Tuesday, September 13, 2011

ముత్తైదువ--1979




సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::.S.P.బాలు.

సుధా రాగసుధా..అనురాగ సుధా
నీ పేరు సుధ నీ రూపు సుధా
నీ పెదవి సుధా నీ పలుకు సుధ
నీ తలపు సుధా కాస్త తెలుసు సుధా

సుధా రాగసుధా..అనురాగ సుధా
నీ పేరు సుధ నీ రూపు సుధా
నీ పెదవి సుధా నీ పలుకు సుధ
నీ తలపు సుధా కాస్త తెలుసు సుధా

పాలకడలిలో..పుట్టిన సుధవో
నీలి నింగిలో..వెలిగే సుధల్వో
పాలకడలిలో..పుట్టిన సుధవో
నీలి నింగిలో..వెలిగే సుధల్వో
పూల గుండెలో పొంగే సుధవో..
పూర్వజన్మ పండించిన సుధవో
కాస్త తెలుపు సుధా..

సుధా రాగసుధా..అనురాగ సుధా
నీ పేరు సుధ నీ రూపు సుధా
నీ పెదవి సుధా నీ పలుకు సుధ
నీ తలపు సుధా కాస్త తెలుసు సుధా

అరుణారుణరాగం నీ
వదనంలో కుంకుమ తిలకం
అరుణారుణరాగం నీ
వదనంలో కుంకుమ తిలకం
చెరిపేస్తే చెరగని ఆ సౌభాగ్యం
చిరంజీవి కావడమే..నా భాగ్యం
సుధా రాగసుధా..అనురాగ సుధా

కోవెలలో అగుపించిన దేవతవూ
నా దేవతవై నను కోవెల చేసావూ
కోవెలలో అగుపించిన దేవతవూ
నా దేవతవై నను కోవెల చేసావూ
గుడిలోమ్రోగే మంగళవాద్యం..
నీ మెడలో కాగల మంగళసూత్రం

సుధా రాగసుధా..అనురాగ సుధా
నీ పేరు సుధ నీ రూపు సుధా
నీ పెదవి సుధా నీ పలుకు సుధ
నీ తలపు సుధా కాస్త తెలుసు సుధా

No comments: