సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::.P.సుశీల,ఘంటసాల
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,కాంచన, కృష్ణంరాజు, పద్మనాభం,నాగయ్య
పల్లవి::
ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ
సగం సగం..నిజం నిజం
నీవో సగం..నేనో సగం
నీవో సగం..నేనో సగం
సగాలు రెండూ..ఒకటైపోతే
జగానికే ఒక..నిండుదనం
నిజం నిజం నిజం నిజం ఫిఫ్టీ..ఫిఫ్టీ
చరణం::1
నీవే నాదం..నేనే గీతం
నీవే నాదం..నేనే గీతం
నీ నా కలయిక..సంగీతం
నీ నా కలయిక..సంగీతం
నీవే నింగి..నేనే నేల
నీవే నింగి..నేనే నేల
నిండు విలీనమే..ఈ భువనం
నీవే కుసుమం..నీవే భ్రమరం
పువ్వూ తుమ్మెద..ఒకటైపోతే
జగానికే ఒక..కమ్మదనం
నిజం నిజం..నిజం నిజం
ఫిఫ్టీ..ఫిఫ్టీ ఫిఫ్టీ..ఫిఫ్టీ
సగం సగం..నిజం నిజం
నీవో సగం..నేనో సగం
నీవో సగం..నేనో సగం
సగాలు రెండూ..ఒకటైపోతే
జగానికే ఒక..నిండుదనం
నిజం నిజం నిజం నిజం
ఫిఫ్టీ..ఫిఫ్టీ
చరణం::2
రాధ సగం..మాధవుడు సగం
రాధ సగం..మాధవుడు సగం
రాసవిహారమే..ప్రణయమయం
రాసవిహారమే..ప్రణయమయం
గౌరి సగం..శివుడు సగం
గౌరి సగం..శివుడు సగం
అర్ధనారీశ్వరమే..అఖిల జగం
అవినాభావం..అమృతరావం
అభేద రూపం..స్థిరమైపోతే
జగానికే ఒక..అమర పథం
నిజం నిజం..నిజం నిజం
ఫిఫ్టీ...ఫిఫ్టీ
సగం సగం..నిజం నిజం
నీవో సగం..నేనో సగం
సగాలు రెండూ..ఒకటైపోతే
జగానికే..ఒక నిండుదనం
ఫిఫ్టీ..ఫిఫ్టీ
No comments:
Post a Comment