Showing posts with label అనురాగదేవత--1982. Show all posts
Showing posts with label అనురాగదేవత--1982. Show all posts

Tuesday, November 01, 2011

అనురాగదేవత--1982




సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::బాలు,సుశీల,కోరస్

పల్లవి::

NTR:: ఆడవే..
లల్లల్లా
గోపికా..
లల్లలా
ఆటకే..దీపికా
నేలపై..
లల్లలా
ఆరక..
లల్లలా
నెమలికే..గీటుగా
శింగారి సిగ్గుల్లోన మందారలే నీవే
వయ్యారి నడకల్లోన..ఉయ్యాలూగనీవే
శింగారి సిగ్గుల్లోన మందారలే నీవే
వయ్యారి నడకల్లోన..ఉయ్యాలూగనీవే

ఆడవే..
లల్లల్లా
గోపికా..
లల్లలా
ఆటకే..దీపికా

చరణం::1

NTR::గాలికెగిరే పడతి కొంగై..నింగి కెగసే కడలి పొంగై
కుంకుమంటిన సందెల మబ్బై..ఆకసాన చుక్కల ముగ్గై

శ్రీదేవి::రల్లుకేల వెన్నుల మీదా..వెల్లువైన వెన్నెల లాగా

NTR::నవ్వులా..పూవులా..గువ్వలా..దివ్యలా..గువ్వలా నువ్వలా

శ్రీదేవి::ఆడితే..
లల్లలా
గోపికా..
లల్లలా
పాటకే..దీపికా
పాడరా..
లల్లలా
హాయిగా
లల్లలా
పదములే..ఆడగా
తెనుగుల్లో..తేనెలు చుట్టే..గీతాలన్ని నీవే
దారంలో వీణలు మీటే..రాగాలన్నీ నీవే
తెనుగుల్లో..తేనెలు చుట్టే..గీతాలన్ని నీవే
దారంలో వీణలు మీటే..రాగాలన్నీ నీవే

ఆడితే..
లల్లలా
గోపికా..
లల్లలా
పాటకే..దీపికా

చరణం::2

కోరస్::లాలల్లలా లాలల్లల్లాలా
NTR::నవ్వుంది చాలే నగరానా..
కురిసింది నాలో మరుమల్లె వానా
మబ్బులలోన జాబిలికున్న తెల్లారిపోయే నీ నవ్వులోనా
నడియేటి మీద నా వెంటిదానా..నడుమెక్కడుంది నీ ఒంటిలోనా

శ్రీదేవి::నా కంటి ఇంటా దివ్యంటివాడా..నీచూపుకలిగే చుక్కల్లో కలిసే

NTR::హాయ్..మల్లెల మబ్బుల..జల్లుగ రావాల
ఆ నింగికి దక్కని చుక్కవు కావాలా

ఆకాశవీధుల్లోన రాయంచల్లే రావే
నీలాల మబ్బుల్లోన..తేలి తేలి పోవే
ఆకాశవీధుల్లోన రాయంచల్లే రావే
నీలాల మబ్బుల్లోన..తేలి తేలి పోవే

శ్రీదేవి::

ఆడితే..
లల్లలా
గోపికా..
లల్లలా
పాటకే..దీపికా

NTR::

ఆడవే..
లల్లల్లా
గోపికా..
లల్లలా
ఆటకే..దీపికా

కోరస్::లలలలలలల్లలాలలాలలాలల

NTR::తారలడిగే తళుకు నీవై..మెరుపుమెరిసే విరుపునీదై
వెన్నెలంటిన వేగులచుక్కై..వెల్లవేసిన వేకువదిక్కై

శ్రీదేవి::మంచుపూల పల్లకిమీద
మెంటిరంగు ఎండల లాగా..

NTR::

నవ్వులా..
లలలా
పూవులా
లలలా
మువ్వలా
లలలా
గువ్వలా
లలలా
నువ్వలా
లలల్కా
దివ్యలా
లలలా

శ్రీదేవి::

ఆడెతే
లలలా
గోపికా
లలలా
పాటకే..దీపికా

NTR::
ఆ ఆ ఆ ఆ
ఆడవే..
లల్లల్లా
గోపికా..
లల్లలా
ఆటకే..దీపికా

ఇద్దరు::లాలలా
కోరస్::లలలా
ఇద్దరు::లాలలా
కోరస్::లలలా
ఇద్దరు::లాలలా..లాలలా

Monday, October 31, 2011

అనురాగదేవత--1982

ఈ పాట ఇక్కడ వినండి





సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::బాలు

పల్లవి::

ఆ ఆ ఆ అ ఆ..ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ
అందాల హృదయమా..అనురాగ నిలయమా
అందాల హృదయమా..అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాటా..వినిపించు నాకు ప్రతి పూట
వెంటాడు నన్ను ప్రతి చోటా..

అందాల హృదయమా..అనురాగ నిలయమా

చరణం::1

మనసుయ్న్న వారికే మమతాను బంధాలు
కనులున్న వారికే..కనిపించు అందాలు
అందరి సుఖమే నీదను కొంటే..
నవ్వుతు కాలం గడిపేస్తుంటే
ప్రతి రుతువూ ఒక వాసంతం
ప్రతి బ్రతుకూ ఒక మధుగీతం

అందాల హృదయమా..అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాటా..వినిపించు నాకు ప్రతి పూట
వెంటాడు నన్ను ప్రతి చోటా..
అందాల హృదయమా..అనురాగ నిలయమా

చరణం::2

ఏ పాటకైనా రావాలి రాగమూ..ఏ జంటకైనా రావాలి యోగం
జీవితమెంతో తీయనైనదని..మనసున మమతే మాసిపోదనీ
తెలిపే నీతో సహవాసం..వలచేవారికి సందేశం

అందాల హృదయమా..అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాటా..వినిపించు నాకు ప్రతి పూట
వెంటాడు నన్ను ప్రతి చోటా..
అందాల హృదయమా..అనురాగ నిలయమా

అనురాగదేవత--1982




సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::SP.బాలు

నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంట..సిగపూవ్వుకు ముద్దంట
సిరి మువ్వగ నేనుంటా..సిరి మువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా

అందాలు నీలోన పందాలు వేస్తుంటే..ఏ..ఏ..
అరచేత పగడాలు..జగడాలు పడుతుంటే..ఏ..
అందాలు నీలోన పందాలు వేస్తుంటే
అరచేత పగడాలు..జగడాలు పడుతుంటే
ఎద మీద హారాలు..తారాడుతుంటే
తారల్లు నీ కంట..తానాలు చేస్తుంటే
తెలుగు పాటకో ఎంకివై..తెలుగుతోట వరికంకివై
కిన్నెర మీటే నవ్వులతో..కిన్నెర మీటే నవ్వులతో
కిన్నెరసానీ..నడకలతో..కిన్నెరసానీ..నడకలతో

నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంట..సిగపూవ్వుకు ముద్దంట
సిరి మువ్వగ నేనుంటా..సిరి మువ్వగ నేనుంటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా

జడకొప్పే నీ మొగ్గ నడుమెక్కడంటుంటే..ఏ..హా..
పెదవుల్లు నీ గుట్టు గోరింతలవుతుంటే..ఏ..ఏ..
జడకొప్పే నీ మొగ్గ నడుమెక్కడంటుంటే
పెదవుల్లు నీ గుట్టు గోరింతలవుతుంటే
మాయింటి దీపాలు నీ రూప మవుతుంటే
నీ కంటి నీడల్లో..నే రాగ మవుతుంటే
కూచిపూడికొక ఆటవై..కూనలమ్మ తొలి పాటవై..ఈ..
జాబిలి దాటే వెన్నెలతో.జాబిలి దాటే వెన్నెలతో
జాబులు పంపే కన్నులతో..జాబులు పంపే కన్నులతో

నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూటా
చిరునవ్వుకు ముద్దంట..సిగపూవ్వుకు ముద్దంట
సిరి మువ్వగ నేనుంటా..సిరి మువ్వగ నేనుంటా

అనురాగదేవత--1982







సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైన..రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా ఆ ఆ

వికసించే పూలు ముళ్ళు..విధిరాతకు ఆనవాళ్ళు
వికసించే పూలు ముళ్ళు..విధిరాతకు ఆనవాళ్ళు
ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు
ఒకరి కంట పన్నీరైనా..ఒకరి కంట కన్నీళ్ళు
ఎండమావి నీరుతాగి..గుండెమంటలార్చుకోకు
ఎండమావి నీరుతాగి..గుండెమంటలార్చుకోకు
ఆశపెంచుకోకు నేస్తం..అది నిరాశ స్వాగత హస్తం

చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైన..రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా

కాలమనే నదిలో కదిలే..ఖర్మమనే నావమీద
కాలమనే నదిలో కదిలే..ఖర్మమనే నావమీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా..చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా..చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి..ఆగి చూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి..ఆగి చూడు ఒక్కసారి
కలుసుకోని ఇరుతీరాలు..కనిపించని సుడిగుండాలు

చూసుకోపదిలంగా..హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైన..రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా