Tuesday, December 11, 2012

వింతకథ--1973

సంగీతం::పుహళేంది 
రచన::D.C.నారాయణరెడ్డి   
గానం::S.P.బాలు   
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి

పల్లవి::

ఎదురు చూచిన కాముని పున్నమి..ఆనాడు కాదు ఈనాడే
ఎదురు చూచిన కాముని పున్నమి..ఆనాడు కాదు ఈనాడే
ఎదలోని పొదలోన ఎదలోని పొదలోన..తుమ్మెదలు ఝుమ్మని చెలరేగే              
ఎదురు చూచిన కాముని...పున్నమి
ఆనాడు కాదు ఈనాడే..ఆనాడు కాదు ఈనాడే

చరణం::1

ఊహల తరగల నురగలపైన..ఊర్వశియే ఉదయించెనులే
ఊహల తరగల నురగలపైన..ఊర్వశియే ఉదయించెనులే
లలిత భావ కర్పూరవాటిలో..లకుమ అందెలే రవళించెనులే
లలిత భావ కర్పూరవాటిలో..లకుమ అందెలే రవళించెనులే
ఎన్నడు చూడని వెన్నెల కన్నెలు..కిన్నెరసానులై కులికెనులే
ఎన్నడు చూడని వెన్నెల కన్నెలు..కిన్నెరసానులై కులికెనులే
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హూ..హ్హా హ్హా హ్హా హా
ఎన్నో జన్మల మూగ రాగాలు..ఎంకి పాటలై పలికెనులే
ఎన్నో జన్మల మూగ రాగాలు..ఎంకి పాటలై పలికెనులే          
ఎదురు చూచిన కాముని...పున్నమి
ఆనాడు కాదు ఈనాడే..ఆనాడు కాదు ఈనాడే
  
చరణం::2
  
ఆ మేని ఒంపులలోన..ఒక మెలికెనై పోదునా
ఆ మేని ఒంపులలోన..ఒక మెలికెనై పోదునా
ఆ మెత్తని గుండెపైన..ముత్యాల దండనై పోదునా
ముత్యాల...దండనై పోదునా
ఆ ముద్దు మోముపైన..నేనొక ముచ్చటనై పోదునా
ఆ కంటి పాపలోనా...నేనొక పాపనై పోదునా  
నేనొక పాపనై పోదునా...నేనొక పాపనై పోదునా

No comments: