సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::నరేష్,ప్రదీప్,మహాలక్ష్మీ,రాజేష్,సూధాకర్.
పల్లవి::
మందారంలో..ఘుమఘుమలై..ఈఈఈ
మకరందంలో..మధురిమలై..ఈఈఈ
మంత్రాక్షరమై..దీవించేది
మనమై మనదై..జీవించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ
చరణం::1
గంగలాగ పొంగి..వచ్చి
యమునలాగ..సంగమించి
గంగలాగ పొంగి..వచ్చి
యమునలాగ..సంగమించి
కౌగిలిలో...కాశీ క్షేత్రం
శివశక్తుల..తాండవ నృత్యం
కౌగిలిలో...కాశీ క్షేత్రం
శివశక్తుల..తాండవ నృత్యం
నిలిచి..వలపు పండించేది
నిన్ను నన్ను..బ్రతికించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ
అనురాగానికి..పరిమళమై
ఆరాధనకి..సుమగళమై
వేదాశీస్సులు కురిపించేది
వేయి ఉషస్సులు..వెలిగించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ
చరణం::2
ఒక ప్రేమ..అమృత శిల్పం
ఒక ప్రేమ..బుద్దుడి రూపం
ఒక ప్రేమ..రామచరిత్రం
ఒక ప్రేమ..గాంధీ తత్వం
ఒక ప్రేమ..అమృత శిల్పం
ఒక ప్రేమ..బుద్ధుడి రూపం
ఒక ప్రేమ..రామచరిత్రం
ఒక ప్రేమ..గాంధీ తత్వం
చితినైనా..చిగురించేది
మృతినైనా..బ్రతికించేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ
నేనున్నాని కోరేదీ..ఈఈఈ
నీవే నేనని నీడయ్యేదీ..ఈఈఈ
కమ్మగ చల్లగ..కనిపించేది
బ్రహ్మని సైతం..కని పెంచేది
ప్రేమ..ప్రేమ..ప్రేమ..ఆఆఆ
మందారంలో ఘుమఘుమలై..ఈఈఈ
మకరందంలో మధురిమలై..ఈఈఈ
మంత్రాక్షరమై దీవించేది
మనమై మనదై జీవించేది
ప్రేమ..ఆఆ..ప్రేమ ప్రేమ..ఆఆఆ
ప్రేమ..ఆఆ..ప్రేమ ప్రేమ..ఆఆఆ
ప్రేమ..ఆఆ..ప్రేమ ప్రేమ..ఆఆఆ
No comments:
Post a Comment