Monday, December 03, 2012

దేవుడమ్మ--1973












Producer::చలం
సంగీత::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,మోహనరాజు,P.సుశీల
తారాగణం::చలం,జయలలిత,లక్ష్మి,రాజసులోచన,గీతాంజలి,రామకృష్ణ,
రాజబాబు,రమణారెడ్డి

పల్లవి::

చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా...మా ప్రాణమూ..ఊఊఊ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా...మా ప్రాణమూ
ఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో 
ఓఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో  

చరణం::1

ఈ యింటి సిరిమల్లేవె..నీవు నేడూ
ఏ యింటి జాబిల్లివవుతావో..రేపూ
ఈ యింటి సిరిమల్లేవె..నీవు నేడూ
ఏ యింటి జాబిల్లివవుతావో..రేపూ
పల్లకిలో సాగి...చల్లగ ఊరేగీ
పల్లకిలో సాగి...చల్లగ ఊరేగీ
పచ్చగ నూరేళ్ళుగ..బ్రతకాలి చెల్లీ
బ్రతకాలి...చెల్లీ..ఆ ఆ ఆ ఆ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా..మా ప్రాణమూ

చరణం::2

ఈ పూట వెలిగే..మతాబాల కన్నా
నీ పాల నవ్వుల..దీపాలె మిన్న
ఈ పూట వెలిగే..మతాబాల కన్నా
నీ పాల నవ్వుల..దీపాలె మిన్న
ఈ యింట ఉన్నా..మరో యింట ఉన్నా
ఈ యింట ఉన్నా..మరో యింట ఉన్నా
నీవున్న ఆ యింటె...దీపావళీ
దీపావళీ...నిత్య దీపావళీ
దీపావళీ...నిత్య దీపావళీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా...మా ప్రాణమూ

చరణం::3

ఏ పూర్వ జన్మల..పుణ్యాల ఫలమో
ఈ జన్మలో నేను..మీ చెల్లినయ్యానూ
ఏ పూర్వ జన్మల..పుణ్యాల ఫలమో
ఈ జన్మలో నేను..మీ చెల్లినయ్యానూ
ఏ చోట ఉన్నా..ఇదే మాట అన్నా
ఏ చోట ఉన్నా..ఇదే మాట అన్నా
మీ పేరు నా పేరు...నిలిపేనన్నా
నిలిపేనన్నా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చిన్నారి చెల్లి..మా బంగారు తల్లి
నీవేనమ్మా..మా ప్రాణమూ
ఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో 
ఓఓఓఓఓఓహో..ఓఓఓఓఓఓహో 

No comments: