సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::D.C. నారాయణ రెడ్డి
గానం::S. P.బాలు,P.సుశీల,
తారాగణం::చలం,రోజారమణి, జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,పండరీబాయి,రాజబాబు,
రావు గోపాల రావు,జయలక్ష్మి
పల్లవి::
ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో
ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ?
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ?
ఈ పాలవెన్నెల్లో నా జాలి కళ్ళల్లో
ఈ పాలవెన్నెల్లో నా జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నేవేలే
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నేవేలే
చరణం::1
చుక్కలే నిను మెచ్చీ..పక్కనే దిగివచ్చీ
చుక్కలే నిను మెచ్చీ..పక్కనే దిగివచ్చీ
మక్కువే చూపితే నన్ను మరచేవో..ఓఓఓ
నన్ను మరచేవో
చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కటే కాదా
చుక్కలు వేలు ఉన్నా నా చుక్కి ఒక్కటే కాదా
లక్షల మగువలు ఉన్నా నా లక్ష్యమొక్కటే కాదా
నా లక్ష్మి ఒక్కటే కాదా..నా లక్ష్మి ఒక్కటే కాదా
ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ?
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నేవేలే
చరణం::2
తుంటరి చిరుగాలి కొంటెగా..నిను చూసి
తుంటరి చిరుగాలి కొంటెగా..నిను చూసి
పైటనే కాజేస్తే ఏమి చేస్తావో..ఏమి చేస్తావో
ఐతే ఏమవుతుందీ..నీ చేతిలోన అది ఉంటే
ఐతే ఏమవుతుందీ..నీ చేతిలోన అది ఉంటే
స్వర్గం దిగి వస్తుందీ..నా సామి తోడుగా ఉంటే
నా రాముని నీడ ఉంటే..
ఈ పాలవెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఉన్నారు ఎవ్వరూ వారెవరూ?
ఇద్దరూ ఒకరేలే ఆ ఒక్కరూ నీవేలే
ఆఆఆఆ లాలాలలామ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
No comments:
Post a Comment