Tuesday, December 25, 2012

కళ్యాణి--1979


సంగీతం::రమేశ్ నాయుడు
రచన::దాసం గోపాలకృష్ణ
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి::

నవరాగానికీ..నడకలు వచ్చెనూ
మధుమాసానికీ..మాటలు వచ్చెనూ
నడకలు కలిపీ..నడవాలీ
మాటలూ కలిపీ..మసలాలీ

నవరాగానికీ..నడకలు వచ్చెనూ
మధుమాసానికీ..మాటలు వచ్చెనూ

చరణం::1

సరసాల ఆటలో..సరాగాల తోటలో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సరసాల పాటలో..సరాగాల తోటలో
అనురాగానికీ..అంటులు కట్టాలీ
అనురాగానికీ..అంటులు కట్టాలీ

మొలకెత్తిన ఆశకూ..చిగురించిన ఊసుకూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మొలకెత్తిన ఆశకూ..చిగురించిన ఊసుకూ
తొలకరి నాటులు..నాటాలీ
తొలకరి నాటులు..నాటాలీ

నవరాగానికీ..నడకలు వచ్చెనూ
మధుమాసానికీ..మాటలు వచ్చెనూ

చరణం::2

కులుకులకు..కుదురులు కట్టీ
పరువాలకు..పందిరి వేయాలీ
పున్నమి నాటికి..పువ్వులు పూయించాలీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కులుకులకు కుదురులు కట్టీ
పరువాలకు పందిరి వేయాలీ
పున్నమి నాటికి పువ్వులు పూయించాలీ
పువ్వులు పూయించాలీ

పూట పూటకు తోటకు వెళ్ళి
పువ్వుల మాలలు కట్టాలీ
అమర కళలకూ అర్పణ చేయాలీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పూట పూటకు తోటకు వెళ్ళి
పువ్వుల మాలలు కట్టాలీ
అమర కళలకూ అర్పణ చేయాలీ
అర్పణ చేయాలీ


నవరాగానికీ నడకలు..వచ్చెనూ
మధుమాసానికీ మాటలు..వచ్చెనూ
నడకలు కలిపీ నడవాలీ
మాటలూ కలిపీ మసలాలీ
నవరాగానికీ నడకలు..వచ్చెనూ
మధుమాసానికీ మాటలు..వచ్చెనూ

No comments: