కుంకుమ తిలకం--1983
సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు,P.సుశీల
పల్లవి::
ఆలనగా పాలనగా..అలసిన గుండెకు ఆలంబనగా
లాలించు నీదానిగా..స్వామీ..పాలించు నీ దాసిగా
ఆలనగా పాలనగా..అలసిన గుండెకు ఆలంబనగా
లాలించు నీదానిగా..స్వామీ..పాలించు నీ సాటిగా
చరణం::1
పున్నమి కోరే రేయిని నేను..పూజకు వేచిన పువ్వును నేను
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పున్నమి కోరే రేయిని నేను..పూజకు వేచిన పువ్వును నేను
నిన్నటి దాకా..నాలో నేను..ఈ నిమిషానా..నీతో నేను
లాలించు నీ దానిగా..స్వామీ పాలించు నీ దాసిగా
చరణం::2
నీ హృదయం ఒక సాగరమైతే..బిందువునైనా చాలును నేను
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ హృదయం ఒక సాగరమైతే..బిందువునైనా చాలును నేను
నీ ఒడిలో పసిపాపను కానా..నీ పాదాల రేణువు కానా
లాలించు నీ దానిగా.. స్వామీ..పాలించు నీ దాసిగా
ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా
ఆహాహ హా ఆహహా ఆ ఆ ఆ ఆ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
No comments:
Post a Comment