Saturday, September 10, 2011

గుడిగంటలు--1964




సంగీతం::ఘంటసాల
రచన::అనిసెట్టి-ఆత్రేయ
గానం::ఘంటసాల

ఎవరికి వారౌ స్వార్థంలో
హృదయాలరుదవు లోకంలో
ఎవరికి వారౌ స్వార్థంలో
హృదయాలరుదవు లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివే
అంమృతం తెచ్చిన జాబిలివే
నాకంమృతం తెచ్చిన జాబిలివే

ధనము కోరి మనసిచ్చే ధరణి
మనిషిని కోరి వచ్చావే
నా అనువారే లేరని నేను
కన్నీరొలికే కాలంలో
ఉన్నానని నా కన్నతల్లి వలె
ఒడిని జేర్చి నన్నోదార్చేవే
నాకై వచ్చిన నెచ్చెలివే
అంమృతం తెచ్చిన జాబిలివే
నాకంమృతం తెచ్చిన జాబిలివే

ప్రేమ కొరకు ప్రేమించేవారే
కానరాక గాలించాను
గుండెలు తెరచి ఉంచాను
గుడిలో దేవుని అడిగాను
గంటలు గణగణ మ్రోగాయి
నా కంటిపాపను అన్నాయి
నాకై వచ్చిన నెచ్చెలివే
అంమృతం తెచ్చిన జాబిలివే
నాకంమృతం తెచ్చిన జాబిలివే

ఈ అనురాగం ఈ ఆనందం
ఎవ్వరెరుగని ఈ అనుబంధం
ఈ అనురాగం ఈ ఆనందం
ఎవ్వరెరుగని ఈ అనుబంధం
ఊడలు పాతీ..నీడలు పరచీ
ఉండాలీ వెయ్యేళ్ళు చల్లగ
ఉండాలీ వెయ్యేళ్ళు
తీయగ పండాలి మన కలలు
ఎవరికి వారౌ స్వార్థంలో
హృదయాలరుగవు లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివే
అంమృతం తెచ్చిన జాబిలివే
నాకంమృతం తెచ్చిన జాబిలివే

No comments: