల్లవే పచ్చగా
కన్న కలలే పండగా
ఈ అన్న చెల్లాయిగా

చరణం::2

చూపుడు వేలు..రాపిడి కళ్ళు
రానంత దూరాలలో..ఓఓఓఓఓ..నా గుండెలో దాచనా 
జనకుడు నేనై..జానకిలాగ అత్తింటికే పంపనా..ఆఆ
పుట్టిల్లుగా మిగలనా..అన్నగా ఏడేడు జన్మాలకి

అమ్మ కడుపే చల్లగా 
నువ్వు వర్ధిల్లవే పచ్చగా
కన్న కలలే పండగా
ఈ అన్న చెల్లాయిగా

చెల్లివైనా తల్లివైనా
చామంతిపువ్వంటి నువ్వే..నాకు నువ్వే
అన్ననైనా నాన్ననైనా 
నీ కంటిరెప్పంటి నేనే..నీకు నేనే
నేనే..నాకు..నీవే..ఏఏఏ 

Seetamma Pelli--1984
Music::Baalasubramanyam 
Lyrics::Veturisundararaammoorti
Singer::S.P.Baalu
Film Directed By::Baapu
Cast::Muralimohan,Mohanbabu,Nootanprasad,Rallapalli,Mucharla Aruna,Revati,SilkSimta.

:::::::::::::::::::::::::::::::::::

chellivainaa tallivainaa 
chaamantipuvvanTi nuvvE..naaku nuvvE
annanainaa naannanainaa 
nee kanTireppanTi nEnE..neeku nEnE

amma kaDupE..challagaa 
nuvvu vardhillavE..pachchagaa
kanna kalalE..panDagaa
ii anna..chellaayigaa

chellivainaa tallivainaa
chaamantipuvvanTi nuvvE..naaku nuvvE

::::1

aakalivELa annanu ainaa
annamai..nE puTTanaa..aaaaaaaaaa
nee bojja nE..nimpanaa
nidduravELa..ammanu kaanaa
jolalE..nE paaDanaa..aaaaaaaaaa
ooyalai..nE ooganaa
jO jO laali..laali laali jO laali

amma kaDupE challagaa 
nuvvu vardhillavE pachchagaa
kanna kalalE panDagaa
ii anna chellaayigaa

::::2

choopuDu vElu..raapiDi kaLLu
raananta dooraalalO..OOOOO..naa gunDelO daachanaa 
janakuDu nEnai..jaanakilaaga attinTikE panpanaa..aaaa
puTTillugaa migalanaa..annagaa EDEDu janmaalaki

amma kaDupE challagaa 
nuvvu vardhillavE pachchagaa
kanna kalalE panDagaa
ii anna chellaayigaa

chellivainaa tallivainaa 
chaamantipuvvanTi nuvvE..naaku nuvvE
annanainaa naannanainaa 
nee kanTireppanTi nEnE..neeku nEnE
nEnE..naaku..neevE..EEEEE 

Wednesday, January 21, 2015

అల్లరి బావ--1980



సంగీతం:: రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి సుందరరామ మూర్తి
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::కృష్ణ,జయప్రద,గుమ్మడి,గిరిబాబు,కాంతరావు,అల్లురామలింగయ్య.

పల్లవి::

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం..మధురం ఈ జవ్వనం
మనోహరం..మనోహరం

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం..మధురం ఈ జవ్వనం
మనోహరం..మనోహరం
మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

చరణం::1

కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలీ
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలీ
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ
వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడూ

తొలి తొలీ వలపులే
తొలకరీ మెరుపులై
విరిసే వేళలో..హేలలో..డోలలో

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం..మధురం ఈ జవ్వనం
మనోహరం..మనోహరం
మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

చరణం::2

బృందావనికి మురళీధరుడు..ఒకడే కృష్ణుడూ
ఎదిగిన బాలిక ఎద గల గోపికకతడే..దేవుడూ
మధురాపురికి యమునా నదికి..ఒకటే రాధికా
మరువైపోయిన మనసున వెలసెను..నేడీ దేవతా

వెలుగులా వీణలే..పలికెనూ జాణలో
అదియే రాగమో..భావమో..బంధమో

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం..మధురం ఈ జవ్వనం
మనోహరం..మనోహరం
మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

Allari Bava--1980
Music::ajan-Nagendra
Lyricis::Veturi Sundararama Murthy
Singer's::S.P.Balu, P.Susheela
Cast::Krshna,Jayaprada,Gummadi,Giribaabu,Kaantaraavu,Alluraamalingayya.

:::

madhuvanilo radhikavo 
madhuvolike geetikavo
madhuram ee jeevanam 
madhuram ee javvanam
manoharam manoharam
madhuvanilo radhikanu 
madipalike geetikanu 
madhuram ee jeevanam 
madhuram ee yavvanam
manoharam manoharam

:::1

karteekaana kalale chilike velige jabili
yedalo mallela podalo veligenu nedee jabili
neelaakaasha veedhullona velige suryudu
vetale masina kadhalo veligenu nedee suryudu
toli toli valapule
tolakari merupulai
virise velalo..helalo..dolalo

:::2

brundavaniki muraleedharudu okade krushnudu
yedigina balika yedagala gopikakatade devudu
madhurapuriki yamunaa nadiki okate radhika
maruvai poyina manasuna velasenu
nedee devata
velugula veenale
palikenu janalo
adi ye ragamo..bhavamo..bandhamo

Tuesday, January 20, 2015

కోటి దీప ప్రభలతో స్వామి కోనేటి నీటి అలలలో


సంగీత::సాలూరు రాజేశ్వరరావు
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

కోటి దీప ప్రభలలో..స్వామి కోనేటి నీటి అలలలో
శతకోటి భక్తుల నయనమ్ములలో 
తెప్ప పై వేంచేయు తిరుపతి రమణా..ఆ ఆ ఆ ఆ

కోటి దీప ప్రభలలో..స్వామి కోనేటి నీటి అలలలో
శతకోటి భక్తుల నయనమ్ములలో..ఓఓఓ 
తెప్ప పై వేంచేయు తిరుపతి రమణా..ఆ

చరణం::1

దశకంటు దునుమాడి ధరణియను చేకొనీ
పురమునకు అరుదెంచు పురుషొత్తమా..రామా..ఆ ఆ
దశకంటు దునుమాడి ధరణియను చేకొనీ
పురమునకు అరుదెంచు పురుషొత్తమా
ఆనాటి పుష్పకము ఈ నాడు కనులారా
ఆనాటి పుష్పకము ఈ నాడు కనులారా
కాంచు తున్నామయా కరువుదీరా

కోటి దీప ప్రభలలో..స్వామి కోనేటి నీటి అలలలో
తెప్ప పై వేంచేయు తిరుపతి రమణా

చరణం::2

కాళింది మడుగునా కాళీయు శిరమునా 
చిందులనూ వేసినా చిన్ని తాండవ కృష్ణా
రేపల్లెలో నాటి దీపావళిని నేడు
రేపల్లెలో నాటి దీపావళిని నేడు
కాంచుచున్నామయా కరువు తీరా

చరణం::3

శృష్టి స్థితి లయ కారణ కార్యా
శృష్టి స్థితి లయ కారణ కార్యా
సకల మతాచార సారాచార్యా
భవభయ పాప విమోచన భౌర్యా
ధినకర ఆత్రేయ తేజోవీర్యా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా 
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా 
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద 
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

Monday, January 19, 2015

మాయామశ్చీంద్ర--1975


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=323
సంగీతం::చెళ్ళపిళ్ళసత్య 
రచన::ఆరుద్ర
గానం::P.సుశీ
Film Directed By::Baabubhayi mistri
తారాగణం::N.T. రామారావు,వాణిశ్రీ,రామకృష్ణ,కాంతారావు,కాంచన,అర్జా జనార్ధన్ రావు,K.V.చలం.

పల్లవి::

మగరాయ..పంతామేలరా
నే మరుబారి..తాళజాలరా 
నా వన్నెలు చిన్నెలు నిన్నే కోరెరా 
మగరాయ..పంతామేలరా
నే మరుబారి..తాళజాలరా

చరణం::1

చిగురాకు బాకూ ఆ వలరాజు దూసే 
సెగలాటి వెలుగు ఆ నెలరాజు కాసే 
ఎలదేటి మనసూ దులిచేను రారా
ఎదమదనాగ్ని రేగేను మారాములేలా 
మగరాయ పంతామేలరా
నే మరుబారి తాళజాలరా

చరణం::2

నిను చూడగానే నా మేను పొంగే 
నిను చేర అందాల కెమ్మోవి ఊరే 
చెమరించె కన్నూ నన్నేల రారా 
అనురాగాల భోగాల లాలన శాయా 
మగరాయ పంతామేలరా 
నే మరుబారి తాళజాలరా

చరణం::3

మనకోసమేగా ఈ పొదరిల్లు పూచే  
ఆఅ పొదరింటిలోనా విరిపాన్పు వేసే 
వలచింది వనితా అలుసేల రా
నీనగుమోము కనలేని నా బతుకేలా
మగరాయ పంతామేలరా 
నే మరుబారి తాళజాలరా 
నా వన్నెల చిన్నెలు నిన్నే కోరెరా 
ఓ మగరాయ పంతామేలరా 
నే మరుబారి తాళజాలరా..ఆఆఆ 

Maayaa MaSchiindra--1975 
Music::Satyam
Lyrics::Arudra
Singer's::P.Suseela
Film Directed By::Baabubhayi mistri
Cast::N.T.Ramarao,Vanisree,Ramakrishna,kaantaraavu,kaanchana,Arjaa Janaardhan Rao,K.V.Chalam.

::::::::::

magaraaya..pantaamElaraa
nE marubaari..taaLajaalaraa 
naa vannelu chinnelu ninnE kOreraa 
magaraaya..pantaamElaraa
nE marubaari..taaLajaalaraa

::::1

chiguraaku baakoo aa valaraaju doosE 
segalaaTi velugu aa nelaraaju kaasE 
eladETi manasoo dulichEnu raaraa
edamadanaagni rEgEnu maaraamulElaa 
magaraaya pantaamElaraa
nE marubaari taaLajaalaraa

::::2

ninu chooDagaane naa mEnu pongE
ninu chEra andaala kemmOvi oorE 
chemarinche kannoo nannEla raaraa 
anuraagaala bhOgaala laalana Saayaa 
magaraaya pantaamElaraa 
nE marubaari taaLajaalaraa

::::3

manakOsamEgaa E podarillu poochE  
aaa podarinTilOnaa viripaanpu vEsE 
valachindi vanitaa alusEla raa
neenagumOmu kanalEni naa batukElaa
magaraaya pantaamElaraa 
nE marubaari taaLajaalaraa 
naa vannela chinnelu ninnE kOreraa 
O magaraaya pantaamElaraa 
nE marubaari taaLajaalaraa..aaaaaa 

Sunday, January 18, 2015

పవిత్ర బంధం--1971















సంగీతం::S.రాజేశ్వరరావు  
రచన::ఆరుద్ర
గానం::.P.సుశీల,ఘంటసాల 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య 

పల్లవి::

ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ  
సగం సగం..నిజం నిజం 
నీవో సగం..నేనో సగం 
నీవో సగం..నేనో సగం
సగాలు రెండూ..ఒకటైపోతే 
జగానికే ఒక..నిండుదనం
నిజం నిజం నిజం నిజం ఫిఫ్టీ..ఫిఫ్టీ
  
చరణం::1
          
నీవే నాదం..నేనే గీతం 
నీవే నాదం..నేనే గీతం 
నీ నా కలయిక..సంగీతం 
నీ నా కలయిక..సంగీతం
నీవే నింగి..నేనే నేల 
నీవే నింగి..నేనే నేల
నిండు విలీనమే..ఈ భువనం 
నీవే కుసుమం..నీవే భ్రమరం
పువ్వూ తుమ్మెద..ఒకటైపోతే 
జగానికే ఒక..కమ్మదనం
నిజం నిజం..నిజం నిజం 

ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ  
సగం సగం..నిజం నిజం 
నీవో సగం..నేనో సగం 
నీవో సగం..నేనో సగం
సగాలు రెండూ..ఒకటైపోతే 
జగానికే ఒక..నిండుదనం
నిజం నిజం నిజం నిజం 
ఫిఫ్టీ..ఫిఫ్టీ

చరణం::2

రాధ సగం..మాధవుడు సగం 
రాధ సగం..మాధవుడు సగం 
రాసవిహారమే..ప్రణయమయం
రాసవిహారమే..ప్రణయమయం
గౌరి సగం..శివుడు సగం 
గౌరి సగం..శివుడు సగం
అర్ధనారీశ్వరమే..అఖిల జగం 
అవినాభావం..అమృతరావం
అభేద రూపం..స్థిరమైపోతే 
జగానికే ఒక..అమర పథం 
నిజం నిజం..నిజం నిజం 
ఫిఫ్టీ...ఫిఫ్టీ
సగం సగం..నిజం నిజం  
నీవో సగం..నేనో సగం 
సగాలు రెండూ..ఒకటైపోతే 
జగానికే..ఒక నిండుదనం 
ఫిఫ్టీ..ఫిఫ్టీ

Saturday, January 17, 2015

సక్కనోడు--1986



సంగీతం::K.V..మహదేవన్ 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::V.Bhaskar Rao
తారాగణం::శోభన్‌బాబు,విజయశాంతి,అన్నపూర్ణ.

పల్లవి::

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సీతమ్మ వాకిట్లో..సిరిమల్లె తోట 
సిరిమల్లె తోటల్లో..సీతమ్మ పాట 
సీతమ్మ వాకిట్లో..సిరిమల్లె తోట 
సిరిమల్లె తోటల్లో..సీతమ్మ పాట
సిరిమొగ్గ లయ్యింది..తొలి సిగ్గు మూటా
సిరిమొగ్గ లయ్యింది..తొలి సిగ్గు మూటా
మనసైన రామయ్య..మనువాడు పూటా
సీతమ్మ వాకిట్లో..సిరిమల్లె తోట..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

చరణం::1

చిక్కుళ్ళ పువ్వెరుపు..చిలకా ముక్కెరుపు 
చిగురంటి చిన్నారి..సొగసంత ఎరుపు 
చిక్కుళ్ళ పువ్వెరుపు..చిలకా ముక్కెరుపు 
చిగురంటి చిన్నారి..సొగసంత ఎరుపు
పసుపంటి నారోజు..పారాణి ఎరుపు 
మనువాడు తనవాడు..మాణిక్య మెరుపు
సిగ్గంత ముగ్గేసి నవ్వాలా..శ్రీలక్ష్మి చిందేసి ఆడాలా
సిగ్గంత ముగ్గేసి నవ్వాలా..శ్రీలక్ష్మి చిందేసి ఆడాలా

చరణం::2

పన్నెండు స్తంబాల..పందిళ్ళు వేసి 
పన్నీటి జల్లంటి..వానల్లు కురిసి 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పన్నెండు స్తంబాల..పందిళ్ళు వేసి 
పన్నీటి జల్లంటి..వానల్లు కురిసి 
నాగళ్ళు ఆడేటి..మాగాణి పండి 
లోగిళ్ళలో సిరులు..కలకాలముండి
గోరంత దీపాలు నవ్వాలా..గోరింట మాయింట పండాలా
సిగ్గంత ముగ్గేసి నవ్వాలా..శ్రీలక్ష్మి చిందేసి ఆడాలా
సిగ్గంత ముగ్గేసి నవ్వాలా..శ్రీలక్ష్మి చిందేసి ఆడాలా

చరణం::3

పుట్టింటి ప్రేమంత..నట్టింట పోసి 
మెట్టింట తిరిగేటి..పురుషుణ్ణి చూసి 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పుట్టింటి ప్రేమంత..నట్టింట పోసి 
మెట్టింట తిరిగేటి..పురుషుణ్ణి చూసి 
ఏడేడు జన్మాల..వేవిళ్ళు మోసి 
ఏలేటి దేవుళ్ళ..ఉయ్యాల వేసి 
పచ్చంగా నూరేళ్ళు ఉండాలా..ముత్తైదు గా బ్రతుకు పండాలా
సిగ్గంత ముగ్గేసి నవ్వాలా..శ్రీలక్ష్మి చిందేసి ఆడాలా
సిగ్గంత ముగ్గేసి నవ్వాలా..శ్రీలక్ష్మి చిందేసి ఆడాలా

Sakkanodu--1986 
Music::K.V.Mahadevan 
Singer's::::S.P.BaluP.Suseela
Film Directed By::V.Bhaskar Rao
Cast::Sobhanbaabu,Vijayasaanti,Annapoorna.

::::::::::

mm mm mm mm..aa aa aa aa aa aa
seetamma vaakiTlO..sirimalle tOTa 
sirimalle tOTallO..seetamma paaTa 
seetamma vaakiTlO..sirimalle tOTa 
sirimalle tOTallO..seetamma paaTa
sirimogga layyindi..toli siggu mooTaa
sirimogga layyindi..toli siggu mooTaa
manasaina raamayya..manuvaaDu pooTaa
seetamma vaakiTlO..sirimalle tOTa..mm mm mm mm mm

::::1

chikkuLLa puvverupu..chilakaa mukkerupu 
chiguranTi chinnaari..sogasanta erupu 
chikkuLLa puvverupu..chilakaa mukkerupu 
chiguranTi chinnaari..sogasanta erupu
pasupanTi naarOju..paaraaNi erupu 
manuvaaDu tanavaaDu..maaNikya merupu
sigganta muggEsi navvaalaa..Sreelakshmi chindEsi aaDaalaa
sigganta muggEsi navvaalaa..Sreelakshmi chindEsi aaDaalaa

::::2

pannenDu stambaala..pandiLLu vEsi 
panneeTi jallanTi..vaanallu kurisi 
aa aa aa aa aa aa aa aa
pannenDu stambaala..pandiLLu vEsi 
panneeTi jallanTi..vaanallu kurisi 
naagaLLu aaDETi..maagaaNi panDi 
lOgiLLalO sirulu..kalakaalamunDi
gOranta deepaalu navvaalaa..gOrinTa maayinTa panDaalaa
sigganta muggEsi navvaalaa..Sreelakshmi chindEsi aaDaalaa
sigganta muggEsi navvaalaa..Sreelakshmi chindEsi aaDaalaa

::::3

puTTinTi prEmanta..naTTinTa pOsi 
meTTinTa tirigETi..purushuNNi choosi 
aa aa aa aa aa aa aa aa
puTTinTi prEmanta..naTTinTa pOsi 
meTTinTa tirigETi..purushuNNi choosi 
EDEDu janmaala..vEviLLu mOsi 
ElETi dEvuLLa..uyyaala vEsi 
pachchangaa noorELLu unDaalaa..muttaidu gaa bratuku panDaalaa
sigganta muggEsi navvaalaa..Sreelakshmi chindEsi aaDaalaa
sigganta muggEsi navvaalaa..Sreelakshmi chindEsi aaDaalaa

Thursday, January 15, 2015

గాజుల కిష్టయ్య--1975


సంగీతం::K.V.మహదేవాన్
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::S.P.బాలు
Director::Adurthi Subba Rao 
తారాగణం::కృష్ణ,కాంతారావు,చంద్రమోహన్,గిరిబాబు,జరీనా,అంజలీదేవి,శుభ,సూర్యకాంతం   

పల్లవి::

వద్దు వద్దు రా..ఆ..ఆఆఆఆఆఆ  
ఈ పాపం మాత్రం చేయద్దురా..ఆఆఆ 
దేవాలయాలలో దేవుడు ఉన్నాడో లేడో
ప్రేమించిన హృదయాలలో మాత్రం
తప్పక ఉన్నాడు వాడు అక్కడే ఉంటాడు
వాడికి ద్రోహం చేయద్దు వాటిని దూరం చేయద్దు

వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు
ప్రేమించిన హృదయాలను ముక్కలు చేయద్దు..ఊఊఊ
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు

చరణం::1

పిరికివాళ్ళేన్నడూ ప్రేమించరాదు 
ప్రేమ ఒకసారి రగిలితే ఆరిపోదు..ఊఊఊఊ
అగ్గివంటి అనురాగాన్ని భయపడి దాచద్దు..ఊఊ
నీ గుండెను నిప్పు  కుండగా చేసుకు మోయద్దు
ఎప్పుడో బద్దలవుతుంది ఎందరినో బలి గొంటుఒ౦ది
మూగ బాధ నీ గొంతును నులుమి నిజాన్ని దాస్తుంది 
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు
ప్రేమించిన హృదయాలను ముక్కలు చేయద్దు..ఊఊఊఊ
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు..ఊఊ

చరణం::2

ఏడ్పించి ప్రేమను ఓడించలేవు –అది
ఎంత వెచ్చని కన్నీరైతే అంత రెచ్చిపోతుంది
కలిమిని వలపును ఒకే త్రాసులో తూకం వేయద్దు
కులము మతమను కొలబద్దలతో కొలిచి చూడవద్దు
మనిషిని మనసుతో కొలవాలి మనసును మమతతో తూచాలి
మేడలు గోడలు ఆపవు వలచిన హృదయాన్నీ                
ప్రేమించిన హృదయాలను ముక్కలు చేయద్దు..ఊఊఊఊ
వద్దు వద్దు ఈ పాపం మాత్రం చేయద్దు
వద్దు వద్దు రా..ఆఆఆ..ఈ పాపం మాత్రం చేయద్దురా..ఆఆఆఆఆ 

Tuesday, January 13, 2015

సిరివెన్నెల--1986



సంగీతం::K.V.మహాదేవన్
రచన::సిరివెన్నెల  
గానం::S.P.బాలు 
తారాగణం::బెనర్జి,సుహాసిని,మున్‌మున్‌సేన్   

పల్లవి::

ప్రకృతి కాంతకూ యెన్నెన్ని హొయలో
పదము కదిపితే యెన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకూ యెన్నెన్ని హొయలో
పదము కదిపితే యెన్నెన్ని లయలో
యెన్నెన్ని హొయలో యెన్నెన్ని లయలో
యెన్నెన్ని హొయలో యెన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన యెదపై సిరి మువ్వల సవ్వడి నీవై
నర్తించగ రావేలా నిను నే కీర్తించే వేళా

చరణం::1

అలల పెదవులతో.ఓ..ఓ..ఓ..శిలల చెక్కిలి పై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
అలల పెదవులతో.ఓ..ఓ..ఓ..శిలల చెక్కిలి పై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగమూ

చరణం::2

కొండల బండల దారులలో..తిరిగేటి సెలయేటి గుండెలలో
కొండల బండల దారులలో..తిరిగేటి సెలయేటి గుండెలలో
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపు వికసించగనే
యెన్నెన్ని హొయలో యెన్నెన్ని లయలో

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

ఏదో..ఏదో
ఏదో..గిలిగింత..ఏమిటీ వింత..ఆ
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..ఆ..ఆ..కంపించె తనువంత

ఏదో..ఏదో..ఏదో..గిలిగింత..ఏమిటీ వింత
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..కంపించె తనువంత

చరణం::1

వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే..ఏ..ఏ
అహ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే
నీవు తాకినా నిముషమందె నా యవ్వనమ్ము పూచే..ఏ..ఏ

ఏదో..ఏదో

కన్ను కన్ను కలిసే..బంగరు కలలు ముందు నిలిచే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కన్ను కన్ను కలిసే..బంగరు కలలు ముందు నిలిచే
పండు వెన్నెలల బొండు మల్లియలు గుండెలోన విరిసే..ఏ..ఏ..ఏ
ఏదో..ఏదో

చరణం::2

గానమైన నీవే..నా ప్రాణమైన నీవే
గానమైన నీవే..నా ప్రాణమైన నీవే
నన్ను వీణగా మలచుకొనెడు గంధర్వ రాజు వీవే

ఏదో..ఏదో

నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ
నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ
యుగయుగాలు నీ నీలి కనుల సోయగము చూడనీవే..ఏ..ఏ

ఏదో..ఏదో
ఏదో..గిలిగింత..ఏమిటీ వింత
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..ఆ..ఆ..కంపించె తనువంత
ఏదో..ఏదో

Monday, January 12, 2015

స్వర్ణగౌరి--1962::ద్విజావంతి::రాగం



సంగీతం::M.V.రాజు
రచన::వీటూరిసుందరరామమూర్తి
గానం::S.జానకి,M.చిత్తరంజన్ 
తారాగణం::కాంతారావు,సత్యనారాయణ,పద్మనాభం,రాజబాబు,కృష్ణకుమారి,సంధ్య,రాజశ్రీ,రమాదేవి
ద్విజావంతి::రాగం 

పల్లవి::

జయమీవే..జగదీశ్వరి
కావ్యగాన..కళాసాగరి
జయమీవే..జగదీశ్వరి

చరణం::1

పదముల వెలసే..లయతాళాలు
పదముల వెలసే..లయతాళాలు
నీ కథలే..మధురగీతాలు
దరహాసాలే..వరాలస్వరాలు
అరహాసాలే..వరాలస్వరాలు
రాగము వేదము..నీవేలే
జయమీవే..జగదీశ్వరి

చరణం::2

నీ చరణములే..నమ్మినదాన
నీదాన..దయార్ధినిగానా?
నీ చరణములే..ఏ..నమ్మినదాన
నీదాన..దయార్ధినిగానా?
చిలుకగ రాదే..నీ జడివాన
చిలుకగ రాదే..నీ జడివాన
మాతా..మంగళదేవివే
జయమీవే..జగదీశ్వరి
జయమీవే..జగదీశ్వరి..ఈ
జయమీవే..జగదీశ్వరి

గమగమ దనిదని రిగరిగ
మపమప దనిదని సమగప
గపమా గపమా గపమా గమ
జయమీవే..జగదీశ్వరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ    
జయమీవే..జగదీశ్వరి

దనిపమ గమదని పమగమ
రిగరిస నిసనిస దనిదని
గమగమ రిగరిస నిసనిరి
సరినిస రిరిరిగ గగమమ
మదపద మపగమ సాదప
మాగమ రీసా దపమా గమరీ
సాదప మాగమ రీ...
జయమీవే..జగదీశ్వరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ    
జయమీవే..జగదీశ్వరి

Swarnagouri--1962
Music::M.V.Raaju
Lyrics::Veeturisundararaamamoorti
Singer's::S.Jaanaki,M.Chittaranjan 
Cast::Kantaraavu,Satyanaaraayana,Padmanabham,Rajababu,Krishnakumari,Sandya,Rajasree,Ramaadevi.

Dwijaavanti::raaga
:::::

jayameevE..jagadeeSwari
kaavyagaana..kaLaasaagari
jayameevE..jagadeeSwari

::::1

padamula velasE..layataaLaalu
padamula velasE..layataaLaalu
nee kathalE..madhurageetaalu
darahaasaalE..varaalaswaraalu
arahaasaalE..varaalaswaraalu
raagamu vEdamu..neevElE
jayameevE..jagadeeSwari

::::2

nee charaNamulE..namminadaana
needaana..dayaardhinigaanaa?
nee charaNamulE..E..namminadaana
needaana..dayaardhinigaanaa?
chilukaga raadE..nee jaDivaana
chilukaga raadE..nee jaDivaana
maataa..mangaLadEvivE
jayameevE..jagadeeSwari
jayameevE..jagadeeSwari..ii
jayameevE..jagadeeSwari

gamagama danidani rigariga
mapamapa danidani samagapa
gapamaa gapamaa gapamaa gama
jayameevE..jagadeeSwari
aa aa aa aa aa aa aa aa aa    
jayameevE..jagadeeSwari

danipama gamadani pamagama
rigarisa nisanisa danidani
gamagama rigarisa nisaniri
sarinisa riririga gagamama
madapada mapagama saadapa
maagama reesaa dapamaa gamarii
saadapa maagama ree...
jayameevE..jagadeeSwari
aa aa aa aa aa aa aa aa aa    
jayameevE..jagadeeSwari

Thursday, January 08, 2015

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

నగుమోము చూపించవా..గోపాలా
నగుమోము చూపించవా..గోపాలా
మగువల మనసుల..ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

చరణం::1

ఎదుట..ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట
ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట 
ఎదుట వెన్నెల పంట..ఎదలో తీయని మంట
ఇక సైపలేను నీవే నా..ముద్దుల జంట
నగుమోము చూపించవా గోపాలా 

చరణం::2

వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ 
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ 
మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల 
నగుమోము చూపించవా గోపాలా  

చరణం::3

కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
నెలవంకలిడి నన్ను అలరించవేమయ్య
నగుమోము చూపించవా గోపాలా 

నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల ఉడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

దేవదాసు--1974


సంగీతం::రమేష్‌నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య 

పల్లవి::

కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ

చరణం::1

ఒక కంట గంగ..ఒక కంట యమునా 
ఒక్కసారే కలసి..ఉప్పొంగెనూ 
ఒక్కసారే కలసి..ఉప్పొంగెనూ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కన్నీటి వరదలో నువు మునిగినా
చెలి కన్నుల చెమరింపు..రాకూడదూ 
చెలి కన్నుల చెమరింపు..రాకూడదూ
కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 

చరణం::2

ఓఓఓఓఓఓఓఓ..ఆఆఆఆఆఆఆఆఆ
మనసొక చోట..మనువొక చోట 
మమతలు పూచిన..పూదోట 
మమతలు పూచిన..పూదోట
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కోరిన చిన్నది..కుంకుమ రేఖల 
కుశలాన ఉండాలి..ఆ చోట 
కుశలాన ఉండాలి..ఆ చోట
కలచెదిరిందీ..కథ మారిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 
కన్నీరే..యిక మిగిలిందీ 

Tuesday, January 06, 2015

రెండు జెళ్ళ సీత--1983


















సంగీతం::రమేష్‌నాయుడు    
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి 
తారాగణం::నరేష్,ప్రదీప్,మహాలక్ష్మీ,రాజేష్,సూధాకర్.   

పల్లవి::

మందారంలో..ఘుమఘుమలై..
మకరందంలో..మధురిమలై..
మంత్రాక్షరమై..దీవించేది
మనమై మనదై..జీవించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ 

చరణం::1

గంగలాగ పొంగి..వచ్చి
యమునలాగ..సంగమించి
గంగలాగ పొంగి..వచ్చి
యమునలాగ..సంగమించి
కౌగిలిలో...కాశీ క్షేత్రం
శివశక్తుల..తాండవ నృత్యం
కౌగిలిలో...కాశీ క్షేత్రం
శివశక్తుల..తాండవ నృత్యం
నిలిచి..వలపు పండించేది
నిన్ను నన్ను..బ్రతికించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ

అనురాగానికి..పరిమళమై
ఆరాధనకి..సుమగళమై
వేదాశీస్సులు కురిపించేది
వేయి ఉషస్సులు..వెలిగించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ 

చరణం::2 

ఒక ప్రేమ..అమృత శిల్పం
ఒక ప్రేమ..బుద్దుడి రూపం
ఒక ప్రేమ..రామచరిత్రం
ఒక ప్రేమ..గాంధీ తత్వం
ఒక ప్రేమ..అమృత శిల్పం
ఒక ప్రేమ..బుద్ధుడి రూపం
ఒక ప్రేమ..రామచరిత్రం
ఒక ప్రేమ..గాంధీ తత్వం

చితినైనా..చిగురించేది
మృతినైనా..బ్రతికించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ
నేనున్నాని కోరేదీ.. 
నీవే నేనని నీడయ్యేదీ..ఈ
కమ్మగ చల్లగ..కనిపించేది
బ్రహ్మని సైతం..కని పెంచేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ

మందారంలో ఘుమఘుమలై..
మకరందంలో మధురిమలై..
మంత్రాక్షరమై దీవించేది
మనమై మనదై జీవించేది
ప్రేమ..ఆఆ..ప్రేమ ప్రేమ..ఆఆఆ
ప్రేమ..ఆఆ..ప్రేమ ప్రేమ..ఆఆఆ
ప్రేమ..ఆఆ..ప్రేమ ప్రేమ..ఆఆఆ

Monday, January 05, 2015

గాలి మేడలు--1962



సంగీతం::T.G.లింగప్ప
రచన::శ్రీరామచంద్  
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,దేవిక,S.V.రంగారావు,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,
M.V.రాజమ్మ,రాజనాల

పల్లవి::

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

హృదయాలు రెండు దరిచేరాయి గాన
మన హృదయాలు రెండు దరిచేరాయి గాన
పలికాయి ఆలాపనా..ఆ ఆ ఆ ఆ ఆ

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

చరణం::1

ప్రియ నీవేను నా తోడు నీడా
నే జీవింతు నీ అడుగుజాడా 
మ్మ్ హు ఉహు ఉహు ఉహు ఉహూ 
ప్రియ నీవేను నా తోడు నీడా
నే జీవింతు నీ అడుగుజాడా

మురిపాలు మీద మన సరదాలు తీర
జతగాను ఉందాము..ఈరీతిగా

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

చరణం::2

ఈ విరజాజి వికసించెనోయీ
నా తొలి పూజా ఫలియించె నోయీ

ఈ విరజాజి వికసించెనోయీ
నా తొలి పూజా ఫలియించె నోయీ
నీదాననోయి..నను విడనాడకోయీ
నీ చెంత బ్రతుకెంతొ..హాయి..హాయీ

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

చరణం::3

ఇక ఆకాషమే విరిగి పడనీ
ఒక క్షణమైన విడిపోము రాణీ
మ్మ్ హు ఉహూ ఉహూ ఉహూ ఉహూ ఉహూ
ఇక ఆకాషమే విరిగి పడనీ
ఒక క్షణమైన విడిపోము రాణీ
కలనైన గాని..ఈ ఇలలోన గానీ
ఎడబాటే దరిరాదు..నా మోహినీ

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా

హృదయాలు రెండు దరిచేరాయి గాన
మన హృదయాలు రెండు దరిచేరాయి గాన
పలికాయి ఆలాపనా..ఆ ఆ ఆ ఆ ఆ

నవరాగాలు పాడింది..ఏల 
మది నాట్యాలు ఆడింది..చాలా


Gaali Medalu--1962
Music::T.G.Lingappa
Lyrics::Sreeraamachand
Singer's::P.B.Sreenivaas, P.Suseela
Cast::N.T.Ramaraavu,Devika,S.V.Rangaraavu,Jaggayya,Naagayya,Ramanaareddi,M.V.Raajamma,Raajanaala.

::::

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

hRdayaalu renDu darichEraayi gaana
mana hRdayaalu renDu darichEraayi gaana
palikaayi aalaapanaa..aa aa aa aa aa

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

::::1

priya neevEnu naa tODu neeDaa
nE jeevintu nee aDugujaaDaa 
mm hu uhu uhu uhu uhuu 
priya neevEnu naa tODu neeDaa
nE jeevintu nee aDugujaaDaa

muripaalu meeda mana saradaalu teera
jatagaanu undaamu..iireetigaa

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

::::2

ii virajaaji vikasinchenOyii
naa toli poojaa phaliyinche nOyii

ii virajaaji vikasinchenOyii
naa toli poojaa phaliyinche nOyii
needaananOyi..nanu viDanaaDakOyii
nee chenta bratukento..haayi..haayii

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

::::3

ika AkaashamE virigi paDanii
oka kshaNamaina viDipOmu raaNii
mm hu uhuu uhuu uhuu uhuu uhuu
ika AkaashamE virigi paDanii
oka kshaNamaina viDipOmu raaNii
kalanaina gaani..ii ilalOna gaanii
eDabaaTE dariraadu..naa mOhinii

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

hRdayaalu renDu darichEraayi gaana
mana hRdayaalu renDu darichEraayi gaana
palikaayi aalaapanaa..aa aa aa aa aa

navaraagaalu paaDindi..Ela 
madi naaTyaalu ADindi..chaalaa

Saturday, January 03, 2015

అనుకొన్నది సాధిస్తా--1978



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8021
సంగీతం::రమేష్‌నాయుడు
రచన::మైలవరపు గోపి 
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::P.ChandraShekharReddi
తారాగణం::నరసింహరాజు,లత.

పల్లవి::

ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది..నీకు నాకు తెలియదు

ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది..నీకు నాకు తెలియదు..ఊ
ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు

చరణం::1

గఘనములో వెన్నెలలూ..అందరు చూస్తారు
గఘనములో వెన్నెలలూ..అందరు చూస్తారు
చెలి చూపుల చంద్రకళలూ..ఎంతమంది చూడగలరు

కళ్ళు కళ్ళు కలవగనే..ఏఏఏ..వలపని అనుకొంటారు
కళ్ళు కళ్ళు కలవగనే..ఏఏఏ..వలపని అనుకొంటారు
గుండెలోని మూగభాష..ఎంతమంది వినగలరు

ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది..నీకు నాకు తెలియదు..ఊ
ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు

చరణం::2

ఏడడుగులు నడిపించేదీ..ఈ..ఒకే బాట కాదమరి
ఏడడుగులు నడిపించేదీ..ఈ..ఒకే బాట కాదమరి
చేయి చేయి కలిపేదీ..ఈ..చెరిసగమై బ్రతకమనీ

కొంగులు ముడి వేసేది..కోర్కెల ముడి విప్పమనీ..ఈ
కొంగులు ముడి వేసేది..కోర్కెల ముడి విప్పమనీ..ఈ
పానుపుపై చేరేది..పరవశించిపోవాలనీ

ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది..నీకు నాకు తెలియదు..ఊ
ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు

Anukonnadi Saadista--1978
Music::Ramesh Naidu,
Lyricis::Mylavarapu Gopi
Singer's::S.P.Balu,P.Susheela,
Film Directed By::P.ChandraShekhar Reddi
Cast::Narasimharaaju,Lata.

:::::::::::

prEmanTE lOkamlO..OOO..evariki teliyadu
prEmagaaka vErEdi..neeku naaku teliyadu

prEmanTE lOkamlO..OOO..evariki teliyadu
prEmagaaka vErEdi..neeku naaku teliyadu..uu
prEmanTE lOkamlO..OOO..evariki teliyadu

::::1

gaghanamulO vennelaluu..andaru choostaaru
gaghanamulO vennelaluu..andaru choostaaru
cheli choopula chandrakaLaluu..entamandi chooDagalaru

kaLLu kaLLu kalavaganE..EEE..valapani anukonTaaru
kaLLu kaLLu kalavaganE..EEE..valapani anukonTaaru
gunDelOni moogabhaasha..entamandi vinagalaru

prEmanTE lOkamlO..OOO..evariki teliyadu
prEmagaaka vErEdi..neeku naaku teliyadu..uu
prEmanTE lOkamlO..OOO..evariki teliyadu

::::2

EDaDugulu naDipinchEdii..ii..okE baaTa kaadamari
EDaDugulu naDipinchEdii..ii..okE baaTa kaadamari
chEyi chEyi kalipEdii..ii..cherisagamai bratakamanii

kongulu muDi vEsEdi..kOrkela muDi vippamanii..ii
kongulu muDi vEsEdi..kOrkela muDi vippamanii..ii
paanupupai chErEdi..paravaSinchipOvaalanii

prEmanTE lOkamlO..OOO..evariki teliyadu
prEmagaaka vErEdi..neeku naaku teliyadu..uu
prEmanTE lOkamlO..OOO..evariki teliyadu

గృహలక్ష్మి--1985



సంగీతం::చెళ్లపిళ్ల సత్యం 
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P..సుశీల
Film Directed By::B.Bhaskar Rao
Film Producer By::Ramachandra Reddi
తారాగణం::మోహన్‌బాబు,భానుప్రియ,రాధిక,అన్నపూర్ణ,ప్రభాకర్ రెడ్డి,వీరభద్రరావు,సుత్తివేలు,జగ్గయ్య,గిరిబాబు,మిక్కిలినేని,మమత,అనురాధ.

పల్లవి::

మేలుకోర తెల్లవారెను కృష్ణయ్యా   
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా

నీ ముద్దు మోమును చూడాలి 
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా

చరణం::1

నీవిచ్చిన సౌభాగ్యం..దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా..నిలవాలి..ఈ
నీవిచ్చిన సౌభాగ్యం..దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా..నిలవాలి
నెలవంక వెన్నెలగా..పెరగాలి
నిన్ను నమ్మి ఉన్నాము..కృష్ణా..ఆ

మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

చరణం::2

దేవకి వసుదేవులు..రేపల్లె పౌరులు
నీకోసమే ఎదురుచూస్తూ..ఉన్నారు
దేవకి వసుదేవులు..రేపల్లె పౌరులు
నీకోసమే ఎదురుచూస్తూ..ఉన్నారు
సరసాలకు ఇది సమయం..కాదురా..ఆ 
సందె వేళదాకైనా ఆగార..కృష్ణా..ఆ

మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

చరణం::3

నీధర్మం నెరవేర్చు..అది జన్మలు కడతేర్చు 
అని నీవే అన్నావు..ఆ దారినే పోనివ్వు
మంచైనా చేడుకైన..భరియించే బలమివ్వు..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

నీ ముద్దు మోమును చూడాలి 
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

Gruha Lakshmi (1985)
Music::CheLlapilla Satyam 
Lyrics::Achaarya-Atreya
Singer::P.Suseela
Cast::Mohanbabu,Bhanupriya,Radhika,M.Prabhakar Reddi,Veerabhadra Rao,Suttivelu,Jaggayya.
Giribaabu,Mikkilineni,Mamata,Anuradha.

:::::::::::::

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa
mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

nee muddu mOmunu chooDaali 
maa poddu appuDE poDavaali
nee navvE velugai ninDaali..kRshNaa..aa
mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

::::1

neevichchina saubhaagyaM..deevinchina samsaaram
nee neeDana nilakaDagaa..nilavaali..ii
neevichchina saubhaagyam..deevinchina samsaaram
nee neeDana nilakaDagaa..nilavaali
nelavanka vennelagaa..peragaali
ninnu nammi unnaamu..kRshNaa..aa

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

::::2

dEvaki vasudEvulu..rEpalle paurulu
neekOsamE eduruchoostoo..unnaaru
dEvaki vasudEvulu..rEpalle paurulu
neekOsamE eduruchoostoo..unnaaru
sarasaalaku idi samayam..kaaduraa..aa 
sande vELadaakainaa aagaara..kRshNaa..aa

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

::::3

needharmam neravErchu..adi janmalu kaDatErchu 
ani neevE annaavu..aa daarinE pOnivvu
manchainaa cheDukaina..bhariyinchE balamivvu..kRshNaa..aa

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

nee muddu mOmunu chooDaali 
maa poddu appuDE poDavaali
nee navvE velugai ninDaali..kRshNaa..aa
mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa