Tuesday, September 13, 2011

ప్రేమించి చూడు--1965::వలజి::రాగం








పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి


సంగీతం::మాష్టర్‌వేణు
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::PB.శ్రీనివాస్,P.సుశీల

రాగం::వలజి


ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

అతడు::- వెన్నెల రేయీ..ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా..రావే నా చెలీ

వెన్నెల రేయీ ఎంతో..చలీ చలీ
వెచ్చనిదానా..రావే నా చెలీ

ఆమె::- చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరివాడా నీదే ఈ చెలీ

అతడు::- చూపులతోనే..మురిపించేవూ
చూపులతోనే..మురిపించేవూ
ఆటలతోనే..మరిపించేవూ
ఆటలతోనే..మరిపించేవూ
చెలిమి ఇదేనా..మాటలతో సరేనా
చెలిమి ఇదేనా..మాటలతో సరేనా

ఆమె::-పొరపాటైతే..పలుకనులే..పిలవనులే..
దొరకనులే..ఊరించనులే

అతడు::-వెన్నెల రేయీ ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ

ఆమె::-నా మనసేమో..పదమని సరే సరే
మర్యాదేమో..తగదని..పదే పదే
మూడుముళ్ళు పడనీ..ఏడడుగులు నడవనీ
మూడుముళ్ళు పడనీ..ఏడడుగులు నడవనీ

అతడు::-వాదాలెందుకులే..కాదనినా
ఏమనినా..నాదానివిలే

ఆమె::- చల్లని జాబిలి..నవ్వెను మరీ మరీ
అల్లరివాడా..నీదే ఈ చెలీ

అతడు::- వెన్నెల రేయీ..ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా..రావే నా చెలీ

అహా అహా అహా ఆ ఆ

No comments: