Tuesday, September 13, 2011

నేనూ నా దేశ౦--1973



















సంగీతం::సత్యం
రచన::అంకిశ్రీ 
గానం::S.P.బాలు,P.సుశీల బృందం
తారాగణం::రామకృష్ణ,గీతాంజలి,విజయ నిర్మల,రాజబాబు,సత్యనారాయణ,నాగయ్య

పల్లవి::

నేనూ నా దేశం..మ్మ్
పవిత్ర భారత దేశం..మ్మ్
సాటి లేనిదీ దీటు రానిదీ
శాంతికి నిలయం మనదేశం
నేనూ నా దేశం..మ్మ్
పవిత్ర భారత దేశం..మ్మ్
సాటి లేనిదీ దీటు రానిదీ
శాంతికి నిలయం మనదేశం
నేనూ నా దేశం..మ్మ్
పవిత్ర భారత దేశం..మ్మ్ 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::1

అశోకుడేలిన..ధర్మ ప్రదేశం
బుద్ధుడు వెలసిన..శాంతి దేశం
బుద్ధం శరణం..గచ్చామీ
ధర్మం శరణం..గచ్చామీ
సంఘం శరణం..గచ్చామీ
అశోకుడేలిన..ధర్మ ప్రదేశం
బుద్ధుడు వెలసిన..శాంతి దేశం
కులమత భేధం..మాపిన త్యాగీ 
అమర బాపూజీ..వెలసిన దేశం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం 
కులమత భేధం..మాపిన త్యాగీ 
అమర బాపూజీ..వెలసిన దేశం
నేనూ నా దేశం..మ్మ్
పవిత్ర భారత దేశం..మ్మ్ 

చరణం::2

కదం తొక్కిన వీర..శివాజీ
వీర..శివాజీ..ఈ ఈ ఈ 
వీర విహారిని ఝాన్సీరాణీ..ఝాన్సీరాణీ
స్వరాజ్య సమరుడు..అల నేతాజీ
జైహింద్ జైహింద్..జైహింద్ 
స్వరాజ్య సమరుడు..అల నేతాజీ
కట్ట బ్రహ్మణ..పుట్టినదేశం

నేనూ నా దేశం..మ్మ్
పవిత్ర భారత దేశం..మ్మ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం::3

అజాదు గోఖలే.. వల్లభ పటేలు 
లజపతి తిలక్..నూనూజీలు 
అజాదు గోఖలే..వల్లభ పటేలు 
లజపతి తిలక్..నూనూజీలు 
అంబులు కురిపిన..మన అల్లూరీ
అంబులు కురిపిన..మన అల్లూరీ 
భగత్ రక్తమూ..చిందిన దేశం
హిందుస్తాన్..హమారాహై 
హిందుస్తాన్..హమారాహై
హిందుస్తాన్..హమారాహై
నేనూ నా దేశం..మ్మ్
పవిత్ర భారత దేశం..మ్మ్ 

చరణం::4

గుండ్లు తుపాకీ..చూపిన దొరలకు 
గుండె చూపె..మన ఆంద్రకేసరి 
మన..ఆంద్రకేసరి..ఈ ఈ ఈ
శాంతి దూత..మన జవహర్ నెహ్రూ
శాంతీ..శాంతీ..శాంతీ
శాంతి దూత..మన జవహర్ నెహ్రూ
లాల్ బహదూరు..జన్మదేశం 
జై జవాన్ జై కిసాన్జై జవాన్నే
నూ నా దేశం..మ్మ్
పవిత్ర భారత దేశం..మ్మ్ 

చరణం::5

అదిగో స్వరాజ్య రథాన..సారధీ 
అదిగో స్వరాజ్య రథాన..సారధీ
స్వరాజ్య రథాన..సారధీ 
ఆదర్శ నారీ..ఇందిర గాందీ
గరీబీ హఠావో గరీబీ హఠావో గరీబీ హఠావో 
ఆదర్శ నారీ..ఇందిర గాందీ 
అడుగు జాడలో..పయనిస్తాం 
అఖండ విజయం..సాధిస్తాం
అడుగు జాడలో..పయనిస్తాం
అఖండ విజయం సాధిస్తాం

నేనూ నా దేశం..మ్మ్
పవిత్ర భారత దేశం..మ్మ్
సాటి లేనిదీ..దీటు రానిదీ
శాంతికి నిలయం..మనదేశం
నేనూ నా దేశం..మ్మ్
నేనూ నా దేశం..మ్మ్
నేనూ నా దేశం..మ్మ్
నేనూ నా దేశం..మ్మ్

No comments: