Tuesday, September 13, 2011

నేనూ నా దేశ౦--1973

























సంగీతం::సత్యం
రచన::అంకిశ్రీ 
గానం::K.J.యేసుదాసు,P.సుశీల
తారాగణం::రామకృష్ణ,గీతాంజలి,విజయ నిర్మల,రాజబాబు,సత్యనారాయణ,నాగయ్య

పల్లవి::

కురిసెను హృదయములో తేనె జల్లులూ
విరిసెను నాలోనే ప్రేమ మల్లెలూ

కురిసెను కన్నులలో..పూలవానలూ 
విరిసెను నాలోనే ప్రేమ..మాలలూ

కురిసెను హృదయములో..తేనె జల్లులూ
విరిసెను నాలోనే ప్రేమ..మాలలూ 

చరణం::1

పగలే వెన్నెల..మయమూ
ఈ జగమే నందన..వనమూ
నా తలపులు..పండే 
వలపులు నిండే..మోజులు రేపె నాలో
మనసే..ప్రేమాలయమూ 
అతి సుందర..బృందావనమూ
తొలి చూపుల ననుమూ..కలిసిన మనమూ 
ఆశలు రేపె నాలో..ఓ ప్రియా.ఆ ఆ ఆ ఆ ఆ ఆ

కురిసెను హృదయములో తేనె జల్లులూ
విరిసెను నాలోనే ప్రేమ మాలలూ 

చరణం::2

పెదవులలో..మధురిమలూ
నీ నడకలలో..మగసిరులూ
అనురాగములొలికే..తీయని 
పలుకే..విందులు చేసె నాలో
కన్నులలో..నయగారం 
నీ నడకలలో..వయ్యారం
ఆ నగవుల సొగసే..రమ్మని పిలిచే 
తొందర చేసె..నాలో..ఓ చెలీ..ఈ ఈ ఈ 

కురిసెను కన్నులలో..పూలవానలూ 
విరిసెను నాలోనే..ప్రేమ మల్లెలూ

No comments: