Wednesday, December 26, 2012

కల్యాణి--1979

సంగీతం::రమేశ్ నాయుడు 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, P.సుశీల 

పల్లవి:: 

ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం 
మోసమైనా దోషమైనా..చేసింది ఎవరికోసం..నేను చేసింది ఎవరికోసం

ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం 
ఎవరిదైనా..ఎందుకైనా..చేసింది పచ్చిమోసం..నీవు చేసింది పచ్చిమోసం

చరణం::1 

నేటిచీకటి ముసిరిందీ..రేపటి ఉదయం కోసం
నేటి మంచులో దాగుందీ..రేపటి చైత్రమాసం
నేటి బ్రతుకే చీకటైతే..రేపటి ఉదయం దేనికనీ
నేడు మనసే రాయైపోతే..రేపటి చైత్రం ఎవరికనీ
రేపటి చైత్రం ఎవరికనీ..

ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం
ఎవరిదైనా..ఎందుకైనా..చేసింది పచ్చిమోసం..నీవు చేసింది పచ్చిమోసం

చరణం::2

నేడు మధనం జరిగేదీ..రేపటి మధురిమ కోసం
నేడు కలతలు మోసేదీ..రేపటికలయిక కోసం
ఉన్నదంతా విషమైపోతే..లేని మధురిమ దేనికనీ
కలతలతోనే కథముగిసిపోతే..కాలికలయిక ఎవరికనీ
కాలికలయిక ఎవరికనీ

ఏది మోసం ఎవరిది దోషం..ఏది పాపం ఎవరిది లోపం 
మోసమైనా దోషమైనా..చేసింది ఎవరికోసం..నేను చేసింది ఎవరికోసం

చరణం::3

నిప్పునద్దిన బంగారానికి ఎప్పుడూ విలువుంటుందీ..
కాగింది బంగారం కాదని..కాలమే రుజువు చేస్తుందీ
నీడకు బెదరని మనిషికే..నిజమును చాటే బలముంటుంది
నీడ చీకటీ..నిజం వెలుతురూ..నీవు బ్రాంతివీ..నేను కాంతినీ
నీకు నాకు ఎన్నడు కలవని..అగాధముంది అంతరముందీ
అగాధముంది అంతరముందీ.. 

No comments: