Tuesday, January 13, 2015

సిరివెన్నెల--1986



సంగీతం::K.V.మహాదేవన్
రచన::సిరివెన్నెల  
గానం::S.P.బాలు 
తారాగణం::బెనర్జి,సుహాసిని,మున్‌మున్‌సేన్   

పల్లవి::

ప్రకృతి కాంతకూ యెన్నెన్ని హొయలో
పదము కదిపితే యెన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకూ యెన్నెన్ని హొయలో
పదము కదిపితే యెన్నెన్ని లయలో
యెన్నెన్ని హొయలో యెన్నెన్ని లయలో
యెన్నెన్ని హొయలో యెన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన యెదపై సిరి మువ్వల సవ్వడి నీవై
నర్తించగ రావేలా నిను నే కీర్తించే వేళా

చరణం::1

అలల పెదవులతో.ఓ..ఓ..ఓ..శిలల చెక్కిలి పై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
అలల పెదవులతో.ఓ..ఓ..ఓ..శిలల చెక్కిలి పై
కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగమూ

చరణం::2

కొండల బండల దారులలో..తిరిగేటి సెలయేటి గుండెలలో
కొండల బండల దారులలో..తిరిగేటి సెలయేటి గుండెలలో
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపు వికసించగనే
యెన్నెన్ని హొయలో యెన్నెన్ని లయలో

No comments: