Monday, October 31, 2011

అనురాగదేవత--1982




సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::SP.బాలు

నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంట..సిగపూవ్వుకు ముద్దంట
సిరి మువ్వగ నేనుంటా..సిరి మువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా

అందాలు నీలోన పందాలు వేస్తుంటే..ఏ..ఏ..
అరచేత పగడాలు..జగడాలు పడుతుంటే..ఏ..
అందాలు నీలోన పందాలు వేస్తుంటే
అరచేత పగడాలు..జగడాలు పడుతుంటే
ఎద మీద హారాలు..తారాడుతుంటే
తారల్లు నీ కంట..తానాలు చేస్తుంటే
తెలుగు పాటకో ఎంకివై..తెలుగుతోట వరికంకివై
కిన్నెర మీటే నవ్వులతో..కిన్నెర మీటే నవ్వులతో
కిన్నెరసానీ..నడకలతో..కిన్నెరసానీ..నడకలతో

నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంట..సిగపూవ్వుకు ముద్దంట
సిరి మువ్వగ నేనుంటా..సిరి మువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా

జడకొప్పే నీ మొగ్గ నడుమెక్కడంటుంటే..ఏ..హా..
పెదవుల్లు నీ గుట్టు గోరింతలవుతుంటే..ఏ..ఏ..
జడకొప్పే నీ మొగ్గ నడుమెక్కడంటుంటే
పెదవుల్లు నీ గుట్టు గోరింతలవుతుంటే
మాయింటి దీపాలు నీ రూప మవుతుంటే
నీ కంటి నీడల్లో..నే రాగ మవుతుంటే
కూచిపూడికొక ఆటవై..కూనలమ్మ తొలి పాటవై..ఈ..
జాబిలి దాటే వెన్నెలతో.జాబిలి దాటే వెన్నెలతో
జాబులు పంపే కన్నులతో..జాబులు పంపే కన్నులతో

నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంట..సిగపూవ్వుకు ముద్దంట
సిరి మువ్వగ నేనుంటా..సిరి మువ్వగ నేనుంటా

No comments: