Tuesday, September 13, 2011

ముత్తైదువ--1979



సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు

జాబిలి అందంకన్నా..నా చెలి అందం మిన్నా
జాబిలి అందంకన్నా..నా చెలి అందం మిన్నా

చీకటినే వెలిగించేది జాబిలీ
ఆ వెలుగునే వెలిగించేది నాచెలి
జాబిలి అందంకన్నా..నా చెలి అందం మిన్నా

జాబిలి చిలికే పూవుల వెన్నెల
జాముదాటితే మాసిపోతుందీ
జాబిలి చిలికే పూవుల వెన్నెల
జాముదాటితే మాసిపోతుందీ
నా చెలి పెదవుల నవ్వుల వెన్నెల
నా చెలి పెదవుల నవ్వుల వెన్నెల
పగలు రేయీ చిగురులు వేస్తుంది
జాబిలి అందంకన్నా..నా చెలి అందం మిన్నా

అంతగ మెరిసే జాబిలి నుదుటా
ఎంతకు తీరని కళంకమున్నది
సిగ్గుతో ఒదిగే నా చెలి నుదుటా
చెరగని కుంకుమ తిలకమున్నది

జాబిలి అందంకన్నా..నా చెలి అందం మిన్నా
చీకటినే వెలిగించేది జాబిలీ
ఆ వెలుగునే వెలిగించేది నాచెలి
జాబిలి అందంకన్నా..నా చెలి అందం మిన్నా

చంద్రబింబమే తిలకము దిద్దగా
తారకలే హారతులివ్వగా
పెళ్ళి పడుచైన నా చెలిని దీవించ
విచ్చేయునులే ఆది ముత్తైదువ
విచ్చేయునులే ఆది ముత్తైదువ

No comments: