ఈ పాట ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::మాష్టర్‌వేణు
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల
ఆమె::- అదిఒక ఇదిలే..అతనికె తగులే
సరి కొత్త సరసాలు సరదాలు చవిచూసెలే
అహా! ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
లాలలలాలలలాలలలా
లాలలలాలలలాలలలా
అదిఒక ఇదిలే..అతనికె తగులే
సరి కొత్త సరసాలు సరదాలు చవిచూసెలే
అహా! ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
లాలలలాలలలాలలలా
లాలలలాలలలాలలలా
అదిఒక ఇదిలే..అతనికె తగులే
అతడు::- మెచ్చాను వచ్చాను ఏమేమొ తెచ్చానూ
అహా నచ్చాను అన్నావా ఏమైన ఇస్తానూ
అని పలికిందిరా చెలి కులికిందిరా
ఎద రగిలిందిరా మతి చెదిరిందిరా..చెదిరిందిరా
అదిఒక ఇదిలే..ఆమెకె తగులే..
సరికొత్త సరసాలు సరదాలు చవి చూపెలే
అహా..ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
అదిఒక ఇదిలే..ఏ..
ఆమె::-సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు
సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడూ
అహా మొగ్గల్లె ఉన్నావు విరబూయమన్నాడూ
మది పులకించెను..మరులొలికించెనూ
నను మరిపించెనూ..తగుననిపించెను
అనిపించెనూ..ఊ..అదిఒక ఇదిలే..ఏ..
అతడు::-నడకేది అన్నాను నడిచింది ఒకసారి
అహా..నడుమేది అన్నాను..నవ్వింది వయ్యారీ
నా వద్దున్నదే తన ముద్దన్నదీ
చేకొమ్మన్నదీ..నీ సొమ్మన్నదీ..సొమ్మన్నదీ
ఆమె::-ఎండల్లె వచ్చాడు మంచల్లె కరిగానూ
అహా..వెన్నెల్లు కురిశాడు..వేడెక్కిపోయానూ
ఇది బాదందునా..ఇది హాయందునా
ఏది ఏమైననూ..నే తనదాననూ..తనదాననూ
అదిఒక ఇదిలే..అతనికె తగులే
సరి కొత్త సరసాలు సరదాలు చవిచూసెలే
అహా! ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
లాలలలాలలలాలలలా
లాలలలాలలలాలలలా
No comments:
Post a Comment