Saturday, December 08, 2012

తాతామనవడు--1973












సంగీతం::రమేష్‌నాయుదు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::L.R.ఈశ్వరీ

పల్లవి::

వచ్చేది పుల్లమ్మ..మొగుడూ
ఎల్లేది ఎల్లమ్మ..మొగుడూ
అడుగడుగో ఆదెమ్మ..మొగుడూ
యిదుగిదుతో ఈరమ్మ..మొగుడూ
మరి...నీ మొగుడో? 

చరణం::1

రాయంటి నా...మొగుడూ
రంగామెల్లి తిరిగి...రాలేదు
మాచేను...దున్నాలి 
మంచిరైతు...కావాలి
మంచిరైతు...కావాలి      
రాయంటి నా..మొగుడూ
రంగామెల్లి తిరిగి..రాలేదు
రంగామెల్లి తిరిగి..రాలేదు

చరణం::2

బీటిచేను మాది వాటంగ దున్నాలీ
రాటుకు పోటుకు ఆగాలీ
రాటుకు పోటుకు ఆగాలీ
ఆ రైతు మోతుబరై ఉండాలీ
మాయ చెంగలితుంగ మస్తుగా పెరిగింది
మాయ చెంగలితుంగ మస్తుగా పెరిగింది
తీయలేక వదులుకున్నాను
నాకు దిక్కులేక మొక్కుతున్నాను  
రాయంటి నా మొగుడూ
రంగామెల్లి తిరిగి రాలేదు
రంగామెల్లి తిరిగి రాలేదు

చరణం::3

మొరకలున్నచోట మేడి బాగానొక్కి
మొరకలున్నచోట మేడి బాగానొక్కి 
మెరకాపల్లంచేసి మెత్తగా దున్నలీ
తరగకుండా నీరు చెరువులా ఉండాలీ 
ఈవలావలగట్టు యిరుకు పుంతలదారి
ఈవలావలగట్టు యిరుకు పుంతలదారి
వివరించి చూసితే ఎదరమోడున్నదే మాచేను
యిష్టమైతే కౌలుకిస్తాను   
రాయంటి నా మొగుడూ
రంగామెల్లి తిరిగి రాలేదు
మాచేను దున్నాలి మంచిరైతు కావాలి
మంచిరైతు కావాలి      
రాయంటి నా మొగుడూ
రంగామెల్లి తిరిగి రాలేదు
రంగామెల్లి తిరిగి రాలేదు

No comments: