Saturday, July 03, 2010

దేవుడు చేసిన బొమ్మలు--1976


సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ 
గానం::V.రామకృష్ణ 
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,చలం,జయసుధ,ప్రభ,కల్పన,సాక్షి రంగారావు

పల్లవి::

ఈ జీవితమూ అంతే తెలియని స్వప్నమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ ఈ జీవితమూ

చరణం::1

కలలు చెదిరిపోతుంటాయి మరల మరల వస్తుంటాయి 
కలలు చెదిరిపోతుంటాయి మరల మరల వస్తుంటాయి
విడిపోయేవి ఈ దేహాలు మిగిలుండేవి అనుబంధాలు
ఈ జీవితమూ అంతే తెలియని స్వప్నమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ ఈ జీవితమూ

చరణం::2

తలచిన కోర్కెలు కూలినవి తలవనివెన్నో జరిగినవి 
తలచిన కోర్కెలు కూలినవి తలవనివెన్నో జరిగినవి
తగిలిన కాలికే తగిలేటప్పుడు జరిగినదే జరగకూడడా  
ఈ జీవితమూ అంతే తెలియని స్వప్నమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ ఈ జీవితమూ

చరణం::3

బొట్టును ఎవరో తుడిపేస్తారు మోడుకు ఎవరు చిగురిస్తారో  
ఇచ్చాడమ్మా ఈ బ్రతుకు ముందేమివ్వాలో వాడికే తెలుసు  
ఈ జీవితమూ అంతే తెలియని స్వప్నమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ 
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ
దీనికి ధ్యేయము తుదివరకూ జీవించడమూ

No comments: