Tuesday, September 13, 2011

ముత్తైదువ--1979::తోడి::రాగం



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::S.P.బాలు

తోడి::రాగం  
( హిందుస్తాని రాగం) ::::::

ఏ గీత గీసినా నీ రూపమే

ఏ గీత గీసినా నీ రూపమే
ఏ గీతి పాడినా నీ గానమే
రతివో..భారతివో..అనురాగవతివో
ఎవరివో..ఎవరివో..నీవెవరివో
ఏ గీత గీసినా నీ రూపమే

ఏ గీత గీసినా నీ రూపమే
ఏ గీత గీసినా నీ రూపమే
ఏ గీతి పాడినా నీ గానమే
రతివో..భారతివో..అనురాగవతివో
ఎవరివో..ఎవరివో..నీవెవరివో
ఏ గీత గీసినా నీ రూపమే


దివి నుండి వచ్చిన దేవతవో
భువిలోన వెలసిన మోహినివో
మిసమిసల అందాల రసరాగ లతవో
అసమాన లావణ్య కుసుమానివో
ఎవరివో..ఎవరివో..నీవెవరివో
ఏ గీత గీసినా నీ రూపమే

కాళిదాసుని దివ్య కావ్యనాయికవో
కణ్వముని కనువెలుగు శకుంతలవో
కాళిదాసుని దివ్య కావ్యనాయికవో
కణ్వముని కనువెలుగు శకుంతలవో
మధుమాస శుభవేళ మాధవుని రాకకై
మధుమాస శుభవేళ మాధవుని రాకకై
ఎదురు తెన్నులు చూచు రాధికవో
ఏ గీత గీసినా నీ రూపమే

అజంతా గృహలోన చిత్రానివో
అమరావతీ సీమ శిల్పానివో
రామప్ప గుడిలోన రమణీయ భంగిమల
రక్తినొలికించే నర్తన బాలవో
ఎవరివో..ఎవరివో..నీవెవరివో

ఏ గీత గీసినా నీ రూపమే
ఏ గీతి పాడినా నీ గానమే
రతివో..భారతివో..అనురాగవతివో
ఎవరివో..ఎవరివో..నీవెవరివో
ఏ గీత గీసినా నీ రూపమే

No comments: