Tuesday, January 13, 2015

అమరశిల్పి జక్కన్న--1964



సంగీతం::సాలూరి రాజేశ్వర రావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,B.సరోజాదేవి,నాగయ్య,హరనాధ్,గిరిజ,రేలంగి,ధూళీపాళ

పల్లవి::

ఏదో..ఏదో
ఏదో..గిలిగింత..ఏమిటీ వింత..ఆ
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..ఆ..ఆ..కంపించె తనువంత

ఏదో..ఏదో..ఏదో..గిలిగింత..ఏమిటీ వింత
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..కంపించె తనువంత

చరణం::1

వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే..ఏ..ఏ
అహ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వలపు తలుపు తీసే..కమ్మని తలపు నిదురలేచే
నీవు తాకినా నిముషమందె నా యవ్వనమ్ము పూచే..ఏ..ఏ

ఏదో..ఏదో

కన్ను కన్ను కలిసే..బంగరు కలలు ముందు నిలిచే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కన్ను కన్ను కలిసే..బంగరు కలలు ముందు నిలిచే
పండు వెన్నెలల బొండు మల్లియలు గుండెలోన విరిసే..ఏ..ఏ..ఏ
ఏదో..ఏదో

చరణం::2

గానమైన నీవే..నా ప్రాణమైన నీవే
గానమైన నీవే..నా ప్రాణమైన నీవే
నన్ను వీణగా మలచుకొనెడు గంధర్వ రాజు వీవే

ఏదో..ఏదో

నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ
నన్ను చేర రావే నా అందాల హంస వీవే..ఏ..ఏ
యుగయుగాలు నీ నీలి కనుల సోయగము చూడనీవే..ఏ..ఏ

ఏదో..ఏదో
ఏదో..గిలిగింత..ఏమిటీ వింత
ఏమని అందును..ఏనాడెరుగను 
ఇంత పులకింత..ఆ..ఆ..కంపించె తనువంత
ఏదో..ఏదో

No comments: