సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
ముత్తైదువుగా కళకళలాడే
ముదిత బ్రతుకే ధన్యం
ముత్తైదువుగా కళకళలాడే
ముదిత బ్రతుకే ధన్యం
పసుపు కుంకుమలతో అలరారే
పడతి భాగ్యమే భాగ్యం
పసుపు కుంకుమలతో అలరారే
పడతి భాగ్యమే భాగ్యం
ముత్తైదువుగా కళకళలాడే
ముదిత బ్రతుకే ధన్యం
శ్రీలక్ష్మికున్న సౌభాగ్యం..
భూలక్ష్మికున్న సహనగుణం..
గోలక్ష్మికున్న దయాగుణం..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ......
శ్రీలక్ష్మికున్న సౌభాగ్యం..
భూలక్ష్మికున్న సహనగుణం..
గోలక్ష్మికున్న దయాగుణం..
ఈ మూడుసిరులూ మూర్తీభవించిన
ముదితయే ముత్తైదువా
ముత్తైదువుగా కళకళలాడే
ముదిత బ్రతుకే ధన్యం
నుదుట దిద్దిన కుంకుమతో..
పదములు కద్దిన పసుపుతో
కరముల తొడిగిన గాజులతో
కురులను తురిమిన విరులతో
నుదుట దిద్దిన కుంకుమతో..
పదములు కద్దిన పసుపుతో
కరముల తొడిగిన గాజులతో
కురులను తురిమిన విరులతో
పతిని సేవించు భాగ్యం కలిగిన
సతీమ తల్లియే ముత్తైదువ
ముత్తైదువుగా కళకళలాడే
ముదిత బ్రతుకే ధన్యం
వ్రతములనే క్రతువులలో
పెళ్ళీ పేరంటాలలో
సకల శుభకార్యాలలో
సర్వ మంగళ వేళలలో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
వ్రతములనే క్రతువులలో
పెళ్ళీ పేరంటాలలో
సకల శుభకార్యాలలో
సర్వ మంగళ వేళలలో
ప్రధమ తాంభూల మందగలిగిన
అతివయే..ముత్తైదువా
ముత్తైదువుగా కళకళలాడే
ముదిత బ్రతుకే ధన్యం
పసుపు కుంకుమలతో అలరారే
పడతి భాగ్యమే భాగ్యం
ముత్తైదువుగా కళకళలాడే
ముదిత బ్రతుకే ధన్యం
No comments:
Post a Comment