Friday, July 30, 2010

మాంగల్య బలం--1958::తిలక్‌కామోద్::రాగం



సంగీతం::మాస్టర్ వేణు
రచన::శ్రీశ్రీ
గానం::P.సుశీల
Film Directed By::Adoorti SubbaaRao
తారాగణం::అక్కినేని,సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,

సూర్యకాంతం,రమణమూర్తి
తిలక్‌కామోద్::రాగం 

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడే నా హృదయం

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం::1

కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము..ఏమో
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం::2

రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు..ఊ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం..ఏమో
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం::3

అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే..ఏమో
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

No comments: