Wednesday, July 28, 2010

శుభోదయం--1980




సంగీతం::K.V.మహాదేవన్
రచన::త్యాగరాజ స్వామి::కీర్తన
గానం::S.P.బాలు,P.సుశీల

తారాగణం::చంద్రమోహన్, సులక్షణ ,చారుహాసన్

పల్లవి::

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

అను పల్లవి::

అందమయిన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళ గంధము పుయ్యరుగా

తిలకము దిద్దరుగా..కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు
బలుకుల నమృతము లొలికెడు స్వామికి 

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

చరణం::1

చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాలబాలులతో
నాల మేపిన విశాలనయనునికి 

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

చరణం::2

పూజలు సేయరుగా..మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి 

గంధము పుయ్యరుగా పన్నీరు
గంధము పుయ్యరుగా

తిలకము దిద్దరుగా..కస్తూరి తిలకము దిద్దరుగా
చేలము గట్టరుగా బంగారు చేలము గట్టరుగా
పూజలు సేయరుగా..మనసార పూజలు సేయరుగా

గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా

No comments: