Monday, December 31, 2012

HAPPY NEW YEAR 2013





♥♥♥ WEL COME TO ♥ 2013 ♥ HAPPY NEW YEAR ♥♥♥



♥♥♥ WEL COME TO ♥ 2013 ♥ HAPPY NEW YEAR ♥♥♥

Sunday, December 30, 2012

దేవుడు చేసిన మనుషులు--1973






సంగీతం::రమేష్‌నైడు  
రచన::దాశరధి 
గానం::S.P.బాలు

పల్లవి::

తొలిసారి నిన్నూ..చూశాను నేను
నీ ప్రేమ పాశం..లాగింది నన్నూ
లాగింది నన్నూ..లాగింది నన్నూ
ఏ తారలోనూ..నీ తీరూ లేదు
ఏ పువ్వులోనూ..నీ నవ్వు లేదు..లేదు..లేదు

చరణం::1

నీ బుగ్గమీద మొగ్గ వేయు నిగ్గు చూసి
తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు
నీ బుగ్గమీద మొగ్గ వేయు నిగ్గు చూసి
తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు
ఏ తారలోనూ నీ తీరూ లేదు
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..లేదు..లేదు

తొలిసారి నిన్నూ..చూశాను నేను
నీ ప్రేమ పాశం..లాగింది నన్నూ..లాగింది నన్నూ

చరణం::2

నీ చక్కనైన మేనులోని సాయ జూసీ
చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయె నేడు
నీ చక్కనైన మేనులోని సాయ జూసీ
చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయె నేడు
ఏ తారలోనూ..నీ తీరూ లేదు
ఏ పువ్వులోనూ..నీ నవ్వు లేదు..లేదు..లేదు

చరణం::3

ఏ సుందరిలో కానరాని సోయగాలు
ఏ వయ్యారిలో లేని అందచందాలలూ
ఏ సుందరిలో కానరాని సోయగాలు
ఏ వయ్యారిలో లేని అందచందాలూ
తనలోన కలిగి..మనసార వలచే
చినదానికోసం వెతికేను నేను..నేను..నేను

Wednesday, December 26, 2012

కల్యాణి--1979


సంగీతం::రమేశ్ నాయుడు 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, P.సుశీల 

పల్లవి:: 

ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం 
మోసమైనా దోషమైనా..చేసింది ఎవరికోసం..నేను చేసింది ఎవరికోసం

ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం 
ఎవరిదైనా..ఎందుకైనా..చేసింది పచ్చిమోసం..నీవు చేసింది పచ్చిమోసం

చరణం::1 

నేటిచీకటి ముసిరిందీ..రేపటి ఉదయం కోసం
నేటి మంచులో దాగుందీ..రేపటి చైత్రమాసం
నేటి బ్రతుకే చీకటైతే..రేపటి ఉదయం దేనికనీ
నేడు మనసే రాయైపోతే..రేపటి చైత్రం ఎవరికనీ
రేపటి చైత్రం ఎవరికనీ..

ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం
ఎవరిదైనా..ఎందుకైనా..చేసింది పచ్చిమోసం..నీవు చేసింది పచ్చిమోసం

చరణం::2

నేడు మధనం జరిగేదీ..రేపటి మధురిమ కోసం
నేడు కలతలు మోసేదీ..రేపటికలయిక కోసం
ఉన్నదంతా విషమైపోతే..లేని మధురిమ దేనికనీ
కలతలతోనే కథముగిసిపోతే..కాలికలయిక ఎవరికనీ
కాలికలయిక ఎవరికనీ

ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం 
మోసమైనా దోషమైనా..చేసింది ఎవరికోసం..నేను చేసింది ఎవరికోసం

చరణం::3

నిప్పునద్దిన బంగారానికి ఎప్పుడూ విలువుంటుందీ..
కాగింది బంగారం కాదని..కాలమే రుజువు చేస్తుందీ
నీడకు బెదరని మనిషికే..నిజమును చాటే బలముంటుంది
నీడ చీకటీ..నిజం వెలుతురూ..నీవు బ్రాంతివీ..నేను కాంతినీ
నీకు నాకు ఎన్నడు కలవని..అగాధముంది అంతరముందీ
అగాధముంది అంతరముందీ.. 

కల్యాణి--1979


సంగీతం::రమేశ్ నాయుడు 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, P.సుశీల 

పల్లవి:: 

నీ ప మ పా..ఆ..ఆ..ఆ..ఆ 
నీ ప మ ప గపాగగ రీసనీరిసా 

నీని రిరి మారిస..పదనీరినీపనీ పమప గపాగరీసనీరిసా 

నీ పలుకే..ఏ..ఏ..ఏ..ఏ.. 
నీ పలుకే..త్యాగరాయ కీర్తన..ఆ..ఆ..ఆ 
నీ నడకే..క్షేత్రయ పద నర్తనా..ఆ... 
నీ పలుకే..త్యాగరాయ కీర్తనా..ఆ 

సరిమా..రిమగా..ఆ.ఆ..సానిదపమ 
నీ పమపా..మపదా..సని గమ నిసనీ..ఈ..ఈ 

నిసరిమప మాపదాస రిస నిదపా మరిసా 
నిస రిమ పద 

నీ పిలుపే..ఏ..ఏ...ఏ..ఏ.. 
నీ పిలుపే..జయదేవుని దీపికా..ఆ..ఆ 
నీ వలపే..కాళిదాసు కవితా..ఆ..ఆ..లహరికా..ఆ 
నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ.. 

నీ పలుకే..ఏ..ఏ..త్యాగరాయ కీర్తన.. 

చరణం::1 

నీవు నన్ను కలుసుకున్న క్షణంలో
తుంగభద్ర కృష్ణతో కలిసిందీ 

నీవు నన్ను కలుసుకున్న క్షణంలో..ఓ..ఓ..ఓ 
తుంగభద్ర కృష్ణతో కలిసిందీ 

నేనూ..ఊ..ఊ..నీ కౌగిలిలో కరిగిన సుముహుర్తములో 
నేనూ..ఊ..ఊ..నేనూ..నీ కౌగిలిలో కరిగిన సుముహుర్తములో..ఓ..ఓ..ఓ 
ఆ కృష్ణవేణి..సాగారన వెలిసిందీ 
ఆ కృష్ణవేణి..సాగారన వెలిసిందీ 

అలనాటి నీ ఒంపుసొంపులన్నీ..హంపిలో శిల్పాలై..అజంతా చిత్రాలై.. 
భారతభారతికే..ఏ..ఏ..హారతి పడుతున్నవీ 
సుమ హారతి పడుతున్నవీ.. 

సరిమా..ఆ..రిమదా..ఆ.. 
సరిమా..ఆ..రిమదా..ఆ..సానిదపమ 
నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ.. 
నీ పలుకే త్యాగరాయ కీర్తనా 

చరణం::2

నీతోనే నడిచిన ఏడడుగులే..ఏ...ఏ..ఏ 
సంగీతంలో పలికే సప్తస్వరాలు..ఊ..ఊ..ఊ 

స రి గ మ ప ద నీ... 
నీలో..ఓ..ఓ..తొలి కలియకలో..ఓ..ఓ..విరిసిన రస భావాలే.. 
నీలో..తొలి కలయికలో..ఓ..ఓ..విరిసిన రసభావాలే..ఏ..ఏ..ఏ..ఏ 
సాహిత్యంలో సాటిలేని కావ్యాలు..ఊ.. 
సాహిత్యంలో..ఓ..సా..టిలేని కావ్యాలు..ఊ.. 

ఈనాటి నీ వన్నెచిన్నెలన్నీ..మరులలో మల్లియలై.. 
మరునికే..పల్లియలై..జీవన బృందావనిలో..ఆమనులవుతున్నవి 
సౌదామనులవుతున్నవి..ఈ..ఈ 

సరిమా..ఆ..రిమదా..ఆ.. 
సరిమా..ఆ..రిమదా..ఆ..సానిదపమ 
నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ.. 
నీ పలుకే త్యాగరాయ కీర్తనా 

స ద పా.. 
ద ప గా.. 
స ద పా.. 
ద ప గా.. 
దపగరిసరిగపదా 
ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ...ఆఅ..

Tuesday, December 25, 2012

కళ్యాణి--1979


సంగీతం::రమేశ్ నాయుడు
రచన::దాసం గోపాలకృష్ణ
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి::

నవరాగానికీ..నడకలు వచ్చెనూ
మధుమాసానికీ..మాటలు వచ్చెనూ
నడకలు కలిపీ..నడవాలీ
మాటలూ కలిపీ..మసలాలీ

నవరాగానికీ..నడకలు వచ్చెనూ
మధుమాసానికీ..మాటలు వచ్చెనూ

చరణం::1

సరసాల ఆటలో..సరాగాల తోటలో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సరసాల పాటలో..సరాగాల తోటలో
అనురాగానికీ..అంటులు కట్టాలీ
అనురాగానికీ..అంటులు కట్టాలీ

మొలకెత్తిన ఆశకూ..చిగురించిన ఊసుకూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మొలకెత్తిన ఆశకూ..చిగురించిన ఊసుకూ
తొలకరి నాటులు..నాటాలీ
తొలకరి నాటులు..నాటాలీ

నవరాగానికీ..నడకలు వచ్చెనూ
మధుమాసానికీ..మాటలు వచ్చెనూ

చరణం::2

కులుకులకు..కుదురులు కట్టీ
పరువాలకు..పందిరి వేయాలీ
పున్నమి నాటికి..పువ్వులు పూయించాలీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కులుకులకు కుదురులు కట్టీ
పరువాలకు పందిరి వేయాలీ
పున్నమి నాటికి పువ్వులు పూయించాలీ
పువ్వులు పూయించాలీ

పూట పూటకు తోటకు వెళ్ళి
పువ్వుల మాలలు కట్టాలీ
అమర కళలకూ అర్పణ చేయాలీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పూట పూటకు తోటకు వెళ్ళి
పువ్వుల మాలలు కట్టాలీ
అమర కళలకూ అర్పణ చేయాలీ
అర్పణ చేయాలీ


నవరాగానికీ నడకలు..వచ్చెనూ
మధుమాసానికీ మాటలు..వచ్చెనూ
నడకలు కలిపీ నడవాలీ
మాటలూ కలిపీ మసలాలీ
నవరాగానికీ నడకలు..వచ్చెనూ
మధుమాసానికీ మాటలు..వచ్చెనూ

కీలుగుఱ్ఱం--1949









సంగీతం::ఘంటసాల
రచన::తాపీ ధర్మారావు 
గానం::ఘంటసాల , శ్రీదేవి

పల్లవి::

ఎంత కృపామతివే..భవాని..ఎంత దయానిధివే
ఎంత కృపామతివే..భవాని..ఎంత దయానిధివే

చరణం::1

కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా
కన్యకు గూర్చితి కళ్యాణ మహా

ఎంత కృపామతివే..భవాని..ఎంత దయానిధివే

చరణం::2

ఏదో పనిపై ఏగే వానికి..ఈ ఈ ఈ ఈ ఈ ఈ  
ఏదో పనిపై ఏగే వానికి..ఈవిద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివా..హహ..విద్యావతి..

ఎంత కృపామతివే..భవాని..ఎంత దయానిధివే

చరణం::3

నూతనముగై లేత మారుతము
నూతనముగై ఈ లేత మారుతము 
గీతా గానము చేయుగదా
హృదయ తంత్రులను కదలించుటచే
హృదయ తంత్రులను కదలించుటచే
వదలిన గానమో..ఏమో
వదలిన గానమో..ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే సామ గానమే ఏమో
ప్రణయ దేవతలు పాడుచు నుండే 
సామ గానమే ఏమో..సామ గానమే ఏమో

కుంకుమ తిలకం--1983





కుంకుమ తిలకం--1983
సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి 
గానం::S.P.బాలు,P.సుశీల 

పల్లవి::

ఆలనగా పాలనగా..అలసిన గుండెకు ఆలంబనగా
లాలించు నీదానిగా..స్వామీ..పాలించు నీ దాసిగా 

ఆలనగా పాలనగా..అలసిన గుండెకు ఆలంబనగా
లాలించు నీదానిగా..స్వామీ..పాలించు నీ సాటిగా

చరణం::1

పున్నమి కోరే రేయిని నేను..పూజకు వేచిన పువ్వును నేను
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
పున్నమి కోరే రేయిని నేను..పూజకు వేచిన పువ్వును నేను

నిన్నటి దాకా..నాలో నేను..ఈ నిమిషానా..నీతో నేను
లాలించు నీ దానిగా..స్వామీ పాలించు నీ దాసిగా

చరణం::2

నీ హృదయం ఒక సాగరమైతే..బిందువునైనా చాలును నేను
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ హృదయం ఒక సాగరమైతే..బిందువునైనా చాలును నేను
నీ ఒడిలో పసిపాపను కానా..నీ పాదాల రేణువు కానా
లాలించు నీ దానిగా.. స్వామీ..పాలించు నీ దాసిగా

ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా
ఆహాహ హా ఆహహా ఆ ఆ ఆ ఆ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్   

Friday, December 21, 2012

అడవి దొంగ--1985



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందర రామమూర్తి  
గానం::S.P.బాలు, P.సుశీల
తారాగణం::చిరంజీవి,రాధ,శారద 

పల్లవి:
లలలలల్లాలలాలలల..
లలలలలలలలాలలల..
ఆ..ఆ..ఆ..ఆ..
వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి..వయసే అంకితాలు
మహరాజులా మనసేలుకో..మహరాణిలా మనువాడుకో

చరణం::1

లలలలల్లాలలాలలల
లలల..లలల..లలల
వచ్చే వసంతకాలం..విచ్చే సుమాలగంధం
నీకై తపించి..నిన్నే జపించే అందం
కవ్వించు తేనెదీపం..కౌగిళ్ళ ప్రేమశీతం
నేనై చలించి..నిన్నే వరించే బంధం
కొండ అరటిపండు ముద్దంట..నా కొండమల్లి నువ్వంట
రసాల నవరసాల..యమమసాల వేడిలో
లవ్ బాయ్ లా లాలించవా..కౌ బాయ్ లా కవ్వించనా

వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి..వయసే అంకితాలు
లలలలల్లాలాలాలల్లాలా

చరణం::2

లలలలల్లాలలాలలల
లల..లల..లల
వాటేయ్యకుంటే పాపం..వయ్యరమెంత శాపం
పూచేటి సోకు..దాచేసుకోకు..నేరం
వలపన్నది ఎంత వేగం..వలవేసి పట్టే మొహం
తీరేది కాదు నురేళ్ల తీపి దాహం

నీ రూపు నాకు చుక్కంట..నా లేత బుగ్గకిమ్మంట
పెట్టించు లగ్గం..ఎట్టించు..ముద్దు పుట్టించే వేళలో
జాంపండుల దొరికవులే..జేమ్స్ బండులా కలిశావులే

వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి..వయసే అంకితాలు

చరణం::3

లలలలలలలలలలలలలలలల
లల్లాల..లల్లాల..లలలల
లల్లాల..లల్లాల..లలలల
కౌగిళ్ళు నీకు పంచి..కసి ఈడు కాస్త పెంచే
కవ్వింతలోనే ఒల్లంతా దోచిపోరా
మల్లెల్లో ఇల్లు కట్టో..మసకల్లో కన్ను కొట్టీ
దీపల వేళ తాపలు తీర్చిపోవే
చిలకంటిదాన్ని నేనంట..అలకల్లో ఉంది సోకంతా
తందాన తన తందాన..జత తాళలే సాగనీ
హీరోలకే హీరోవిరా..హీమాన్ లా ప్రేమించనా

వీరవిక్రమ ధీరదిగ్గజ..నీకే స్వాగతాలు
వాలుచుపుల వన్నెలాడికి..వయసే అంకితాలు
మహరాజులా మనసేలుకో..మహరాణిలా మనువాడుకో

Tuesday, December 18, 2012

నమ్మినబంటు--1960









సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కోసరాజు
గానం::ఘంటసాల

సాకీ::

కన్నుమిన్ను కానరాని కాలితెరపు గిత్తరా
పట్టుకుంటే మాసిపోయే పాలపళ్ల గిత్తరా
అరెరెరెరెరెరే..ఒంటిమీద చేయి వేస్తే
ఉలికిపడే గిత్తరా..ఆఆఆఆఆఆఆఆ

పల్లవి::

హాయ్..పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా

పొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా

చరణం::1

ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
ఎనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది
ఓహో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్

విసురుకుంటూ కసురుకుంటూ
ఇటూ అటూ అటూ ఇటూ డిర్‌‌‌రరర్‌ర్
కుంకిళ్లు పెడుతుంది కుప్పిగంతులేస్తుంది

పొగరుమోతు..హ్హహ్హా..పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా

చరణం::2

అదిలిస్తే అంకె వేయు బెదురుమోతు గిత్తరాఆఆఅ 
అరెరెరెరెరే కదిలిస్తే గంతులేసి కాండ్రుమనే గిత్తరాఆఆ 
దీని నడుముతీరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తోంది
నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తోంది
అహ..
నడుముతీరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తోంది
నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తోంది
వన్నెచిన్నెల రాణి ఇవ్వాళ మంచిబోణీ డిర్ర్ర్ర్ర్ర్ 
వన్నెచిన్నెల రాణి ఇవ్వాళ మంచిబోణీ
నిన్నొదిలిపెడితే ఒట్టు ఈ వగలు కట్టిపెట్టు

పొగరుమోతు..హ్హహ్హా..పొగరుమోతు..పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పొగరుమోతు...పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా
పొగరుమోతు..పోట్లగిత్తరా
ఓరయ్య..దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య..దీని రూపే బంగారమౌనురా..ఓ..హో...  

Sunday, December 16, 2012

దొరబాబు--1974




సంగీత::J.V.రాఘవులు
రచన::ఆత్రేయ
గానం::V.రామకృష్ణ ,P.సుశీల
తారాగణం: అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,గిరిబాబు.

పల్లవి::

ఆహా..వద్దు వద్దు వద్దు ముద్దు యివ్వొద్దూ
అది తేనెకన్న తియ్యనని చెప్పొద్దు..నాకు చెప్పొద్దూ
ఆహహా అహా..వద్దు వద్దు వద్దు ముద్దు యివ్వొద్దూ
అది తేనెకన్న తియ్యనని చెప్పొద్దు..నాకు చెప్పొద్దూ

వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దూ
ఆ తీపి ఎంతో తెలిసికోక ఆపొద్దు..అడ్డు చెప్పొద్దూ

చరణం::1

నా పెదవిపై పేరువుంది..చదువుకో
నా హృదయమందు రూపముంది చూసుకో
హ్హా..నా పెదవిపై పేరువుంది..చదువుకో
నా హృదయమందు రూపముంది చూసుకో
ఆ పేరు నాదని..ఆహ్హా..రూపు నాదని..ఒహో
పేరు నాదని...రూపు నాదని
నీ చెంప ఎరుపు చెప్పకే చెప్పింది..ఒప్పుకోమంది  
ఒహో..వద్దు వద్దు వద్దు ముద్దు యివ్వొద్దూ
అది తేనెకన్న తియ్యనని చెప్పొద్దు..నాకు చెప్పొద్దూ

చరణం::2

గుప్పెడంత గుండెలోన గుట్టుందీ
విప్పలేని చిక్కుముడే వేసిందీ
లలలలాహా..లలలలాహా
లలలలాహా..లలలలాహా
ఓ హో హో హో..
గుప్పెడంత గుండెలోన గుట్టుందీ
విప్పలేని చిక్కుముడే వేసిందీ
చిక్కుముడిని పంటనొక్కి విప్పుకోవచ్చు
గుట్టులన్ని కళ్ళతోటి చెప్పుకోవచ్చు
హా హా హా హా..హోయ్
వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దూ
ఆ తీపి ఎంతో తెలిసికోక ఆపొద్దు..అడ్డు చెప్పొద్దూ

చరణం:3

పాట వింటు పరవశించి పోవద్దూ
ఆట కట్టిపోవునని అనుకోవద్దూ
పాట వింటు పరవశించి పోవద్దూ
ఆట కట్టిపోవునని అనుకోవద్దూ
పాట పాడినా..అహా..పరవశించినా..ఓ
పాట పాడినా..పరవశించినా
పగబట్టిన...నాగుబాము
పడగ దించునా..కాటు మానునా..అహాహా
వద్దు వద్దు వద్దు ముద్దు యివ్వొద్దూ
అది తేనెకన్న తియ్యనని చెప్పొద్దు..నాకు చెప్పొద్దూ
వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దూ
ఆ తీపి ఎంతో తెలిసికోక ఆపొద్దు..అడ్డు చెప్పొద్దూ

Saturday, December 15, 2012

దొరబాబు--1974



సంగీతం::J.V.రాఘవులు 
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::P.సుశీల,ఘంటసాల  
తారాగణం::అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,రాజబాబు,గిరిబాబు. 

పల్లవి::

రారా..ఆ..పడకింటికీ..హో
నిదుర రాదూ..ఊఊ..నా కంటికీ..హ్హా
తగిన మందివ్వరా..రగిలే నా ఒంటికీ
రారా..ఆ..పడకింటికీ
ఎందుకు పడకింటికి...పోదాములే పొదరింటికీ
తగిన మందుందిలే...రగిలే నీ ఒంటికీ.ఈఈ      
రారా..పడకింటికీ..నిదుర రాదూ నా కంటికీ 

చరణం::1

వెచ్చగా చలివేసింది..మత్తుగా మసకేసిందీ
కొత్తమోజు రేగింది..అది పిచ్చిగా నినుకోరిందీ 
మోజే ప్రేమయితే..ఆ ప్రేమే పిచ్చయితే
మోజే ప్రేమయితే..ఆ ప్రేమే పిచ్చయితే
ఆ పిచ్చి ముదిరితే..నీ మనసు చెదిరితే
ఆహా..అందుకే..రారా..పడకింటికీ..ఈఈ
నిదుర రాదూ..ఊఊ..నా కంటికీ 

చరణం::2

ఆడదాని వలపులు..ఏటిలోని తరగలు
ఏ గాలికి అవి చెదురునో..ఏ గట్టు తాకీ విరుగునో
నీలాంటి దొరబాబే..నా జంటగా వుంటే
నీలాంటి దొరబాబే..నా జంటగా వుంటే
నా మనసు చెదిరిపోదూ..యీ వలపు విరిగిపోదూ..ఆ..అయితే
ఎందుకు పడకింటికీ...పోదాములే పొదరింటికీ  
తగిన మందుందిలే...రగిలే నీ ఒంటికీ.ఈఈ      
రారా..పడకింటికీ..నిదుర రాదూ నా కంటికీ 
తగిన మందివ్వరా..ఆ..రగిలే నా ఒంటికీ..ఈ
రారా..ఆ..మా ఇంటికీ..నిదుర రాదూ నా కంటికీ
ఆహా..ఆహా..ఆహా..ఆహా..

దొరబాబు--1974



సంగీతం::J.V.రాఘవులు 
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::P.సుశీల,ఘంటసాల 
తారాగణం::అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,రాజబాబు,గిరిబాబు. 

పల్లవి::

రారా..ఆ..మా ఇంటికీ..హో
నిదుర రాదూ..ఊఊ..నా కంటికీ..హ్హా
తగిన మత్తివ్వరా..రగిలే నా మోజుకీ..ఈ
రారా..ఆ..మా ఇంటికీ
ఎందుకు మీ ఇంటికి...పోదాములే పొదరింటికీ
తగిన మత్తుందిలే..ఏ..రగిలే నీ మోజుకీ..ఈఈ      
రారా..ఆ..మా ఇంటికీ..హ్హ..నిదుర రాదూ నా కంటికీ 

చరణం::1

వెచ్చగా చలివేసింది..మత్తుగా మసకేసిందీ
కొత్తమోజు రేగింది..అది పిచ్చిగా నినుకోరిందీ 
మోజే ప్రేమయితే..ఆ ప్రేమే పిచ్చయితే
మోజే ప్రేమయితే..ఆ ప్రేమే పిచ్చయితే
ఆ పిచ్చి ముదిరితే..ఏఏ..నీ మనసు చెదిరితే..ఏఏ
ఆహా..అందుకే..రారా..మాఇంటికీ..నిదుర రాదూ నా కంటికీ 

చరణం::2

ఆడదాని వలపులు..ఏటిలోని తరగలు
ఏ గాలికి అవి చెదురునో..ఏ గట్టు తాకీ విరుగునో
నీలాంటి దొరబాబే..నా జంటగా వుంటే
నీలాంటి దొరబాబే..నా జంటగా వుంటే
నా మనసు చెదిరిపోదూ..యీ వలపు విరిగిపోదూ..ఆ..అయితే
ఎందుకు పొదరింటికీ...పోదాములే  మీఇంటికి  
తగిన మత్తుందిలే..ఏ..రగిలే నీ మోజుకీ..ఈఈ      
రారా..మా ఇంటికీ..నిదుర రాదూ..నా కంటికీ..ఈ
ఆహా..ఆహా..ఆహా..ఆహా..

Friday, December 14, 2012

ప్రేమాభిషేకం--1981







సంగీతం::K.చక్రవర్తి
రచన::దాసరి నారాయణరావ్ 
గానం::S.P.బాలు , P. సుశీల

పల్లవి::

వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం పాదాభివందనం 
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం పాదాభివందనం
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం

చరణం::1

కన్నులు పొడిచిన చీకటిలో..ఆరే దీపపు వెలుగుల్లో
తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో
వస్తానని నేను వస్తానని..వస్తానని నేను వస్తానని
తలపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి 
తలపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి
ఎదురు చూసిన సారిక అభిసారిక..సారీ.. 

వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం

చరణం::2

జీవితమన్నది మూడునాళ్ళని..యవ్వనమన్నది తిరిగిరాదని
ప్రేమన్నది ఒక నటనమనీ..నీకంటూ ఎవరున్నారని
ఉన్నానని నేను ఉన్నానని..ప్రేమపురానికి సెలవిచ్చి
స్వర్గపురానికి దారిచ్చి 
ప్రేమపురానికి సెలవిచ్చి..స్వర్గపురానికి దారిచ్చి 
సుఖము పోసిన మేనక అభినయ మేనక..సారీ.. 

వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం

Thursday, December 13, 2012

విశాలి--1973



సంగీతం::పుహళేంది
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,శ్రీధర్,నాగయ్య,ధూళిపాళ,K.V. చలం, శారద,రమాప్రభ,విజయలలిత

పల్లవి::

నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి...నే కన్నెనైనారా
నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి...నే కన్నెనైనారా

మొన్నదాకా..మొండిదాన్నిరా..ఆఆ
నీ మోజులోన బేలనైనారా..అ అ అ ఆ
నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి...నే కన్నెనైనారా

చరణం::1

చల్లగాలికిలా..జలదరించి ఎరుగను
మల్లెపూలకింత..మత్తుందను ఎరుగను
పైటకొంగు తొలగినా..పక్క నెవరు నడిచినా
పైటకొంగు తొలగినా..పక్క నెవరు నడిచినా
సిగ్గుపడి అటూ ఇటూ..చూచి ఎరుగనూ  
నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి..నే కన్నెనైనారా

చరణం::2

వానైనా ఎండైన..వెన్నెలైన చీకటైన
నిన్న దాక..లెక్కలేదురా
నేడు వానంటె దిగులు..వెన్నెలంటె సెగలు
చీకటైతె గుబులు...గుబులురా
నిదుర రాదురా..ఆఆ..పొద్దుపోదురా..ఆ
ఈ అవస్త మొన్నదాక..నేను ఎరుగను 

నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్  
నీ కన్నుబడి...నే కన్నెనైనారా

చరణం::3

కళ్ళు తెరుచుకునే..కలవరించి ఎరుగను
నిన్న కన్న కలలు..నెమరువేసి ఎరుగను
కోడె వయసు తరిమినా..కొసరి ముద్దులడిగినా..ఆ
మూడు ముళ్ళు పడేవరకు..నీకు దొరకను  

నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్  
నీ కన్నుబడి..నే కన్నెనైనారా

మొన్నదాకా మొండిదాన్నిరా..ఆఆ
నీ మోజులోన బేలనైనారా..అ అ అ ఆ
నిన్నదాకా చిన్నదాన్నిరా..హోయ్
నీ కన్నుబడి...నే కన్నెనైనారా

Wednesday, December 12, 2012

విప్రనారాయణ--1954::కల్యాణి::రాగం




సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::సముద్రాల సీనియర్
గానం::భానుమతి
రాగం:::కల్యాణి 

పల్లవి::

సావిరహే తవ దీనా రాధ..సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ..సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా..

చరణములు::

నిందతి చందన మిందు కిరణమను విందతి ఖేదమదీరం
వ్యాల నిలయమిలనేన గరళమివ
వ్యాల నిలయమిలనేన గరళమివ కలయతి మలయ సమీరం
సావిరహే తవ దీనా

కుసుమ విషిఖసర తల్పం అనల్ప విలాస కళా కమనీయం
వ్రతమివ తవ పరి రంభ సుఖాయ
వ్రతమివ తవ పరి రంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం
సావిరహే తవ దీనా

ప్రతిపదం ఇదమపి నిగదతి మాధవ
నిగదతి మాధవ ..నిగదతి మాధవ
తవ చరణే పతితాహం...
త్వయి విముఖే మయి సపది సుధానిధి
రపి తనుతే..ఏఏఏఏ..తనుదాహం..
సావిరహే తవ దీనా రాధ సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా కృష్ణ తావవిరహే తవ దీనా
కృష్ణ..ఆ ఆ ఆ ఆ..దీనా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ

విశాలి--1973



సంగీతం::పుహళేంది
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,V.రామకృష్ణ
తారాగణం::కృష్ణంరాజు,శ్రీధర్,నాగయ్య,ధూళిపాళ,K.V. చలం, శారద,రమాప్రభ,విజయలలిత

పల్లవి::

ఆ..అహ..హా
చూడకు..అలా చూడకు..కళ్ళల్లోకి చూడకు
చూసి నన్ను..పిచ్చిదాన్ని చేయకు..అహ..హా
చూసి నను..పిచ్చిదాన్ని చేయకు

ఆ..అహ..హా
చూడకు..అలా చూడకు..కళ్ళల్లోకి చూడకు
చూసి నన్ను..పిచ్చివాణ్ణి చేయకు..అహ..హా
చూసి నన్ను పిచ్చివాణ్ణి చేయకు 


చరణం::1

చూపులకు ఓపలేని..చిగురాకు సొగసు నాది..హ..హా
సొగసంతా ఒకేసారి..జుర్రుకునే వయసు నీది
పువ్వల్లే నవ్వులు రువ్వీ..బులిపించే బిగువే నీదీ
కవ్విస్తే ఊరుకోని..కచ్చిపోతు మనసే నాది 

ఆఆ..ఆ ఆ ఆ ఆ..హ్హా..ఆ ఆ 
చూడకు..అలా చూడకు..కళ్ళల్లోకి చూడకు
చూసి నన్ను..పిచ్చిదాన్ని చేయకు
చూసి నన్ను..పిచ్చివాణ్ణి చేయకు
అహ..హా..చూసి నన్ను పిచ్చిదాన్ని చేయకు

చరణం::2

ముద్దులన్నీ దాచుకున్నా..మోవి నీకై పులకించిందీ..అహ..హా
హద్దులన్నీ చెరిపివేసీ.. ఆడతనం చెలరేగిందీ
ఇద్దరికీ ఈ లోకం..సద్దుమనిగిపోయిందీ
పొద్దున్నే బద్దకంగా..ఒళ్ళు విరుచుకుంటుందీ    
ఆఆ..ఆ ఆ ఆ ఆ..హ్హా..ఆ ఆ 
చూడకు..అలా చూడకు..కళ్ళల్లోకి చూడకు
హా..చూసి నన్ను..పిచ్చిదాన్ని చేయకు
అహ..హా..చూసి నన్ను పిచ్చివాణ్ణి చేయకు

అఆ..హ్హా..లలలల్లలలాల..లలలల్లలలాల
ఆఆఅ..ఆహ్హా..ఆ..ఆ ఆహ్హా..హా ఆఆ హా 

Tuesday, December 11, 2012

వింతకథ--1973




సంగీతం::పుహళేంది 
రచన::ఆరుద్ర   
గానం::S.జానకి   
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి

పల్లవి::

ఆఆఆ ఆ ఆహ్హా ఆహాహా హ్హా  
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా
తొలిరేయి...మరలా రాదమ్మా
తొలిరేయి...మరలా రాదమ్మా
ఈ తొలిహాయి...మరచేది కాదమ్మా
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా

చరణం::1

పాల కడవలో...ఆలూమగలు
గాలించి తీయాలి..నగలు గారాల నగలు
ఆఆఆ..పాల కడవలో...ఆలూమగలు
గాలించి తీయాలి...నగలు  
బువ్వాల బంతిలో..నవ్వులే కలబోసి
భుజియించగలగాలి..వగలు మురిపాల వగలు
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా

చరణం::2

లాలలలలలా లలలలలా
తాననం తాననననం
తానననం..మ్మ్..

గంథాలు పూసే...మునివేళ్ళు
మగ గుండె తొక్కింది...పరవళ్ళు
గంథాలు పూసే...మునివేళ్ళు..హ్హా
మగ గుండె తొక్కింది...పరవళ్ళు
పన్నీటి జల్లుతో...పెనుకాక తగ్గించి
పైటచాటున నవ్వె..పలుమార్లు పడతి పలుమార్లు
పెళ్ళి నూరేళ్ళ...పంట ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా

చరణం::3
తానం తనంత తనంత తననత తొం తననం
తానననం తాననననం తానననం తత్తొననం తనం
హ్హా హా హ్హా హా..

పంతాలతో ఇపుడు...బంతులాడేరు
ఏకాంతమున ఎంత ఆడేరో..ఏ సరసమాడేరో
ఆఆఆ..పంతాలతో ఇపుడు...బంతులాడేరు
ఏకాంతమున...ఎంత ఆడేరో
ఒకరికి ఇంకోకరు...ఒక్కింత తగ్గరు
ఈ ఏడు వీళ్ళు ఇద్దరు మీదటికి..కావాలి ముగ్గురు
పెళ్ళి నూరేళ్ళ పంట...ఓయమ్మా
వీళ్ళు అందాల...జంట ఔనమ్మా
తొలిరేయి మరలా...రాదమ్మా
ఈ తొలిహాయి...మరచేది కాదమ్మా
పెళ్ళి నూరేళ్ళ పంట...ఓయమ్మా
వీళ్ళు అందాల జంట...ఔనమ్మా

వింతకథ--1973



సంగీతం::పుహళేంది 
రచన::D.C.నారాయణరెడ్డి   
గానం::S.P.బాలు   
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి

పల్లవి::

ఎదురు చూచిన కాముని పున్నమి..ఆనాడు కాదు ఈనాడే
ఎదురు చూచిన కాముని పున్నమి..ఆనాడు కాదు ఈనాడే
ఎదలోని పొదలోన ఎదలోని పొదలోన..తుమ్మెదలు ఝుమ్మని చెలరేగే              
ఎదురు చూచిన కాముని...పున్నమి
ఆనాడు కాదు ఈనాడే..ఆనాడు కాదు ఈనాడే

చరణం::1

ఊహల తరగల నురగలపైన..ఊర్వశియే ఉదయించెనులే
ఊహల తరగల నురగలపైన..ఊర్వశియే ఉదయించెనులే
లలిత భావ కర్పూరవాటిలో..లకుమ అందెలే రవళించెనులే
లలిత భావ కర్పూరవాటిలో..లకుమ అందెలే రవళించెనులే
ఎన్నడు చూడని వెన్నెల కన్నెలు..కిన్నెరసానులై కులికెనులే
ఎన్నడు చూడని వెన్నెల కన్నెలు..కిన్నెరసానులై కులికెనులే
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హూ..హ్హా హ్హా హ్హా హా
ఎన్నో జన్మల మూగ రాగాలు..ఎంకి పాటలై పలికెనులే
ఎన్నో జన్మల మూగ రాగాలు..ఎంకి పాటలై పలికెనులే          
ఎదురు చూచిన కాముని...పున్నమి
ఆనాడు కాదు ఈనాడే..ఆనాడు కాదు ఈనాడే
  
చరణం::2
  
ఆ మేని ఒంపులలోన..ఒక మెలికెనై పోదునా
ఆ మేని ఒంపులలోన..ఒక మెలికెనై పోదునా
ఆ మెత్తని గుండెపైన..ముత్యాల దండనై పోదునా
ముత్యాల...దండనై పోదునా
ఆ ముద్దు మోముపైన..నేనొక ముచ్చటనై పోదునా
ఆ కంటి పాపలోనా...నేనొక పాపనై పోదునా  
నేనొక పాపనై పోదునా...నేనొక పాపనై పోదునా

Monday, December 10, 2012

విచిత్ర వివాహం--1973::తిలంగ్::రాగం




















సంగీతం::సత్యం
రచన::దాశరథి 
గానం::P.భానుమతి
తారాగణం::P.భానుమతి,గుమ్మడి,చంద్రమోహన్,పద్మనాభం,రమాప్రభ,ప్రమీల,రామకృష్ణ,రాజబాబు.
తిలంగ్::రాగం

పల్లవి::

నాలో నిన్నే...చూడనా
నాలో నిన్నే...చూడనా
నాలో నిన్నే...చూడనా 
విరిసిన పున్నమి వెన్నెలలోన
పరవశించి...నే పాడనా
నాలో నిన్నే...చూడనా

చరణం::1

ఎవ్వరులేని ఏకాంతములో
ఎన్నడులేని ఆనందముతో
ఎవ్వరులేని ఏకాంతములో
ఎన్నడులేని ఆనందముతో
మమతలు నాలో పొంగే వేళా
నా మది నిన్నే కోరేవేళా
పరవశించి నే పాడనా    
నాలో నిన్నే చూడనా
విరిసిన పున్నమి వెన్నెలలోన
పరవశించి నే పాడనా
నాలో నిన్నే చూడనా

చరణం::2

నీలో సగమై, నీవే జగమై
నిండుగ నీతో జీవించాలని
నీలో సగమై, నీవే జగమై
నిండుగ నీతో జీవించాలని
ఆశలు నాలో ఆడే వేళ
అనురాగడోల ఊగే వేళ
పరవశించి నే పాడనా       
నాలో నిన్నే చూడనా
విరిసిన పున్నమి వెన్నెలలోన
పరవశించి నే పాడనా
నాలో నిన్నే చూడనా

Sunday, December 09, 2012

బంగారు లక్ష్మి--1980


సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య - ఆత్రేయ
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::R.Tyagarajan
నటీ,నటులు::చంద్రమోహన్,మోహన్,గిరిబాబు,ప్రసాద్‌బాబు,విఠల్‌ప్రసాద్,లక్ష్మీకాంత్,పండరీబాయ్,సంగీత,జయసుధ.

పల్లవి::

అమలాలో..ఓఓఓ..లాలమ్మలాలో..ఓఓఓ
అమలాలో..ఓఓఓ..లాలమ్మలాలో..ఓఓఓ
ముద్దబంతి పూచింది..పల్లెలోనా 
ముద్దులెన్నో దాచింది..కళ్ళలోన
ముద్దబంతి పూచింది..పల్లెలోనా 
ముద్దులెన్నో దాచింది..కళ్ళలోన
ఒక్కటే పాటుంది..గుండెలోన
అది ఒక్కరికే చందుతుంది..జన్మలోన

అమలాలో..ఓఓఓ..లాలమ్మలాలో..ఓఓఓ

చరణం::1

నీ గుండెకే నేను..చప్పుడైతిని
నీ గూటిలో నేను..గువ్వనైతిని
నీ గుండెకే నేను..చప్పుడైతిని
నీ గూటిలో నేను..గువ్వనైతిని
నీ తోడు లేకుండ..ఎక్కడుంటిని

అరె..హా..ఆఆఅ
అడుగున అడుగే..వేస్తివి
అరె..హా..ఆఆఆ
అడగక మనసే..ఇస్తివి
నువ్వే నచ్చీ..నిన్నే మెచ్చీ
నువ్వే నచ్చీ..నిన్నే మెచ్చీ
పల్లెదాన్ని..పిల్లదాన్ని
మల్లెలాంటి..మంచిదాన్ని
చూసుకొంటి చేసుకొంటి..ఇల్లాలిని..ఈఈఈఈ

హోయ్..హోయ్..హోయ్...

అమలాలో..ఓఓఓ..లాలమ్మలాలో..ఓఓఓ
ముద్దబంతి పూచింది..పల్లెలోనా..ఓహో 
ముద్దులెన్నో దాచింది..కళ్ళలోన

ఒక్కటే పాటుంది..గుండెలోన
అది ఒక్కరికే చందుతుంది..జన్మలోన

అమలాలో..ఓఓఓ..లాలమ్మలాలో..ఓఓఓ,,ఓహోహోహోహో

చరణం::2

నీ బుగ్గరంగంత..సందె కిస్తివి
నీ వొంటి పొంగంత..పూలకిస్తివి
నీ బుగ్గరంగంత..సందె కిస్తివి
నీ వొంటి పొంగంత..పూలకిస్తివి
నా కోసం నీవేమి..తీసుకొస్తివి
అరె..హా..ఆఆఆ..ప్రాయం నీకే ఇస్తిని
అరె..హా..ఆఆఆ..ప్రాణం నీలో దాస్తిని
ఇన్నాళ్ళైనా ఇవ్వలేనిది..ఇన్నాళ్ళైనా ఇవ్వలేనిది
నిన్ను మరచి నన్నుమరచి..నిన్ను నీవు చూసుకొని
లాలిపాట పాడుకొని..ఉయ్యాలలో..ఓఓ..హో

హోయ్..హోయ్..హోయ్..హోయ్..ఈఈ

అమలాలో..ఓఓఓ..లాలమ్మలాలో..ఓఓఓ,,ఓహోహోహోహో

ముద్దబంతి పూచింది..పల్లెలోనా..ఓహో 
ముద్దులెన్నో దాచింది..కళ్ళలోన

ఒక్కటే పాటుంది..గుండెలోన
అది ఒక్కరికే చందుతుంది..జన్మలోన

అమలాలో..ఓఓఓ..లాలమ్మలాలో..ఓఓఓ,,ఓహోహోహోహో

Bangaru Lakshmi--1980
Music::chakravarti
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::R.Tyagarajan
Cast::Chandra Mohan, Jayasudha, Prasad Babu, Sangeetha, Giribabu, Pandaribai, Lakshmikanth, Vithal Prasad

::::::::::::::::::::::::::::::::::

amalaalO..OOO..laalammalaalO..OOO
amalaalO..OOO..laalammalaalO..OOO
muddabanti poochindi..pallelOnaa 
muddulennO daachindi..kaLLalOna
muddabanti poochindi..pallelOnaa 
muddulennO daachindi..kaLLalOna
okkaTE paaTundi..gunDelOna
adi okkarikE chandutundi..janmalOna

amalaalO..OOO..laalammalaalO..OOO

::::1

nee gunDekE nEnu..chappuDaitini
nee gooTilO nEnu..guvvanaitini
nee gunDekE nEnu..chappuDaitini
nee gooTilO nEnu..guvvanaitini
nee tODu lEkunDa..ekkaDunTini

are..haa..aaaaaaa
aDuguna aDugE..vEstivi
are..haa..aaaaaaaa
aDagaka manasE..istivi
nuvvE nachchii..ninnE mechchii
nuvvE nachchii..ninnE mechchii
palledaanni..pilladaanni
mallelaanTi..manchidaanni
choosukonTi chEsukonTi..illaalini..iiiiiiii

hOy..hOy..hOy...

amalaalO..OOO..laalammalaalO..OOO
muddabanti poochindi..pallelOnaa..OhO 
muddulennO daachindi..kaLLalOna

okkaTE paaTundi..gunDelOna
adi okkarikE chandutundi..janmalOna

amalaalO..OOO..laalammalaalO..OOO,,OhOhOhOhO

::::2

nee buggaranganta..sande kistivi
nee vonTi ponganta..poolakistivi
nee buggaranganta..sande kistivi
nee vonTi ponganta..poolakistivi
naa kOsam neevEmi..teesukostivi
are..haa..aaaaaaaa..praayam neekE istini
are..haa..aaaaaaaa..praaNam neelO daastini
innaaLLainaa ivvalEnidi..innaaLLainaa ivvalEnidi
ninnu marachi nannumarachi..ninnu neevu choosukoni
laalipaaTa paaDukoni..uyyaalalO..OO..hO

hOy..hOy..hOy..hOy..iiii

amalaalO..OOO..laalammalaalO..OOO,,OhOhOhOhO

muddabanti poochindi..pallelOnaa..OhO 
muddulennO daachindi..kaLLalOna

okkaTE paaTundi..gunDelOna
adi okkarikE chandutundi..janmalOna

amalaalO..OOO..laalammalaalO..OOO,,OhOhOhOhO

Saturday, December 08, 2012

తాతామనవడు--1973












సంగీతం::రమేష్‌నాయుదు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::L.R.ఈశ్వరీ

పల్లవి::

వచ్చేది పుల్లమ్మ..మొగుడూ
ఎల్లేది ఎల్లమ్మ..మొగుడూ
అడుగడుగో ఆదెమ్మ..మొగుడూ
యిదుగిదుతో ఈరమ్మ..మొగుడూ
మరి...నీ మొగుడో? 

చరణం::1

రాయంటి నా...మొగుడూ
రంగామెల్లి తిరిగి...రాలేదు
మాచేను...దున్నాలి 
మంచిరైతు...కావాలి
మంచిరైతు...కావాలి      
రాయంటి నా..మొగుడూ
రంగామెల్లి తిరిగి..రాలేదు
రంగామెల్లి తిరిగి..రాలేదు

చరణం::2

బీటిచేను మాది వాటంగ దున్నాలీ
రాటుకు పోటుకు ఆగాలీ
రాటుకు పోటుకు ఆగాలీ
ఆ రైతు మోతుబరై ఉండాలీ
మాయ చెంగలితుంగ మస్తుగా పెరిగింది
మాయ చెంగలితుంగ మస్తుగా పెరిగింది
తీయలేక వదులుకున్నాను
నాకు దిక్కులేక మొక్కుతున్నాను  
రాయంటి నా మొగుడూ
రంగామెల్లి తిరిగి రాలేదు
రంగామెల్లి తిరిగి రాలేదు

చరణం::3

మొరకలున్నచోట మేడి బాగానొక్కి
మొరకలున్నచోట మేడి బాగానొక్కి 
మెరకాపల్లంచేసి మెత్తగా దున్నలీ
తరగకుండా నీరు చెరువులా ఉండాలీ 
ఈవలావలగట్టు యిరుకు పుంతలదారి
ఈవలావలగట్టు యిరుకు పుంతలదారి
వివరించి చూసితే ఎదరమోడున్నదే మాచేను
యిష్టమైతే కౌలుకిస్తాను   
రాయంటి నా మొగుడూ
రంగామెల్లి తిరిగి రాలేదు
మాచేను దున్నాలి మంచిరైతు కావాలి
మంచిరైతు కావాలి      
రాయంటి నా మొగుడూ
రంగామెల్లి తిరిగి రాలేదు
రంగామెల్లి తిరిగి రాలేదు

Monday, December 03, 2012

దేవుడమ్మ--1973




















Producer::చలం
సంగీత::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,జయలలిత,లక్ష్మి,రాజసులోచన,గీతాంజలి,రామకృష్ణ,
రాజబాబు,రమణారెడ్డి

పల్లవి::

నీ మాటంటే నాకూ అదే వేదమూ
నీ తోడుంటే చాలూ అదే లోకమూ 
నీ మాటంటే నాకూ అదే వేదమూ
నీ తోడుంటే చాలూ అదే లోకమూ 
ఓహో ఓ ఓ ఓ ఓ ఓ
లాలా లలలా లాలా లలలా

చరణం::1

పెడదారిలోనా..పడిపోవు వేళా
రహదారి నీవే...చూపావూ
పెడదారిలోనా..పడిపోవు వేళా
రహదారి నీవే...చూపావూ
నీ అడుగులలో...నడిచేనూ
నీలో నేనూ...నిలిచేనూ
నీ మాటంటే నాకూ అదే వేదమూ
నీ తోడుంటే చాలూ అదే లోకమూ 
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
అహా అహా ఆ ఆ హా హా హా 

చరణం::2

నా జీవితానా..తొలిపూల వానా
కురిపించే నేడూ..నీ నవ్వులే
బడివైన నీవే..గుడివైన నీవే
గురువూ దైవం...నీవేలే
తరగని కలిమీ..మన స్నేహం
నీదీ..నాదీ..ఒక ప్రాణం
నీ మాటంటే నాకూ అదే వేదమూ
నీ తోడుంటే చాలూ అదే లోకమూ 
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్‌హు మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

దేవుడమ్మ--1973












Producer::చలం
సంగీత::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,మోహనరాజు,P.సుశీల
తారాగణం::చలం,జయలలిత,లక్ష్మి,రాజసులోచన,గీతాంజలి,రామకృష్ణ,
రాజబాబు,రమణారెడ్డి

పల్లవి::

చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా...మా ప్రాణమూ..ఊఊఊ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా...మా ప్రాణమూ
ఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో 
ఓఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో  

చరణం::1

ఈ యింటి సిరిమల్లేవె..నీవు నేడూ
ఏ యింటి జాబిల్లివవుతావో..రేపూ
ఈ యింటి సిరిమల్లేవె..నీవు నేడూ
ఏ యింటి జాబిల్లివవుతావో..రేపూ
పల్లకిలో సాగి...చల్లగ ఊరేగీ
పల్లకిలో సాగి...చల్లగ ఊరేగీ
పచ్చగ నూరేళ్ళుగ..బ్రతకాలి చెల్లీ
బ్రతకాలి...చెల్లీ..ఆ ఆ ఆ ఆ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా..మా ప్రాణమూ

చరణం::2

ఈ పూట వెలిగే..మతాబాల కన్నా
నీ పాల నవ్వుల..దీపాలె మిన్న
ఈ పూట వెలిగే..మతాబాల కన్నా
నీ పాల నవ్వుల..దీపాలె మిన్న
ఈ యింట ఉన్నా..మరో యింట ఉన్నా
ఈ యింట ఉన్నా..మరో యింట ఉన్నా
నీవున్న ఆ యింటె...దీపావళీ
దీపావళీ...నిత్య దీపావళీ
దీపావళీ...నిత్య దీపావళీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా...మా ప్రాణమూ

చరణం::3

ఏ పూర్వ జన్మల..పుణ్యాల ఫలమో
ఈ జన్మలో నేను..మీ చెల్లినయ్యానూ
ఏ పూర్వ జన్మల..పుణ్యాల ఫలమో
ఈ జన్మలో నేను..మీ చెల్లినయ్యానూ
ఏ చోట ఉన్నా..ఇదే మాట అన్నా
ఏ చోట ఉన్నా..ఇదే మాట అన్నా
మీ పేరు నా పేరు...నిలిపేనన్నా
నిలిపేనన్నా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా..మా ప్రాణమూ
ఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో 
ఓఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో 

Sunday, December 02, 2012

అందమైన అనుభవం--1979


సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.P.బాలు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

చరణం::1

గతమును పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కాలాలకు పందిళ్ళు వీళ్ళు
వీళ్లేనోయ్ నేటి మొనగాళ్ళు చెలిమికెపుడూ జతగాళ్ళు
చెడుపుకేపుడు పగవాళ్ళు వీళ్ళు వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

చరణం::2

అం..అం..అం

తళతళ మెరిసేటి కళ్లు నిగానిగాలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముళ్ళు
తీయాలోయ్ దాన్ని చేలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

చరణం::3

నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు
దులిపేయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసేయ్ పాతసంకేళ్ళు మనషులె మననేస్తాలు మనసులే మన కోవెలలు
come on clap..
మనషులె మననేస్తాలు మనసులే మన కోవెలలు 
మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్డులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..
come on everybody join together..

అందమైన అనుభవం--1979


సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::S.P.బాలు

పల్లవి::

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
అహ సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది అహహహ
మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది ఎహెహెహెహె హహహ

చరణం::1

దొరికింది గుర్రపు నాడం దొరుకుతుందనుకుంటి గుర్రం
ఊరంత గాలించినాను గాడిదై పోయాను నేను
నేనలసిపోయి సొలసిపోయి మరచిపోయి నిలిచిపోతే మెరుపల్లే వచ్చావు శంభో 
నా నిదురపోయి అదిరిపోయి మూగపోయి ఆగిపోతె గిలిగింత పెట్టావు శంభో 

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది పాపప్పపాప

చరణం::2

నీ కళ్ళు నా కళ్ళు కలిసి నీ కోర్కె నా కోర్కె తెలిసి
నీ సొగసు పువ్వల్లే విరిసి నా వయసు గువ్వల్లే ఎగసి
నేనదును చూసి తెగువ చేసి చెయ్యి వేసి చుట్టుకుంటె మంచల్లే కరిగావే శంభో
నీ సిగ్గు చూసి ఆకలేసి చెమట పోసి దాహమేసి అల్లాడిపోతున్న శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది రపప్పరరపప్ప 

Andamaina Anubhavam--1979
Music::M.S.Viswanathan
Lyricis::Aathreya
Singer::S.P.Balu
Cast::Kamalhasan,Jayaprada,Rajanikaant.

:::

Singapooru Singari Vayasupongu Vayyari
Singapooru Singari Vayasupongu Vayyari
Rajhamandri Kodaluga Ranundhi
aha..Singapooru Singari Vayasupongu Vayyari
Rajhamandri Kodaluga Ranundhi
Rajhamandri Kodaluga Ranundhi..ahaahhaha
Manmadha Leelamma Ee Janmaku Chaluamma
idi Manmadha Leelamma Ee Janmaku Chaluamma
Singapooru SingariVayasupongu Vayyari
Rajhamandri Kodaluga Ranu Andhi

:::1

Dorikindi Gurrapualadam
Korukuthundi Anukunti Gurram
Vurantha Jallinchi Nanu
Gaddadhiai Poyenu Nenu
Nenu Alasipoyi Salasipoyi 
Marachipoyi Nilichipothe
Merupalle Vachevu Shambo
Naa Nidurapoyi Adiripoyi 
Muugapoyi Aagipothe
Giligintha Petevu Shambo
Idhi Manmadha Leelamma 
Ee Janmaku Chalumma
Idhi Manmadha Leelamma 
Ee Janmaku Chalumma
Singapooru SingariVayasupongu Vayyari
Rajhamandri Kodaluga Ranu Andhi

:::2

Nee Kallu Naa Kallu Kalisi
Nee korke Naa korke Thelisi
Nee Sogasu Puvvale Virisi Naa 
Vayasu Buvvale Yegasi
Nee Nadamu Chusi Theguva Vesi 
Cheya Vesi Chuttakunte
Manchalle Karigeve Shambo
Nee Siggu Chusi Aakala Vesi 
Chamata Posi Dhaham Vesi
Aladipothuna Shambo
Idhi Manmadha Leelamma
Ee Janmaku Chalumma
Idhi Manmadha Leelamma
Ee Janmaku Chalumma
Singapooru Singari Vayasupongu Vayyari
Rajhamandri Kodaluga Ranundhi

Rajhamandri Kodaluga Ranundhi