Wednesday, August 29, 2007

సత్తెకాలపు సత్తయ్య --1969




సంగీతం::M.S.విశ్వనాధన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

దర్శకుడు::K.బాలచందర్.

తారాగణం::చలం, శోభన్ బాబు, ఎస్.వరలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు,రాజశ్రీ, S.బాలకృష్ణన్,రోజారమణి,విజయలలిత   

:::::::::::

నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి

నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి


::::1

ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
సిగ్గులన్ని దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి
ఆ మగసిరి అల్లరి అంతా నాకోసం దాచినదేమో
ఆ మగసిరి అల్లరి అంతా నాకోసం దాచినదేమో
అందగాడు ఆశపెట్టే సయ్యాటలు ఎంతో హాయి

నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి


:::::2

ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
మల్లెలాగ నేను కూడా జడలోనే ఉంటే హాయి
ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
కాంతిలాగ నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు

నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి


!! నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
!!

No comments: