సంగీత::సాలూరు రాజేశ్వరరావు
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
కోటి దీప ప్రభలలో..స్వామి కోనేటి నీటి అలలలో
శతకోటి భక్తుల నయనమ్ములలో
తెప్ప పై వేంచేయు తిరుపతి రమణా..ఆ ఆ ఆ ఆ
కోటి దీప ప్రభలలో..స్వామి కోనేటి నీటి అలలలో
శతకోటి భక్తుల నయనమ్ములలో..ఓఓఓ
తెప్ప పై వేంచేయు తిరుపతి రమణా..ఆ
చరణం::1
దశకంటు దునుమాడి ధరణియను చేకొనీ
పురమునకు అరుదెంచు పురుషొత్తమా..రామా..ఆ ఆ
దశకంటు దునుమాడి ధరణియను చేకొనీ
పురమునకు అరుదెంచు పురుషొత్తమా
ఆనాటి పుష్పకము ఈ నాడు కనులారా
ఆనాటి పుష్పకము ఈ నాడు కనులారా
కాంచు తున్నామయా కరువుదీరా
కోటి దీప ప్రభలలో..స్వామి కోనేటి నీటి అలలలో
తెప్ప పై వేంచేయు తిరుపతి రమణా
చరణం::2
కాళింది మడుగునా కాళీయు శిరమునా
చిందులనూ వేసినా చిన్ని తాండవ కృష్ణా
రేపల్లెలో నాటి దీపావళిని నేడు
రేపల్లెలో నాటి దీపావళిని నేడు
కాంచుచున్నామయా కరువు తీరా
చరణం::3
శృష్టి స్థితి లయ కారణ కార్యా
శృష్టి స్థితి లయ కారణ కార్యా
సకల మతాచార సారాచార్యా
భవభయ పాప విమోచన భౌర్యా
ధినకర ఆత్రేయ తేజోవీర్యా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా
రామకృష్ణ గోవింద శ్రీవేంకటేశా
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
No comments:
Post a Comment