సంగీతం::K.V.మహదేవన్ రచన::సిరివెన్నెల గానం::S.P.బాలు,B.వసంత తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ పల్లవి:: ఆ..ఆ..ఆ పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్న పొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వల చెన్న కథ మారే రోజులు కోరేనూ ఓ గువ్వలచెన్న కల తీరే దారులు వెతికేనూ ఓ గువ్వలచెన్నా ఆ ఆ ఆ ఆ ..ఆ ఆ ఆ ఆ చరణం::1 గుళ్ళో నిను చూడలేకున్నా..ఓ గువ్వల చెన్న గుండెల్లో దాచుకున్నాలే..ఓ గువ్వలచెన్న ఆ..ఆ..ఆ యే సీమల తిరుగాడినా..ఓ గువ్వలచెన్న నీ దీవెనలందించాలన్నా..ఓ గువ్వలచెన్న ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ Sirivennela--1986 Music::K.V.Mahadevan Lyricis::Sirivennela Seetharama Shastry Singer's::S.P.Balasubrahmanyam,S.P.Sailaja
aa..aa..aa polimera daatipotunna o guvvala chenna porugooriki cheripotunna o guvvala chenna kathamaare rojulu koreroo o guvvala chenna kalateere daarulu vetikenoo o guvvala chenna aa..aa..aa..aa..aa..aa..aa..aa :::1 gullo ninu choodalekunna o guvvala chenna gundello daachukunnaale o guvvala chenna aa..aa..aa e seemalo tirugaadina o guvvala chenna nee deevenalandichaalanna o guvvala chenna
సంగీతం::K.V.మహదేవన్ రచన::సిరివెన్నెల గానం::S.P.బాలు తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ పల్లవి:: మెరిసే తారలదే..రూపం విరిసే పూవులదే..రూపం అది నా కంటికి..శూన్యం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది..ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత..ప్రతిరూపం నీ రూపం.. అపురూపం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది..ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత..ప్రతిరూపం నీ రూపం.. అపురూపం చరణం::1 ఎవరి రాకతో..గళమున పాటల ఏరువాక..సాగేనో ఆ వసంత మాసపు..కులగోత్రాలను ఎల కోయిల..అడిగేనా ఎవరి పిలుపుతో..పులకరించి పురి విప్పి తనువు..ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి..వెదుకులాడేనా నా కన్నులు..చూడని రూపం గుడిలో దేవత..ప్రతిరూపం నీ రూపం..అపురూపం చరణం::2 ప్రాణం పుట్టుక..ప్రాణికి తెలియాలా గానం పుట్టుక..గాత్రం చూడాలా ప్రాణం పుట్టుక..ప్రాణికి తెలియాలా గానం పుట్టుక..గాత్రం చూడాలా వెదురును..మురళిగ మలచి ఈ వెదురును..మురళిగ మలచి నాలొ జీవన నాదం పలికిన నీవే నా..ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది..ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత..ప్రతిరూపం నీ రూపం..అపురూపం
సంగీతం::K.V.మహదేవన్ రచన::సీతారామ శాస్త్రి గానం::S.P.బాలు అమృతవర్షిణి::రాగం ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: ఈ గాలి..ఈ నేల..ఈ ఊరు సెలయేరు ఈ గాలి..ఈ నేల..ఈ ఊరు సెలయేరు ననుగన్న నా వాళ్ళు ఆ..నా కళ్ళ లోగిళ్ళు ననుగన్న నా వాళ్ళు ఆ..నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి..ఈ నేల చరణం::1 చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాకా ఎగసేను నింగి దాకా ఈ గాలి..ఈ నేల..ఈ ఊరు సెలయేరు ననుగన్న నా వాళ్ళు ఆ..నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి..ఈ నేల చరణం::2 ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై కన్నె మూగమనసుకన్న స్వర్న స్వప్నమై తళుకుమన్న తారచిలుకు కాంతి చినికులై గగనగళము నుండి అమర గానవాహిని గగనగళము నుండి అమర గానవాహిని జాలువారుతోంది ఇలా అమృతవర్షినీ అమృతవర్షిని ఈ స్వాతివానలో నా ఆత్మ స్నానమాడే నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే
సంగీతం::K.V.మహదేవన్ రచన::సిరివెన్నెల గానం::S.P.బాలు,P.సుశీల,G.ఆనంద్ తారాగణం::సుహాసిని,సర్వదమన్ బెనర్జీ,మూన్ మూన్ సేన్,సాక్షి రంగారావు,సుధాకర్,సంయుక్త,శుభ పల్లవి:: పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు ఆహా ఓహో అంటున్నదీ..అది ఆహా ఓహో అంటున్నదీ చరణం::1 ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి నల్లనయ్యా..పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా నల్లనయ్యా..పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా నల్లనయ్యా..ఆ చరణం::2 అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము ఈ కోటలోన దాగి వున్నదీ నాటీ ప్రేమగాధలెన్నొ కన్నది అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము ఈ కోటలోన దాగి వున్నదీ నాటీ ప్రేమగాధలెన్నొ కన్నది హిస్టరీల మిస్టులోన మిస్టరీని చాటిచెప్పి ఆహా ఓహో..అంటూన్నదీ అది ఆహా ఓహో..అంటూన్నదీ చరణం::3 రాసలీలా..రాధహేల రాసలీలా..రాధహేల రసమయమై..సాగు వేళా తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా నురుగులు పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే నల్లనయ్యా..పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా లా లా లా లా లా లా లా లా లా లా