Tuesday, September 13, 2011

పెద్దలుమారాలి--1974





సంగీతం::B.గోపాలం
రచన::నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు , P.సుశీల

తారాగణం::కృష్ణ , జమున, అంజలీదేవి,గుమ్మడి,కృష్ణకుమారి,జగ్గయ్య,రమణారెడ్డి,పండరీబాయి

అతడు::-ఏమని వ్రాయనూ?

ఏమని వ్రాయనూ?
ప్రతి పలుకు విరహగీతమై
పరవశింపజేస్తుంటే

ఆమె::-ఆ ఆ ఆ ఆ
ఏమని వ్రాయనూ?
ఏమని వ్రాయనూ?
ప్రతి పలుకు నీరూపమై
పలకరించిపోతుంటే

అతడు::-ఏమని వ్రాయనూ ?
ఏమని వ్రాయనూ?
ప్రతి పలుకు విరహగీతమై
పరవశింపజేస్తుంటే

ఆమె::-ఏమని వ్రాయనూ?
ఏమని వ్రాయనూ?
ప్రతి పలుకు నీరూపమై
పలకరించిపోతుంటే
ఏమని వ్రాయనూ ఏమని వ్రాయనూ?

అతడు::-నింగిలోన తారలున్న
నీ కనుపాపలె కనిపించగా
నింగిలోన తారలున్న
నీ కనుపాపలె కనిపించగా
తోటలోని పూలెన్ని ఉన్నా..
తోటలోని పూలెన్ని ఉన్నా
నీ సిగమల్లెలే..కవ్వించగా
ఏమని వ్రాయనూ ఏమని వ్రాయనూ?

ఆమె:- మొదటిరేయి మూగహాయి..
ఎదలోఇంకా పులకించగా
మొదటిరేయి మూగహాయి..
ఎదలోఇంకా పులకించగా
పిదప పిదప పెరిగిన మమత..
పిదప పిదప పెరిగిన మమత..
వేయింతలుగా..వికసించగా
ఏమని వ్రాయనూ ఏమని వ్రాయనూ?

అతడు::- ఏ..కలనైనా నీవే నీవే..
నా కౌగిలిలో నిదురించగా

ఆమె::- అన్నివేళలా..నీవే నీవే..నీవే..
అన్నివేళలా..నీవే నీవే
నా కన్నులలో నివశించగా..

అతడు::-ఏమని వ్రాయనూ?
ఏమని వ్రాయనూ?
ప్రతి పలుకు విరహగీతమై
పరవశింపజేస్తుంటే

ఆమె::-ప్రతి పలుకు నీరూపమై
పలకరించిపోతుంటే

అతడు::- పరవశింపజేస్తుంటే

ఆమె::- పలకరించిపోతుంటే

అతడు::- లలలలాలలా

ఆమె::- పలకరించిపోతుంటే

అతడు::- లలలలాలలా

ఆమె::- పలకరించిపోతుంటే

No comments: