Monday, October 31, 2011

అనురాగదేవత--1982







సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైన..రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా ఆ ఆ

వికసించే పూలు ముళ్ళు..విధిరాతకు ఆనవాళ్ళు
వికసించే పూలు ముళ్ళు..విధిరాతకు ఆనవాళ్ళు
ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు
ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు
ఎండమావి నీరుతాగి..గుండెమంటలార్చుకోకు
ఎండమావి నీరుతాగి..గుండెమంటలార్చుకోకు
ఆశపెంచుకోకు నేస్తం..అది నిరాశ స్వాగత హస్తం

చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైన..రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా

కాలమనే నదిలో కదిలే..ఖర్మమనే నావమీద
కాలమనే నదిలో కదిలే..ఖర్మమనే నావమీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా..చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా..చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి..ఆగి చూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి..ఆగి చూడు ఒక్కసారి
కలుసుకోని ఇరుతీరాలు..కనిపించని సుడిగుండాలు

చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైన..రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా

No comments: