Monday, October 31, 2011

ఈ తరం మనిషి --1977




సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల

పల్లవి:
శొభన్::-ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో

జయప్రద::-ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో

శొభన్::-ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో

చరణం1::-


అతడు::చిగురువంటి చినదానికి
చెంపలే సొంపులు

ఆమె::చిలిపి కళ్ల చినవాడితో
చెలిమిలోనే ఇంపులు

అతడు::చేసుకొనే బాసలు
చెరిగిపోని రాతలు

ఆమె::చేసుకొనే బాసలు
చెరిగిపోని రాతలు

అతడు::చెప్పలేని ఊహలు
చేయబోవు చేతలు

అహా..అహహా..లలలా
ఆమె:: నా హృదయం తీసుకో
అతడు::ఎదలోపల పదిలంగ దాచుకో


చరణం 2::-


అతడు::నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులూ
ఆమె::అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలూ

అతడు::నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులూ

ఆమె::అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలూ

అతడు::మనకౌగిలి వెన్నెలలో మల్లెలూ
మనకౌగిలి వెన్నెలలో మల్లెలూ

ఆమె::దిన దినము చల్లుతాయి మరపురాని మమతలు

అతడు::ఇచ్చేసా నా హృదయం తీసుకో
ఆమె::ఎదలోపల పదిలంగ దాచుకో

చరణం3::-
అతడు::మన మధ్యన గాలికూడ వుండనే వుండదు
ఆమె::కాలమైన పరుగిడనే పరుగిడదు
అతడు::నువ్వు నా ఊపిరి
ఆమె::నేను నీ లాహిరి
అతడు::నువ్వు నా ఊపిరి
ఆమె::నేను నీ లాహిరి

ఇద్దరు::ఇద్దరమూ చూద్దాము ఆనందహిమగిరి
అహా..అహహా..ల్లల్లలా..

ఆమె::ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అతడు::అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో..ఓ..ఓ..

ఇద్దరు:ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో

No comments: