సంగీతం::T.చలపతిరావ్
రచన::C.నారాయణరెడ్డి
గానం:;ఘంటసాల,సుశీల
పల్లవి::
శోభన్::నేను..నీవు..ఇలాగే..వుండిపోతే..
వాణీశ్రీ::హ్హా
శోభన్::నేను..నీవు..ఇలాగే..వుండిపోతే
వాణీశ్రీ::ప్రతిక్షణం..ఈ సుఖం..ఇలాగే పండిపోతే
శోభన్::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
వాణీశ్రీ::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
చరణం::1
వాణీశ్రీ::నీ కళ్ళల్లో పొదరిల్లు కట్టుకొని ఉండనా
శోభన్::నీ సిగ్గుల నిగ్గుల బుగ్గలు చిదిమి దీపం పెట్టనా

చరణం::2
శోభన్::నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా
చరణం::2
శోభన్::నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా
వాణీశ్రీ::నీ..ఎదపాన్‌పుపై నవ వధువునై
నే ఒదిగి ఒదిగి నిదురించనా
శోభన్::నీ పెదవిపై మధురిమనై ప్రణయ మధురిమలు నింపనా
వాణీశ్రీ::నీ..ఎదపాన్‌పుపై నవ వధువునై
నే ఒదిగి ఒదిగి నిదురించనా
వాణీశ్రీ::నేను..నీవు ఇలాగే ఉండిపోతే
శోభన్::ప్రతిక్షణం..ఈ సుఖం..ఇలాగే పండిపోతే
వాణీశ్రీ::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
శోభన్::ఎంత..హాయీ..ఎంత..హాయీ..
No comments:
Post a Comment