సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చంద్రమోహన్, సులక్షణ ,చారుహాసన్
పల్లవి::
కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా..ఆ
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ
చరణం::1
మ్మ్.మ్మ్.మ్మ్ మ్మ్ మ్మ్..ఆ..ఆ..ఆహాహా
ఆ..త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేదో తీసినట్టు ఉందమ్మా..మ్మ్ మ్మ్
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాది బొమ్మ
రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ముసిముసినవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వగోపాలా..మువ్వగోపాలా
మువ్వగోపాలా..అన్నట్టుందమ్మా
అడుగుల సవ్వళ్ళు..కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు..లేవమ్మా
అడుగుల సవ్వళ్ళు..కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు..లేవమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా..ఆ
చరణం::2
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళకంత నిదరరాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళకంత నిదరరాదమ్మా
మ్మ్ మ్మ్ మ్మ్
ముసిరిన చీకటి ముంగిట
వేచిందీ కొమ్మా
ముద్దు మురిపాల..మువ్వగోపాల
నీవు రావేలా..అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
కంచికి పోతావ కృష్ణమ్మా
ముద్దు మురిపాల
ఆకంచి వార్తలేమి కృష్ణమ్మా
మువ్వగోపాల
కంచిలో ఉన్నది బొమ్మ
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
నీవు రావేలా..ఆ..ఆ..ఆ..ఆ
కంచికి పోతావ కృష్ణమ్మా..ఆ
ఆకంచి వార్తలేమి కృష్ణమ్మా..ఆ
పొంచి వింటున్నావా కృష్ణమ్మా..మ్మ్
అన్నీ మంచి వార్తలే కృష్ణమ్మా..హా
No comments:
Post a Comment