Showing posts with label Film Directed By::B.Bhaskar Rao. Show all posts
Showing posts with label Film Directed By::B.Bhaskar Rao. Show all posts

Tuesday, April 07, 2015

చల్ మోహన రంగ--1978




 సంగీతం::B.శంకర్ ((ఘజల్ శంకర్))
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు P.సుశీల
Film Directed By::B.Bhaskar Rao
తారాగణం::కృష్ణ,దీప,గుమ్మడి,మోహన్‌బాబు,M.ప్రభకర్ రెడ్డి,రావుగోపాలరావు,జానకి.

పల్లవి::

ఎన్నాళ్ళీ తలపులు..కలల మేలుకొలుపులు
ఎగిసిపడే హృదయంలో..ఘడియ పడని తలుపులు

ఎన్నాళ్లీ పిలుపులు..మూసిన కనుకొలకులు
ఎన్నాళ్లీ పిలుపులు..మూసిన కనుకొలకులు
నువు నడిచే బాటలో..తీయని తొలి మలుపులు

ఎన్నాళ్ళీ తలపులు..ఎన్నాళ్లీ పిలుపులు

చరణం::1

తారకలే నీ కన్నుల..తోరణాలు తీర్చేనా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా
చిరునవ్వులలు వెన్నెలకే..కొత్త సిగ్గు నేర్పేనా
కొత్త సిగ్గు నేర్పేనా
నిదుర రాదు..నిదుర రాదు
నిదుర రాదు..నిదుర రాదు
నిను చూసిన..కనులకు 

ఎన్నాళ్ళీ తలపులు..ఎన్నాళ్లీ పిలుపులు

చరణం::2

ఆమని నీ కౌగిలో..అలసి నిలిచి పోయేనా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆమని నీ కౌగిలో..అలసి నిలిచి పోయేనా
ఏమని నా మనసు నన్నే..విసిగి వేసరించేనా
విసిగి వేసరించేనా

విడిది చేసే మధుమాసం
విడిది చేసే మధుమాసం
చల్లని నీ లే ఎదలో
చల్లని నీ లే ఎదలో 

ఎన్నాళ్ళీ తలపులు..ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు..ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు..ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు..ఎన్నాళ్లీ పిలుపులు

Jayammu-Nichayammura--1978
Music::B.Sankar (Gajal Sankar)
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::SP.Baalu,P.Suseela
Film Directed By::B.Bhaskar Rao
Cast::Krishna,Gummadi,Deepa,Mohanbaabu,M.Prabhaakar Reddi,Rao Gopal Rao,Jaanaki.

::::::::::::::::::::::::::::::::::

ennaaLLii talapulu..kalala mElukolupulu
egisipaDE hRdayamlO..ghaDiya paDani talupulu

ennaaLLii pilupulu..moosina kanukolakulu
ennaaLLii pilupulu..moosina kanukolakulu
nuvu naDichE baaTalO..teeyani toli malupulu

ennaaLLii pilupulu..ennaaLLii pilupulu

::::1

taarakalaE nii kannula..tOraNaalu teerchEnaa
aa..aa..aa..aa..aa..aa..aa
taarakalE nii kannula tOraNaalu teerchEnaa
chirunavvulalu vennelakE..kotta siggu nErpEnaa
kotta siggu nErpEnaa
nidura raadu..nidura raadu
nidura raadu..nidura raadu
ninu choosina..kanulaku 

ennaaLLii pilupulu..ennaaLLii pilupulu

::::1

aamani nii kaugilO..alasi nilichi pOyEnaa
aa..aa..aa..aa..aa..aa..aa
aamani nii kaugilO..alasi nilichi pOyEnaa
Emani naa manasu nannE..visigi vEsarinchEnaa
visigi vEsarinchEnaa

viDidi chEsE madhumaasam
viDidi chEsE madhumaasam
challani nii lE edalO
challani nii lE edalO 

ennaaLLii talapulu..ennaaLLii pilupulu
ennaaLLii talapulu..ennaaLLii pilupulu
ennaaLLii talapulu..ennaaLLii pilupulu
ennaaLLii talapulu..ennaaLLii pilupulu

Saturday, January 03, 2015

గృహలక్ష్మి--1985



సంగీతం::చెళ్లపిళ్ల సత్యం 
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P..సుశీల
Film Directed By::B.Bhaskar Rao
Film Producer By::Ramachandra Reddi
తారాగణం::మోహన్‌బాబు,భానుప్రియ,రాధిక,అన్నపూర్ణ,ప్రభాకర్ రెడ్డి,వీరభద్రరావు,సుత్తివేలు,జగ్గయ్య,గిరిబాబు,మిక్కిలినేని,మమత,అనురాధ.

పల్లవి::

మేలుకోర తెల్లవారెను కృష్ణయ్యా   
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా

నీ ముద్దు మోమును చూడాలి 
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా

చరణం::1

నీవిచ్చిన సౌభాగ్యం..దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా..నిలవాలి..ఈ
నీవిచ్చిన సౌభాగ్యం..దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా..నిలవాలి
నెలవంక వెన్నెలగా..పెరగాలి
నిన్ను నమ్మి ఉన్నాము..కృష్ణా..ఆ

మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

చరణం::2

దేవకి వసుదేవులు..రేపల్లె పౌరులు
నీకోసమే ఎదురుచూస్తూ..ఉన్నారు
దేవకి వసుదేవులు..రేపల్లె పౌరులు
నీకోసమే ఎదురుచూస్తూ..ఉన్నారు
సరసాలకు ఇది సమయం..కాదురా..ఆ 
సందె వేళదాకైనా ఆగార..కృష్ణా..ఆ

మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

చరణం::3

నీధర్మం నెరవేర్చు..అది జన్మలు కడతేర్చు 
అని నీవే అన్నావు..ఆ దారినే పోనివ్వు
మంచైనా చేడుకైన..భరియించే బలమివ్వు..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

నీ ముద్దు మోమును చూడాలి 
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య 
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

Gruha Lakshmi (1985)
Music::CheLlapilla Satyam 
Lyrics::Achaarya-Atreya
Singer::P.Suseela
Cast::Mohanbabu,Bhanupriya,Radhika,M.Prabhakar Reddi,Veerabhadra Rao,Suttivelu,Jaggayya.
Giribaabu,Mikkilineni,Mamata,Anuradha.

:::::::::::::

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa
mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

nee muddu mOmunu chooDaali 
maa poddu appuDE poDavaali
nee navvE velugai ninDaali..kRshNaa..aa
mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

::::1

neevichchina saubhaagyaM..deevinchina samsaaram
nee neeDana nilakaDagaa..nilavaali..ii
neevichchina saubhaagyam..deevinchina samsaaram
nee neeDana nilakaDagaa..nilavaali
nelavanka vennelagaa..peragaali
ninnu nammi unnaamu..kRshNaa..aa

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

::::2

dEvaki vasudEvulu..rEpalle paurulu
neekOsamE eduruchoostoo..unnaaru
dEvaki vasudEvulu..rEpalle paurulu
neekOsamE eduruchoostoo..unnaaru
sarasaalaku idi samayam..kaaduraa..aa 
sande vELadaakainaa aagaara..kRshNaa..aa

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

::::3

needharmam neravErchu..adi janmalu kaDatErchu 
ani neevE annaavu..aa daarinE pOnivvu
manchainaa cheDukaina..bhariyinchE balamivvu..kRshNaa..aa

mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

nee muddu mOmunu chooDaali 
maa poddu appuDE poDavaali
nee navvE velugai ninDaali..kRshNaa..aa
mElukOraa telavaarenu..kRshNayya 
maa mEluchoosE challani daivam neevayyaa

Thursday, March 27, 2014

గృహప్రవేశం--1988




సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::జలాది రాజా రావు
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::మోహన్ బాబు , జయసుధ.

పల్లవి::

అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో

నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో

చరణం::1

ఆ కనులు ఇంద్ర నీలాలుగా
ఈ తనువు చంద్రశిఖరాలుగా కదలాడు కల్యాణివే
నా హృదయం మధుర సంగీతమై
కల్యాణ వీణ స్వరగీతమై శ్రుతి చేయు జతగాడివే

ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే
నవయువ కవిరాజువో..అభినవ శశిరేఖవో

చరణం::2

నా వయసు వలపు హరివిల్లుగా
నవపారిజాతాల పొదరిల్లుగా రావోయి రవిశేఖరా
తొలి సంధ్య మధుర మందారమే
నీ నుదిటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనా
నా నూరేళ్ళ నెలవళ్ళు కరిగించనా


నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో

అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో

Saturday, November 10, 2012

ధర్మాత్ముడు--1983


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4188
సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు,P.సుశీల,S.జానకి 
film Directed By::B.Bhaaskar Rao
తారాగణం::కృష్ణంరాజు,జయసుధ,విజయశాంతి,గుమ్మడి,ప్రభాకర్ రెడ్డి, 

పల్లవి:: 

దమ్ముంటే కాచుకోండి..దిల్లుంటే లేచిరండి
పోరుకైనా..పొందుకైనా..ఎందుకైనా..దా

సోగాడా..నీ వలపులు గెలుపులు ఏ వేళా..అవి నావే నావే
మొనగాడా..నా కులుకులు తళుకులు నీకేరా..ఇవి నీకే..నీకే

దమ్ముంటే కాచుకోండి..దిల్లుంటే లేచిరండి
పోరుకైనా..పొందుకైనా..ఎందుకైనా..దా

చరణం::1

ఎందరెందరినో చూసినాను..నీ పొగరు వాడి లేదే..హా..హా
ఆటపాటలకు రాణి నేను..నీ ముందు ఓడిపోనీ

పపపప..రా
రూపంలో గులాబి ఒకరు..ఊరించే షరాబీ ఒకరు..హా
రారారారా..రారారా..రారారారా..రారారా

సోగాడా..నీ వలపులు గెలుపులు ఏ వేళా..అవి నావే నావే
మొనగాడా..నా కులుకులు తళుకులు నీకేరా..ఇవి నీకే..నీకే

దమ్ముంటే కాచుకోండి..దిల్లుంటే లేచిరండి
పోరుకైనా..పొందుకైనా..ఎందుకైనా..దా 

చరణం::2

కునుకు రాదు నీ రూపు చూసి..ఆ తప్పు నాది కాదు..ఆహా
నిలువ లేను నీ తోడు లేక..నేనెటుల చెప్పుకోను 

షబదరబరా..
నీలోని వయారం నాది..నాలోని సరాగం నీది రా
రారారారా..రారారా..రారారారా..రారారా

మొనగాడా..నా కులుకులు తళుకులు నీకేరా..ఇవి నీకే నీకే 
సోగ్గాడా..నీ వలపులు గెలుపులు ఏ వేళా..అవి నావే నావే

దమ్ముంటే కాచుకోండి..దిల్లుంటే లేచిరండి
పోరుకైనా..పొందుకైనా..ఎందుకైనా..దా..దా  

Dharmaatmudu--1983
Music::Satyam
Lyrics::Mailavarapu Gopi
Singer's::S.P.Baalu,P.Suseela,S.Janaki.
film Directed By::B.Bhaaskar Rao
Cast::Krishnam Raju,Jayasudha,Vijayasaanti,Gummadi,Prabhaakar Reddi, 

:::::::::::::::::::::::::::::::

dammunTE kaachukOnDi..dillunTE lEchiranDi
pOrukainaa..pondukainaa..endukainaa..daa

sOgaaDaa..nii valapulu gelupulu E vELaa..avi naavE naavE
monagaaDaa..naa kulukulu taLukulu neekEraa..ivi neekE..neekE

dammunTE kaachukOnDi..dillunTE lEchiranDi
pOrukainaa..pondukainaa..endukainaa..daa

::::1

endarendarinO choosinaanu..nii pogaru vaaDi lEdE..haa..haa
aaTapaaTalaku raaNi nEnu..nii mundi ODipOnii

papapapa..raa
roopanlO gulaabi okaru..UrinchE sharaabii okaru..haa
raaraaraaraa..raaraaraa..raaraaraaraa..raaraaraa

sOgaaDaa..nii valapulu gelupulu E vELaa..avi naavE naavE
monagaaDaa..naa kulukulu taLukulu neekEraa..ivi neekE..neekE

dammunTE kaachukOnDi..dillunTE lEchiranDi
pOrukainaa..pondukainaa..endukainaa..daa 

::::2

kunuku raadu nii roopu choosi..aa tappu naadi kaadu..aahaa
niluva lEnu nii tODu lEka..nEneTula cheppukOnu 

shabadarabaraa..
neelOni vayaaram naadi..naalOni saraagam needi raa
raaraaraaraa..raaraaraa..raaraaraaraa..raaraaraa


monagaaDaa..naa kulukulu taLukulu neekEraa..ivi neekE neekE 
sOggaaDaa..nii valapulu gelupulu E vELaa..avi naavE naavE

dammunTE kaachukOnDi..dillunTE lEchiranDi
pOrukainaa..pondukainaa..endukainaa..daa..daa 

Friday, March 25, 2011

గృహప్రవేశం--1988::కానడ::రాగం




సంగీతం::సత్యం 
రచన::మైలవరపు గోపి
గానం::K.J.ఏసుదాసు   
తారాగణం::మోహన్‌బాబు,జయసుధ,గుమ్మడి,ప్రభాకరరెడ్డి,గిరిబాబు

కానడ::రాగం

పల్లవి::

దారి చూపిన దేవతా..ఈ చేయి ఎన్నడు వీడకా
దారి చూపిన దేవతా..ఈ చేయి ఎన్నడు వీడకా
జన్మ జన్మకు తోడుగా..నా దానివై నువ్వు నడిచిరా
దారి చూపిన దేవతా..ఈ చేయి ఎన్నడు వీడకా

చరణం::1

మనసులేని శిలను నేను..నువ్వు చూసిన నిన్నలో
మమత తెలిసి మనిషినైతి..చల్లని నీ చేతిలో
కన్ను తెరిచిన వేళలో..నీకేమి సేవలు చేతును
దారి చూపిన దేవతా..ఈ చేయి ఎన్నడు వీడకా

చరణం::2

మరపు రాదు మాసిపోదు..నేను చేసిన ద్రోహము
కలన కూడ మరువనమ్మా..నువ్వు చూపిన త్యాగము
ప్రేమ నేర్పిన పెన్నిధి..ఆ ప్రేమ నిను దీవించని

దారి చూపిన దేవతా..ఈ చేయి ఎన్నడు వీడకా
జన్మ జన్మకు తోడుగా..నా దానివై నువ్వు నడిచిరా
దారి చూపిన దేవతా..ఈ చేయి ఎన్నడు వీడకా

Thursday, March 25, 2010

గృహప్రవేశం--1988

















సంగీతం::సత్యం 
రచన::మైలవరపు గోపి
గానం::P.సుశీల   
తారాగణం::మోహన్‌బాబు,జయసుధ,గుమ్మడి,ప్రభాకరరెడ్డి,గిరిబాబు

పల్లవి::

శ్రీసత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా 
శ్రీసత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా

నోచిన వారికి నోచిన..వరము
చూసిన వారికి చూసిన..ఫలము

శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా 
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా

చరణం::1

స్వామిని పూజించే..చేతులె చేతులటా
ఆ మూర్తిని దర్శించే..కనులే కన్నులటా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
స్వామిని పూజించే..చేతులె చేతులటా
ఆ మూర్తిని దర్శించే..కనులే కన్నులటా

తన కథ వింటే ఎవ్వరికైనా..జన్మ తరించునట
శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా 
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా

చరణం::2

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ...ఆ..ఆ..ఆ..ఆ
ఏ వేళైన ఏ శుభమైనా..కొలిచే దైవం ఈ దైవం
ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ
ఏ వేళైన ఏ శుభమైనా..కొలిచే దైవం ఈ దైవం
అన్నవరంలో వెలసిన దైవం..ప్రతి ఇంటికి దైవం..ఉ

శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా 
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా

చరణం::3

అర్చన చేద్దామా మనసు..అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల..కడదామా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అర్చన చేద్దామా మనసు..అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల..కడదామా 
పది కాలాలు పసుపు కుంకుమలు..ఇమ్మని కోరేమా..ఆ

శ్రీ సత్యనారాయణుని..సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా 
మనసార స్వామిని కొలిచి..హారతులీరమ్మా 


మంగళమనరమ్మా జయ..మంగళమనరమ్మ
కరములు జోడించి..శ్రీ చందనమలరించి
మంగళమనరే శ్రీ సుందరముర్తికి..వందనమనరమ్మ