Monday, October 31, 2011

కొడుకు కోడలు--1972





సంగీతం::K.V. మహదేవన్ర
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల


అతడు::చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది

ఆమె::పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది

ఆమె::చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది

అతడు::పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది

చరణం::1

అతడు:: నా తలుపును తట్టింది
నా తలుపును తట్టింది
నీ మనసుకు మెలుకువ వచ్చింది
నీ వయసుకు గడియను తీసింది

ఆమె:: నీ పిలుపే లోనికి రమ్మంది
నీ పిలుపే లోనికి రమ్మంది
నా బిడియం వాకిట ఆపింది
నా సిగ్గే ముగ్గులు వేసిందీ
అహాహహా అహాహాహా

అతడు::చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది

ఆమె::ఆ ఆ పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది

చరణం::2

అతడు::సిగ్గుతో నీవు నిలుచుంటే
నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
సిగ్గుతో నీవు నిలుచుంటే
నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే
ఊపిరాడక నా మనసు
వుక్కిరి బిక్కిరి అయ్యింది

ఆమె::వాకిట నేను నిలుచుంటే
ఆకలిగా నువు చూస్తుంటే
వాకిట నేను నిలుచుంటే
ఆకలిగా నువు చూస్తుంటే
ఆశలు రేగి నా మనసు
అటు ఇటు కాక నలిగిందీ

అతడు::చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది

ఆమె::పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది

చరణం::3

ఆమె::నీ చూపే మెత్తగ తాకింది
నీ చూపే మెత్తగ తాకింది
నా చుట్టూ మత్తును చల్లింది
నిను చూస్తూ వుంటే చాలంది

అతడు::నీ సొగసే నిలవేసింది
నీ సొగసే నిలవేసింది
నా మగసిరికీ సరితూగిందీ
నా సగమును నీకు ఇమ్మందీ
లలలలలా..లలాల్లా

ఇద్దరు::
చేయీ చేయీ తగిలింది
హాయి హాయిగా వుంది

పగలు రేయిగా మారింది
పరువం వురకలు వేసింది

No comments: