Monday, October 31, 2011

అనురాగదేవత--1982

ఈ పాట ఇక్కడ వినండి





సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::బాలు

పల్లవి::

ఆ ఆ ఆ అ ఆ..ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ
అందాల హృదయమా..అనురాగ నిలయమా
అందాల హృదయమా..అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాటా..వినిపించు నాకు ప్రతి పూట
వెంటాడు నన్ను ప్రతి చోటా..

అందాల హృదయమా..అనురాగ నిలయమా

చరణం::1

మనసుయ్న్న వారికే మమతాను బంధాలు
కనులున్న వారికే..కనిపించు అందాలు
అందరి సుఖమే నీదను కొంటే..
నవ్వుతు కాలం గడిపేస్తుంటే
ప్రతి రుతువూ ఒక వాసంతం
ప్రతి బ్రతుకూ ఒక మధుగీతం

అందాల హృదయమా..అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాటా..వినిపించు నాకు ప్రతి పూట
వెంటాడు నన్ను ప్రతి చోటా..
అందాల హృదయమా..అనురాగ నిలయమా

చరణం::2

ఏ పాటకైనా రావాలి రాగమూ..ఏ జంటకైనా రావాలి యోగం
జీవితమెంతో తీయనైనదని..మనసున మమతే మాసిపోదనీ
తెలిపే నీతో సహవాసం..వలచేవారికి సందేశం

అందాల హృదయమా..అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాటా..వినిపించు నాకు ప్రతి పూట
వెంటాడు నన్ను ప్రతి చోటా..
అందాల హృదయమా..అనురాగ నిలయమా

No comments: