Thursday, July 29, 2010

మయూరి--1985




సంగీతం::S.P.బాలు
రచన::వేటూరి
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

ధితై తాం తై ధిధితై
తా తై ధిధితై తాతై ధిధితై
తాతై ధిధితై తాతై ధిధితై
తాతై ధిధితై..లలలలలాలలల
లాలలలాలలలలా 

మౌనం గానం మధురం మధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో
మౌనం గానం మధురం మధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం

చరణం::1

చైత్ర పవనాలు వీచే..మైత్రి గంధాలు పూసేను
వయసు ముంగిళ్ళు తీసి..వలపులే ముగ్గులేసేను
సుమ వీధుల్లో భ్రమరాలెన్నో
చెలి కన్నుల్లో భ్రమలేన్నెన్నెన్నో
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సాగేనులే శ్రుతిలో కృతిగా

మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం

చరణం::2

సససనీపమా నీపా మమమగామగా
దదదదా నీసదా పామ పపప పామారి
పపపపామారీదా

అరుణ చరణాల లోనే హృదయ కిరణాలు వెలిగేను
ముదిత పాదాల మువ్వే మువ్వ గోపాల పాడేను
అవి మోహాలో మధు దాహలో
చెలి హాసాలో తొలి మాసాలో
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
హంసధ్వనీ కళలే కలగా

మౌనం గానం మధురంమధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో
మౌనం గానం మధురం మధురాక్షరం 
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
మౌనం గానం మధురం మధురాక్షరం 

No comments: