సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::V.రామకృష్ణ
తారాగణం::అక్కినేని,లత,రాజబాబు,అల్లు రామలింగయ్య,నాగభూషణం,ధూళిపాళ,రావికొండలరావు,
నూతన్‌ప్రసాద్,సూర్యకాంతం
ఆనందభైరవి::రాగం
ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా..ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారూ
జో జో..జో జో ............
జో జో..జో జో..........
ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో..జో జో..జో జో..........
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలీ
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలీ
చదవకుంటె పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుపడితె..ఫెయిల్ ఐతే బిక్కమొగం వెయ్యాలి
కాలేజి సీట్లు అగచాట్లురా..అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తైతే మొదలవ్వును పాట్లురా..
అందుకే..
ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో....
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలీ
అడ్డమైనవాళ్ళకీ గుడ్మార్ణింగ్ కొట్టాలీ
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్వూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా..మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావీ నీకెపుడూ దోస్తురా..
అందుకే....
ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో.....
B.A ను చదివి చిన్న బంట్రోతు పనికెళితే..
M.A.లు అచట ముందు సిద్దము..నీవు చేయలేవు వాళ్ళతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో..
పదినెల్ల దాక జీతమివ్వరూ..నువ్వు బతికావో చచ్చేవో చూడరు
ఈ సంఘం లో ఎదగడమే దండగా..మంచికాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగ....
అందాకా....
ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో..టాటా..టాటా..టాటా..టాటా....
Andaala Raamudu--1973
Music::K.V.Mahadevan
Lyricis::Arudra
Singer's::V.Ramakrishna
Cast::Akkineni,Latha,Naagabhushanam,Raajabaabu,Alluramalingayya,Dhulipaala,Raavikondalaraavu,Nootanprasad,sooryakaantam.
Anandabhairavi::raagam
::::
yedavaku yedavaku verri naganna
yeduste ne kallu neelaalu karu
jojo..jojo..jojo..jojo
yedagadanikendukura tondaraa
yedara batukantaa chindara vandara
jojo..jojo..jojo jojo
:::1
yedigevo badilonu yennenno chadavali
panikirani patalu batteeyam pettali
chadavakunte pareekshalo kapeelu kottali
pattubadite failayite bikkamoham veyyali
college seetlu agachatluraa
avi kondaniki undali notluraa
chaduvu purtayite modalavvunu patluraa
anduke
:::2
udyogam vetalona urantaa tiragali
addamainavallakee goodmorning kottali
amyamya arpinchi hastalu tadapali
interview antuu Q antuu poddantaa nilavali
pilupu rakunte ne asha wasturaa
malla pettali inko darakhasturaa
yendamavi nekepuduu dosturaa
anduke
:::3
BAnu chadivi chinna bantrotu panikelite
MAlu achata mundu siddamu
nevu cheyalevu vaallato yuddamu
batakaleka badipantulu pani nuvvu chesevo
padinelladaakaa jeetamivvaru
nuvvu batikavoo chachevo chudaru
ee sanghamlo yedagadame dandagaa
manchi kalamokati vastundi nindugaa
apudu yedagadame balalaku pandagaa
andakaa
jojo..jojo..jojo jojo
tata tata..tata tata
No comments:
Post a Comment