Showing posts with label ఈ తరం మనిషి --1977. Show all posts
Showing posts with label ఈ తరం మనిషి --1977. Show all posts

Monday, October 31, 2011

ఈ తరం మనిషి --1977




సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల

పల్లవి:
శొభన్::-ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో

జయప్రద::-ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో

శొభన్::-ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో

చరణం1::-


అతడు::చిగురువంటి చినదానికి
చెంపలే సొంపులు

ఆమె::చిలిపి కళ్ల చినవాడితో
చెలిమిలోనే ఇంపులు

అతడు::చేసుకొనే బాసలు
చెరిగిపోని రాతలు

ఆమె::చేసుకొనే బాసలు
చెరిగిపోని రాతలు

అతడు::చెప్పలేని ఊహలు
చేయబోవు చేతలు

అహా..అహహా..లలలా
ఆమె:: నా హృదయం తీసుకో
అతడు::ఎదలోపల పదిలంగ దాచుకో


చరణం 2::-


అతడు::నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులూ
ఆమె::అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలూ

అతడు::నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులూ

ఆమె::అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలూ

అతడు::మనకౌగిలి వెన్నెలలో మల్లెలూ
మనకౌగిలి వెన్నెలలో మల్లెలూ

ఆమె::దిన దినము చల్లుతాయి మరపురాని మమతలు

అతడు::ఇచ్చేసా నా హృదయం తీసుకో
ఆమె::ఎదలోపల పదిలంగ దాచుకో

చరణం3::-
అతడు::మన మధ్యన గాలికూడ వుండనే వుండదు
ఆమె::కాలమైన పరుగిడనే పరుగిడదు
అతడు::నువ్వు నా ఊపిరి
ఆమె::నేను నీ లాహిరి
అతడు::నువ్వు నా ఊపిరి
ఆమె::నేను నీ లాహిరి

ఇద్దరు::ఇద్దరమూ చూద్దాము ఆనందహిమగిరి
అహా..అహహా..ల్లల్లలా..

ఆమె::ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో
అతడు::అద్దంలా చూసుకో
ముద్దల్లే వాడుకో..ఓ..ఓ..

ఇద్దరు:ఇచ్చేశా నా హృదయం తీసుకో
ఎదలోపల పదిలంగా దాచుకో

ఈ తరం మనిషి --1977



సంగీతం::చక్రవర్తి
రచన::ఆరుద్ర
గానం::సుశీల,బాలు

అహ్హా..
నవ నవ లాడే లేత జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనంద౦ తో ఉక్కిరి బిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ

అహ్హా..
నవ నవ లాడే లేత జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనంద౦ తో ఉక్కిరి బిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ

ఎర్రని పెదవుల మీదా..తెల్లని నవ్వుంది
తెల్లని నవ్వుల లోనా..నల్లని వలపుంది
ఎర్రని పెదవుల మీదా తెల్లని నవ్వుంది
తెల్లని నవ్వులలోనా చల్లని వలపుంది
చల్లని వలపు నాలో వెచ్చగా వెచ్చగా మారి
ఏదో అల్లరి చేస్తుంది ఎంతో తొందర పెడుతుంది
ఎహే...

నవ నవ లాడే లేత జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనంద౦ తో ఉక్కిరి బిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ

పగలే వెన్నెల కాసీ పండగ చేస్తుంది
విరిసిన పువ్వుల తోటా విందుల చేస్తుంది
పగలే వెన్నెల కాసీ పండగ చేస్తుంది
విరిసిన పువ్వుల తోటా విందుల చేస్తుంది
చేయి చేయి చేర్చి చిలకా గోరింకల్లె
మనసు మనసు కలపాలి
మల్లెల చాటుకు పోవాలి

అహ్హా..

నవ నవ లాడే లేత జవరాలు చెవిలో ఏదో చెప్పింది
ఊహకు అందని ఆనంద౦ తో ఉక్కిరి బిక్కిరి చేసింది
ఓ మై డార్లింగ్ ఐ లవ్ యూ హా ఐ లవ్ యూ
ఐ లవ్ యూ ఐ లవ్ యూ
ఐ లవ్ యూ ఐ లవ్ యూ
O my darling i love you i love you
O my darling i love you i love you