Monday, December 10, 2012

విచిత్ర వివాహం--1973::తిలంగ్::రాగం




















సంగీతం::సత్యం
రచన::దాశరథి 
గానం::P.భానుమతి
తారాగణం::P.భానుమతి,గుమ్మడి,చంద్రమోహన్,పద్మనాభం,రమాప్రభ,ప్రమీల,రామకృష్ణ,రాజబాబు.
తిలంగ్::రాగం

పల్లవి::

నాలో నిన్నే...చూడనా
నాలో నిన్నే...చూడనా
నాలో నిన్నే...చూడనా 
విరిసిన పున్నమి వెన్నెలలోన
పరవశించి...నే పాడనా
నాలో నిన్నే...చూడనా

చరణం::1

ఎవ్వరులేని ఏకాంతములో
ఎన్నడులేని ఆనందముతో
ఎవ్వరులేని ఏకాంతములో
ఎన్నడులేని ఆనందముతో
మమతలు నాలో పొంగే వేళా
నా మది నిన్నే కోరేవేళా
పరవశించి నే పాడనా    
నాలో నిన్నే చూడనా
విరిసిన పున్నమి వెన్నెలలోన
పరవశించి నే పాడనా
నాలో నిన్నే చూడనా

చరణం::2

నీలో సగమై, నీవే జగమై
నిండుగ నీతో జీవించాలని
నీలో సగమై, నీవే జగమై
నిండుగ నీతో జీవించాలని
ఆశలు నాలో ఆడే వేళ
అనురాగడోల ఊగే వేళ
పరవశించి నే పాడనా       
నాలో నిన్నే చూడనా
విరిసిన పున్నమి వెన్నెలలోన
పరవశించి నే పాడనా
నాలో నిన్నే చూడనా

No comments: