రచన::వేటూరి
సంగీతం::విద్యా సాగర్
గానం::S. P.బాలు, చిత్ర
తారాగణం::A.N.R, హరీష్, సుజాత, నందిని
పల్లవి::
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
ఆత్రేయ ప్రేమ గీతం అందానికే వసంతం
నీ పాట పాడి నే పల్లవైతి
నీ పదము తప్ప యే పదములు దొరకక
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం
ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం
నీ జంట కోరి నే కీర్తనైతి
నీ స్వరము తప్ప యే వరములు అడగక
చరణం::1
లలలలలా లలలలలా
లలలాలలలాలాలలాలలాలలలా
పూతల్లో పురివిడిచిన పులకింత
చేతల్లో మునుపెరగని చమరింత
వులికి పడిన నీ నలక నడుములో
మెలిక పడితినే వీణలో తీగనై
తగిలిందే తాళం రగిలిందే రాగం
చినుకల్లే నా ఒణుకేతీరా తడికోరేటి తాపాలలో
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం..మ్మ్
చరణం::2
ఆఆఆ ఆఆఆఅ ఆఆఆఅ
మ్మ్ మ్మ్ మ్మ్
ఓ కే లే ముద్దెరగని సాయంత్రం
ఛీ పో లే సిగ్గేరిగిన తాంబూలం
కధలు తెలిసెలే యదల కనులలో
పురుడుకడిగిపో పువ్వుకే తేనెతో
నులిపెట్టే దీపం శీలలోనే శిల్పం
వలపల్లేరా వయసేతీరా జతలూగేటి జంపాలలో
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
ఆ ఘంటసాల రాగం పాడిందిలే సరాగం
నీ పాట పాడి నే పల్లవైతి
నీ పదము తప్ప యే పదములు దొరకక
నేనేమో నీలిమేఘం నీవేమో వాయువేగం
నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం
No comments:
Post a Comment