Showing posts with label అత్తలూ కోడళ్లు--1971. Show all posts
Showing posts with label అత్తలూ కోడళ్లు--1971. Show all posts

Tuesday, November 01, 2011

అత్తలూ కోడళ్లు--1971















సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ, నాగభూషణం,సూర్యకాంతం, రాజబాబు, ఛాయాదేవి,నిర్మల

పల్లవి::

అమ్మమ్మో అత్తమ్మో..అమ్మమ్మో అత్తమ్మో 
ఇక్కడే పుట్టిన సంగతి..అప్పుడే మరవొద్దమ్మో 
ఇక్కడే పుట్టిన సంగతి..అప్పుడే మరవొద్దమ్మో
అంత మిడిసిపాటొద్దమ్మో..అహ హా హా హా
అమ్మమ్మో..ఓఓఓ..అత్తమ్మో

చరణం::1

రామా..కృష్ణా..అనే వయసులో రంగద్దాలు ఎందుకు
రామా..కృష్ణా..అనే వయసులో రంగద్దాలు ఎందుకు 
పాడి పంటలు అందించే పల్లెను తిడతా వెందుకు
పాడి పంటలు అందించే పల్లెను తిడతా వెందుకు 
పుట్టిన ఊరిని తిట్టేవారికి పుట్టగతులు లేవత్తమ్మో ఓయమ్మో
ఉన్నమాట నేనన్నానని..ఉరిమిచూడకే ఓయమ్మో   
అమ్మమ్మో అత్తమ్మో..ఆ ఆ ఆ ఆ..అమ్మమ్మో అత్తమ్మో 

చరణం::2
 
పిట్టల దొరలా రంగు రంగుల..బట్టల తొడిగే కుర్రోళ్ళు
రైకగుడ్డనే చొక్కాచేసి సోకులుచేసే..మొనగాళ్ళు
చదువు పేరుతో డబ్బులు గుంజి..జల్సా చేసే సోగ్గాళ్ళూ
అమ్మా..అయ్యా అమ్మా..అయ్యా..ఒదిలేస్తే 
దమ్మిడీకి కొరగారు..డుర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్
అమ్మమ్మో అత్తమ్మో..అమ్మమ్మో అత్తమ్మో 

చరణం::3

పిడకలు చేసిన ఆ చెయ్యే..పేడను చూసి కసిరింది
పొలాల తిరిగిన ఆ కాలే..బురదను చూసి బెదిరింది
పిడకలు చేసిన ఆ చెయ్యే..పేడను చూసి కసిరింది
పొలాల తిరిగిన ఆ కాలే..బురదను చూసి బెదిరింది
ఫ్యానుగాలిలో ఊరిన ఒంటికి..పైరగాలి సరిపోతుందా 
పట్నం మోజులు మరిగినవారికి..పల్లెటూరు పనికొస్తుందా 

అమ్మమ్మో అత్తమ్మో..అమ్మమ్మో అత్తమ్మో 
ఇక్కడే పుట్టినసంగతి..అప్పుడే మరవొద్దమ్మో 
అంత మిడిసిపాటొద్దమ్మో..ఓహో హో హో..
అమ్మమ్మో అత్తమ్మో..అహా     
అమ్మమ్మో అత్తమ్మో అమ్మమ్మో అత్తమ్మో 

అత్తలూ కోడళ్లు--1971















సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

చీరకు రవికందమా..రవికకు చీరందమా 
చీరకు రవికందమా..రవికకు చీరందమా 
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా 
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా 
చీరకు రవికందమా..రవికకు చీరందమా 
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా 

చరణం::1

పైటకొంగు చుట్టచుట్టి..పైటన్నం గంపనెట్టి 
పైటకొంగు చుట్టచుట్టి..పైటన్నం గంపనెట్టి
కోక కాస్త ఎత్తికట్టి..గట్టుమీద నడుస్తుంటె 
కోక కాస్త ఎత్తికట్టి..గట్టుమీద నడుస్తుంటె
నడక అందమా..ఆ నడుము అందమా 
నడక అందమా..ఆ నడుము అందమా 
చీరకు రవికందమా..రవికకు చీరందమా 
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా 
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా

చరణం::2

పైరగాలి వీస్తుంటే..పంటచేలు వూగుతుంటే
పైరగాలి వీస్తుంటే..పంటచేలు వూగుతుంటే
ముందు ముందు పంట తలచి..మురిసిపోతు నువ్వుంటే
ముందు ముందు పంట తలచి..మురిసిపోతు నువ్వుంటే
నువ్వు అందమా..నీ గర్వమందమా 
నువ్వు అందమా..నీ గర్వమందమా 
చీరకు రవికందమా..రవికకు చీరందమా 
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా 
చిలకమ్మా ఒక్కమాట..చెప్పమ్మా

చరణం::3

ముద్ద నేను పెడుతుంటే..నా మొగం నువ్వు చూస్తుంటే
ముద్ద నేను పెడుతుంటే..నా మొగం నువ్వు చూస్తుంటే
ముద్ద ముద్దకొక్క ముద్దు..కొసరి నేను కోరుతుంటే
ముద్ద ముద్దకొక్క ముద్దు..కొసరి నేను కోరుతుంటే
కోరికందమా..నీ కోపమందమా 
నా కోరికందమా..నీ కోపమందమా 
చీరకు రవికందమా..రవికకు చీరందమా 
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా 
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా

చీరకు రవికందమా..రవికకు చీరందమా 
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా 
చిలకమ్మా ఒక్కమాట..అడుగమ్మా

Monday, October 31, 2011

అత్తలూ కోడళ్లు--1971
























సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల

పల్లవి::

పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు  
నీకు వరసైన బావతోటి వాదులెందుకూ  
పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు  
నీకు వరసైన బావతోటి వాదులెందుకూ 
పాలపిట్ట వెంట  నీకు పరుగులెందుకు 
అంత వరసైన బావవైతె వాదులెందుకూ 
పాలపిట్ట వెంట  నీకు పరుగులెందుకూ 

చరణం::1

టెక్కులునిక్కులుఎన్నాళ్ళూ  
నీకు ముకుతాడేసిన మూన్నాళ్ళే 
టెక్కులునిక్కులుఎన్నాళ్ళూ  
నీకు ముకుతాడేసిన మూన్నాళ్ళే 
గీరలు జోరులు ఎన్నాళ్ళూ  
నాగాలి తగిలితే రెన్నాల్లే రెన్నాల్లే  
గీరలు జోరులు ఎన్నాళ్ళూ 
నాగాలి తగిలితే రెన్నాల్లే రెన్నాల్లే  
పాలపిట్ట పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు 
అంత వరసైన బావవైతె వాదులెందుకు 
పాలపిట్ట వెంట  నీకు పరుగులెందుకు  

చరణం::2

గాజుల గలగల వింటే చాలు 
రాతిరి నిద్దురపోలేవు
ఆహాహా..ఓహోహో 
ఓహో ఓ గాజుల గలగల వింటే 
చాలు రాతిరి నిద్దురపోలేవు
పక్కన నేను వుంటే చాలు 
పగలే కలలు కంటావు
ఆహాహా..ఆ ఓహోహో ఓ 
పక్కన నేను వుంటే చాలు 
పగలే కలలు కంటావు
కాపురమంటూ ఏర్పడితే 
నా హృదయం నీకే తెలియాలి
కాపురమంటూ ఏర్పడితే 
నా హృదయం నీకే తెలియాలీ
దీపం పెడుతూ నేనుంటే 
నా ఆశలు నువ్వే తీర్చాలి తీర్చాలీ
దీపం పెడుతూ నేనుంటే 
నా ఆశలు నువ్వే తీర్చాలి తీర్చాలీ
పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకు   
నీకు వరసైన బావతోటి వాదులెందుకూ  
పాలపిట్ట వెంట  నీకు పరుగులెందుకు  
అంత వరసైన బావవైతె వాదులెందుకూ 
పాలపిట్ట పాలపిట్ట పరుగులెందుకూ  

అత్తలూ కోడళ్లు--1971























సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P. సుశీల

పల్లవి::

ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో  
నాలోన పులకించు..ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో  
నాలోన పులకించు..ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో 

చరణం::1

మనసులో రాగాలు..స్వరములై పలికాయి  
కనులలో రాగాలు..కళలుగా వెలిశాయి
మనసులో రాగాలు..స్వరములై పలికాయి  
కనులలో రాగాలు..కళలుగా వెలిశాయి
కన్నెగుండియలోన..గమకాలు తెలిశాయి   
ఆఆఆఆఆఆఆఆఆ..
కన్నెగుండియలోన గమకాలు తెలిశాయి   
సన్నసన్నగ వలపు సంగతులు వేశాయి
ఈ వీణ పలికించు ఎన్నిరాగాలో  
నాలోన పులకించు ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు ఎన్నిరాగాలో 

చరణం::2

మోహనాలాపించ..మోహమే ఆపినది 
కళ్యాణి లోలోన..కదలాడుతున్నది
మోహనాలాపించ..మోహమే ఆపినది 
కళ్యాణి లోలోన..కదలాడుతున్నది
శ్రుతి కలిపి జతకలిపి..సొక్కులెరిగినవాడు 
తోడైననాడే..నే తోడిపాడేదీ      
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో 
నాలోన పులకించు..ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో 

చరణం::3

యిన్ని రాగాలు యీ..ఎదలోన దాచినది 
ఏ మధురమూర్తికో..ఏమమత పంటకో
యిన్ని రాగాలు యీ..ఎదలోన దాచినది 
ఏ మధురమూర్తికో..ఏమమత పంటకో
రాగమాలికలల్లి..రానున్న ప్రభువుకై 
రాగమాలికలల్లి..రానున్న ప్రభువుకై 
వేచియున్నది వీణ..కాచుకున్నది చాన
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో 
నాలోన పులకించు..ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో