Monday, October 31, 2011

అత్తలూ కోడళ్లు--1971























సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P. సుశీల

పల్లవి::

ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో  
నాలోన పులకించు..ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో  
నాలోన పులకించు..ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో 

చరణం::1

మనసులో రాగాలు..స్వరములై పలికాయి  
కనులలో రాగాలు..కళలుగా వెలిశాయి
మనసులో రాగాలు..స్వరములై పలికాయి  
కనులలో రాగాలు..కళలుగా వెలిశాయి
కన్నెగుండియలోన..గమకాలు తెలిశాయి   
ఆఆఆఆఆఆఆఆఆ..
కన్నెగుండియలోన గమకాలు తెలిశాయి   
సన్నసన్నగ వలపు సంగతులు వేశాయి
ఈ వీణ పలికించు ఎన్నిరాగాలో  
నాలోన పులకించు ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు ఎన్నిరాగాలో 

చరణం::2

మోహనాలాపించ..మోహమే ఆపినది 
కళ్యాణి లోలోన..కదలాడుతున్నది
మోహనాలాపించ..మోహమే ఆపినది 
కళ్యాణి లోలోన..కదలాడుతున్నది
శ్రుతి కలిపి జతకలిపి..సొక్కులెరిగినవాడు 
తోడైననాడే..నే తోడిపాడేదీ      
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో 
నాలోన పులకించు..ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో 

చరణం::3

యిన్ని రాగాలు యీ..ఎదలోన దాచినది 
ఏ మధురమూర్తికో..ఏమమత పంటకో
యిన్ని రాగాలు యీ..ఎదలోన దాచినది 
ఏ మధురమూర్తికో..ఏమమత పంటకో
రాగమాలికలల్లి..రానున్న ప్రభువుకై 
రాగమాలికలల్లి..రానున్న ప్రభువుకై 
వేచియున్నది వీణ..కాచుకున్నది చాన
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో 
నాలోన పులకించు..ఎన్నిభావాలో 
ఈ వీణ పలికించు..ఎన్నిరాగాలో 

No comments: