సంగీతం::J.V.రాఘవులు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::అక్కినేని,మంజుల,సత్యనారాయణ,జయంతి,రాజబాబు,గిరిబాబు.
పల్లవి::
రారా..ఆ..పడకింటికీ..హో
నిదుర రాదూ..ఊఊ..నా కంటికీ..హ్హా
తగిన మందివ్వరా..రగిలే నా ఒంటికీ
రారా..ఆ..పడకింటికీ
ఎందుకు పడకింటికి...పోదాములే పొదరింటికీ
తగిన మందుందిలే...రగిలే నీ ఒంటికీ.ఈఈ
రారా..పడకింటికీ..నిదుర రాదూ నా కంటికీ
చరణం::1
వెచ్చగా చలివేసింది..మత్తుగా మసకేసిందీ
కొత్తమోజు రేగింది..అది పిచ్చిగా నినుకోరిందీ
మోజే ప్రేమయితే..ఆ ప్రేమే పిచ్చయితే
మోజే ప్రేమయితే..ఆ ప్రేమే పిచ్చయితే
ఆ పిచ్చి ముదిరితే..నీ మనసు చెదిరితే
ఆహా..అందుకే..రారా..పడకింటికీ..ఈఈ
నిదుర రాదూ..ఊఊ..నా కంటికీ
చరణం::2
ఆడదాని వలపులు..ఏటిలోని తరగలు
ఏ గాలికి అవి చెదురునో..ఏ గట్టు తాకీ విరుగునో
నీలాంటి దొరబాబే..నా జంటగా వుంటే
నీలాంటి దొరబాబే..నా జంటగా వుంటే
నా మనసు చెదిరిపోదూ..యీ వలపు విరిగిపోదూ..ఆ..అయితే
ఎందుకు పడకింటికీ...పోదాములే పొదరింటికీ
తగిన మందుందిలే...రగిలే నీ ఒంటికీ.ఈఈ
రారా..పడకింటికీ..నిదుర రాదూ నా కంటికీ
తగిన మందివ్వరా..ఆ..రగిలే నా ఒంటికీ..ఈ
రారా..ఆ..మా ఇంటికీ..నిదుర రాదూ నా కంటికీ
ఆహా..ఆహా..ఆహా..ఆహా..
No comments:
Post a Comment